Varun Dhawan Health : ఇక్కడ సమంత, అక్కడ వరుణ్ ధావన్ - ఫ్యాన్స్‌కు టెన్షన్ టెన్షన్

సమంత మయోసైటిస్‌తో పోరాటం చేస్తున్నారు. ఆవిడ ఆ విషయం చెప్పినప్పటి నుంచి ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. హిందీలో వరుణ్ ధావన్ విషయంలోనూ ఫ్యాన్స్ అంతే! ఆయనకు ఏమైంది? ఏంటి? అనే వివరాల్లోకి వెళితే... 

Continues below advertisement

సమంత (Samantha) అభిమానులు టెన్షన్ పడుతున్నారు. కొన్ని రోజుల క్రితం తనకు మయోసైటిస్ ఉందని, ఆ వ్యాధితో పోరాటం చేస్తున్నానని చెప్పినప్పటి నుంచి ఆమె అభిమానులు ఎప్పటికప్పుడు ఆమెకు ఎలా ఉందో తెలుసుకోవాలని ఆరా తీస్తున్నారు. సమంత గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హిందీలో వరుణ్ ధావన్ (Varun Dhawan) విషయంలో కూడా అంతే! ఆయనకు ఏమైందో అని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ఆయనకు ఏమైంది? ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే...
 
వరుణ్ ధావన్‌కు
వెస్టిబ్యులర్ హైపోఫంక్షన్!
ఇటీవల హిందీ హీరో వరుణ్ ధావన్ (Varun Dhawan) ఓ ఇంటర్వ్యూలో తనకు వెస్టిబ్యులర్ హైపోఫంక్షన్ ఉందని వెల్లడించారు. ఆయన వయసు 35 ఏళ్ళు మాత్రమే. హిందీలో వరుసగా మాస్ కమర్షియల్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తున్నారు. ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ ఎప్పుడూ హుషారుగా కనిపిస్తారు. అటువంటి వరుణ్ ధావన్‌కు వ్యాధి ఏంటని ఫ్యాన్స్, ఆడియన్స్ టెన్షన్ పడ్డారు. ఆందోళన వ్యక్తం చేశారు.

Continues below advertisement

వెస్టిబ్యులర్ హైపోఫంక్షన్ అంటే ఏమిటి?
What Is Vestibular Hypofunction? : మన చెవిలో బ్యాలెన్స్ సిస్టమ్ ఉంటుంది. ఇదే వెస్టిబ్యులర్ సిస్టమ్. చెవిలోని అంతర్గత భాగం సరిగ్గా పనిచేయనప్పుడు లేదా పనిచేయడం పూర్తిగా ఆగిపోయినప్పుడు  వెస్టిబ్యులర్ హైపో ఫంక్షన్ పరిస్థితి ఏర్పడుతుంది. మైకం కలగడం, కళ్లు తిరుగుతున్నట్టు అవ్వడం, వికారం వంటివి కలుగుతాయి. అభిమానులు ఆందోళన వ్యక్తం చేయడంతో వరుణ్ ధావన్ సోషల్ మీడియాలో తన హెల్త్ అప్ డేట్ ఇచ్చారు. 

యోగా, స్విమ్మింగ్...
ఇప్పుడు అంతా ఓకే!
''ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నా ఆరోగ్యం 100 శాతం బాలేదని చెప్పాను. ఆ తర్వాత మీరు నా మీద చూపించిన ప్రేమ, ఆందోళన... నా హృదయానికి తాకింది. మళ్ళీ నేను పూర్తి ఆరోగ్యంతో ఉండడానికి, కోలుకోవడానికి అవసరమైన శక్తిని 100 శతాం ఇచ్చింది'' అని వరుణ్ ధావన్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బావుందని, ఎవరూ ఆందోళన చెందవద్దని ఆయన ట్వీట్ చేశారు.


 
''యోగ, స్విమ్మింగ్, ఫిజియో థెరపీ వల్ల ఇంతకు ముందు కంటే ఇప్పుడు నా ఆరోగ్యం బావుంది. జీవన శైలిలో మార్పులు చేసుకోవడం వల్ల మెరుగ్గా ఉంది. సూర్యరశ్మి పొందడం కూడా ముఖ్యమే. అన్నిటి కంటే భగవంతుడి ఆశీర్వాదం ముఖ్యం'' అని వరుణ్ ధావన్ పేర్కొన్నారు. 

Also Read : హృతిక్, యష్, రణ్‌వీర్ 'నో' చెప్పారు - విజయ్ దేవరకొండ 'యస్' అంటాడా?

వరుణ్ ధావన్, సమంత కంటే ముందు దీపికా పదుకోన్, శృతి హాసన్, పరిణీతి చోప్రా, నయనతార, స్నేహా ఉల్లాల్, ఇలియానా వంటి కథానాయికలు జీవితంలో తాము ఎదుర్కొన్న ఆరోగ్య సమస్యల గురించి మీడియా ముఖంగా చెప్పారు. వ్యాధి బారిన పడినప్పుడు కుంగిపోకూడదని, ధైయంగా పోరాటం చేయాలని ప్రేక్షకులకు సందేశం ఇచ్చారు. 

వరుణ్ ధావన్ హీరోగా నటించిన 'బేడియా' ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. అందులో కృతి సనన్ హీరోయిన్. ఆ సినిమాలో రెండు పాటలను విడుదల చేశారు. వాటికి మంచి రెస్పాన్స్ లభిస్తోంది.   

Continues below advertisement
Sponsored Links by Taboola