వంటలక్క, ఇది పేరు కాదు.. బుల్లితెర ప్రేక్షకుడి ఎమోషన్. టీవీ సీరియల్స్ చూసేవారికి ఈ పేరు వింటే వస్తుంది వైబ్రేషన్. ఆ సీరియల్ చూడనివారికి ఆ పేరంటే ఫ్రస్ట్రేషన్. కానీ, మీమ్ మేకర్స్ మాత్రం ఆమె ఒక సొల్యుషన్. ఎందుకంటే.. మీమ్స్ క్రియేట్ చేయడమంటే చాలా కష్టం. సింపుల్‌గా నవ్వించగలగాలి. అయితే, వంటలక్క వంటి ఫేమస్ క్యారెక్టర్ మీద క్రియేట్ చేసే ప్రతి మీమ్‌కు మాంచి రీచ్ ఉంటుంది. అందుకే, మీమ్ మేకర్స్ డౌన్లో ఉన్నప్పుడు వంటలక్క ఆదుకుంటుంది. పరిష్కారాన్ని చూపుతుంది. ఇప్పుడు కూడా అదే జరిగింది. చాలా రోజులుగా వంటలక్క కనిపించకపోయేసరికి ‘కార్తీక దీపం’ సీరియల్ అభిమానులే కాదు, మీమ్ మేకర్స్ సైతం బెంగ పెట్టుకున్నారు. అయినా కార్తీక్, దీప లేని ‘కార్తీక దీపం’ ఏమిటీ? ‘ఉయ్ వాంట్ దీపక్క రైట్ నౌ’ అంటూ గత కొన్ని ఎపిసోడ్లుగా అభిమానులు పోరాడుతున్నారు. అందుకే, ‘వంటలక్కా ఈజ్ బ్యాక్’.
ప్రస్తుతం సోషల్ మీడియాలో #VantalakkaIsBack బాగా ట్రెండవ్వుతోంది. ముఖ్యంగా మీమ్స్‌కు కళ వచ్చింది. తాజాగా ‘స్టార్ మా’.. ‘‘లక్షలాది ఎదురుచూపులు నిజమై కోలుకున్న దీప’’ అంటూ ప్రోమో వదిలేశారు. దీప హాస్పిటల్ బెడ్ మీద ఉన్నట్లుగా చూపించారు. ప్రమాద ఘటన గుర్తుచేసుకుంటూ ఆమె కోమాలో నుంచి బయటకు వచ్చినట్లు.. లేవగానే ‘‘డాక్టర్ బాబు’’ అని అరవడాన్ని ఈ ప్రోమోలో చూడవచ్చు. ఈ ప్రోమో చూడగానే ‘కార్తీక దీపం’ అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ‘వంటలక్క ఈజ్ బ్యాక్’ అంటూ సంబరాలు చేసుకుంటున్నారు. ‘‘ఆసియా కప్ వస్తోంది. మీ టీఆర్పీ కోసం.. మా క్రికెట్ లవర్స్‌ను చంపొద్దు. ఇంకొన్ని రోజులు వంటలక్కను అండర్‌గ్రౌండ్‌కు పంపేయండి’’ అని ఒకరు.. ‘‘కార్తీక్, మోనితాలను కూడా తీసుకొస్తున్నారంట’’ అని మరొకరు. ఇలా కామెంట్ల వరద పారుతోంది. ఇదిగో ఈ మీమ్స్, కామెంట్స్ చూస్తే తప్పకుండా మీరు కూడా పగలబడి నవ్వుతారు.
కార్తీకదీపం సీరియల్‌లోకి వంటలక్క రీ ఎంట్రీ ఇస్తోందా అనే సందేహం చాలా రోజుల నుంచి ఉంది. వంటలక్క దీపగా ప్రేమీ విశ్వనాథ్ నటనకు పిధా కానివారు లేరు. నిజంగా ఆమెకు అన్యాయం జరిగిపోయినట్టు సోషల్ మీడియాలో డాక్టర్ బాబు -వంటలక్క కలిసేది ఎప్పుడంటూ పెద్ద ఉద్యమమే జరిగింది. ఎట్టకేలకు మోనిత కుట్రలకు చెక్ పెట్టి దీప-డాక్టర్ బాబు ఒక్కటయ్యారు. అప్పట్లో హనీమూన్ కోసం వెళ్లిన చిక్ మంగుళూరు టూర్‌కు మళ్లీ వెళ్లారు. తమకు కలతలు మొదలైన ప్లేస్ లో మళ్లీ సంతోషంగా గడిపి తిరిగిరావాలనుకున్నారు. కానీ హిమ డ్రైవింగ్ సరదా కారణంగా కారు ప్రమాదానికి గురయ్యారు. ఆ కారులోంచి హిమను తోసేసిన డాక్టర్ బాబు-వంటలక్క.. శౌర్య జాగ్రత్తమ్మా అని చెబుతారు. ఆ తర్వాత ఆ కారు లోయలో పడి పేలిపోయింది. హిమలానే డాక్టర్ బాబు, వంటలక్క కూడా ఆ కార్లోంచి బయట పడ్డారా? ఎప్పటికైనా తిరిగొస్తారా? అనే సందేహం ప్రేక్షకుల్లో ఉంది. ఎట్టకేలకు వంటలక్క రీ-ఎంట్రీ అది తేలిపోయింది. మరి డాక్టర్ బాబు ఎక్కడ ఉన్నారనేది తెలియాలి. వంటలక్క ఆ రోజు ఏం జరిగింది? తాను ఎలా బయటపడింది? డాక్టర్ బాబు పరిస్థితి ఏమిటనేది గుర్తుతెచ్చుకుని చెబితేగానీ ఉత్కంఠత వీడదు.
Also Read: పెళ్లి ఆపేందుకు ప్లాన్ చేస్తున్న హిమ-ప్రేమ్, తగ్గేదే లే అంటున్న శౌర్య, పగతో రగిలిపోతున్న శోభ
గమనిక: మీరు కాసేపు సరదాగా నవ్వుకోడానికి మాత్రమే ఈ మీమ్స్. ఇతరుల మనోభావాలు, అందులోని పాత్రధారులు, సంబంధిత మీడియాను కించపరిచే ఉద్దేశం లేదు. ఇందులో చూపించిన మీమ్స్ అన్నీ ఆయా వ్యక్తుల అభిప్రాయం మాత్రమే. వాటికి ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు.