'క్రాక్'లో జయమ్మగా... 'నాంది'లో న్యాయవాదిగా... తమిళ మూవీ విజయ్ 'సర్కార్'లో ప్రతినాయక ఛాయలున్న పాత్రలో ఓ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి కుమార్తెగా... ఎటువంటి పాత్రలో అయినా సరే ఒదిగిపోయి నటించడం వరలక్ష్మీ శరత్ కుమార్ (Varalaxmi Sarathkumar) స్టైల్. ఇప్పుడు ఆవిడ తెలుగు సినిమాలు ఎక్కువ చేస్తున్నారు. తెలుగు దర్శక - నిర్మాతలతో ఆవిడ చేస్తున్న పాన్ ఇండియా సినిమా 'శబరి' (Sabari Movie).

వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో మహా మూవీస్ పతాకంపై మహర్షి కూండ్ల సమర్పణలో మహేంద్రనాథ్ కూండ్ల నిర్మిస్తున్న పాన్ ఇండియా సినిమా 'శబరి'. అనిల్ కాట్జ్ (Anil Katz) దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రూపొందుతోంది. ఆల్రెడీ రెండు షెడ్యూల్స్ కంప్లీట్ అయ్యాయి. తాజాగా విశాఖలో మూడో షెడ్యూల్ కంప్లీట్ చేశారు. 


విశాఖలో వరలక్ష్మి యాక్షన్!
Sabari Team Completes Vizag Schedule : విశాఖలోని ఆర్కే బీచ్, సిరిపురం జంక్షన్‌తో పాటు అరకు (Araku) లాంటి అందమైన లొకేషన్లలో 'శబరి' చిత్రీకరణ చేశారు. ప్రధాన తారాగణంపై కొన్ని యాక్షన్ సీక్వెన్సులు, ఓ పాట, కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. నందు, నూర్ మాస్టర్స్ పర్యవేక్షణలో రూపొందిన యాక్షన్ సీన్స్ సినిమాలో హైలెట్ అవుతుందని చిత్ర బృందం తెలిపింది.


హైదరాబాద్‌లో లాస్ట్ షెడ్యూల్!
త్వరలో ఈ నెలలోనే హైదరాబాద్‌లో ఫైనల్ షెడ్యూల్ మొదలు కానుందని నిర్మాత తెలిపారు. హైదరాబాద్ షెడ్యూల్‌తో సినిమా చిత్రీకరణ మొత్తం పూర్తి కానుంది. ఈ నెల చివరి వారంలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభించనున్నారు.


కాలేజీ ఫంక్షన్‌లో 'శబరి' డ్యాన్స్!
'శబరి'లో వరలక్ష్మి టైటిల్ రోల్ చేస్తున్నారు. ఆవిడ కాలేజీ ఫంక్షన్‌లో ఎందుకు డ్యాన్స్ చేశారనేది సినిమా చూస్తే తెలుస్తుంది. విశాఖ షెడ్యూల్ కంప్లీట్ అయిన సందర్భంగా విడుదల చేసిన స్టిల్స్‌లో వరలక్ష్మి డ్యాన్స్ ఫోటోలు ఉన్నాయి. 


"వరలక్ష్మీ శరత్ కుమార్ గారు ఎంపిక చేసుకునే చిత్రాలు భిన్నంగా ఉంటాయి. మా 'శబరి' కూడా అటువంటి భిన్నమైన చిత్రమే. ఈ చిత్రంలో స్వతంత్ర భావాలున్న యువతిగా ఆమె కనిపిస్తారు. యాక్షన్ ఎపిసోడ్స్‌లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. అన్ని హంగులున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు తీసుకు వద్దామా? అని ఎదురు చూస్తున్నాం'' అని అన్నారు. "క్రైమ్ నేపథ్యంలో రూపొందిస్తున్న సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రమిది. వరలక్ష్మీ శరత్ కుమార్ గారు ఇప్పటి వరకూ చేయని పాత్రను మా 'శబరి' సినిమాలో చేస్తున్నారు" అని నిర్మాత మహేంద్రనాథ్ కూండ్ల చెప్పారు.


Also Read : 'ఊర్వశివో రాక్షసివో' రివ్యూ : ఆరు ముద్దులు, ఆ తర్వాత అర్థమైందిగా -  అల్లు శిరీష్ సినిమా ఎలా ఉందంటే?






గణేష్ వెంకట్రామన్, శశాంక్, మైమ్ గోపి, సునయన, రాజశ్రీ నాయర్, మధునందన్, రషిక బాలి (Bombay), వైవా రాఘవ, ప్రభు, భద్రం, కృష్ణ తేజ, బిందు పగిడిమర్రి, ఆశ్రిత వేముగంటి, హర్షిని కోడూరు, అర్చన అనంత్, ప్రమోదిని బేబీ నివేక్ష, బేబీ కృతిక తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి రచనా సహకారం: సన్నీ నాగబాబు, పాటలు: రహమాన్, మిట్టపల్లి సురేందర్, ఛాయాగ్రహణం : రాహుల్ శ్రీవాత్సవ, నాని చమిడి శెట్టి , సంగీతం: గోపి సుందర్, సమర్పణ: మహర్షి కూండ్ల.