'వలిమై'... 'వలిమై'... 'వలిమై'... తమిళనాడు థియేటర్లలో ఈ సినిమా సందడి అంతా ఇంతా కాదు! రెండున్నర ఏళ్ల విరామం తర్వాత తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన సినిమా థియేటర్లలోకి రావడం ఒకటి అయితే... ఆల్రెడీ విడుదలైన టీజర్, ట్రైలర్లు సినిమాపై తమిళ ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు పెంచాయి. వెరసి... తమిళ నాట ఫస్ట్ డే టికెట్లలో 95 శాతం అడ్వాన్స్ బుకింక్స్‌లో సేల్ అయ్యాయి.
చెన్నైలోని రోహిణి థియేటర్‌లో నిర్మాత బోనీ కపూర్, హీరోయిన్ హ్యూమా ఖురేషి, 'వలిమై'లో విలన్ రోల్ చేసిన తెలుగు హీరో కార్తికేయ ఎర్లీ మార్నింగ్ షో చూశారు. అజిత్ 'ఎంతవాడుగాని', రామ్ చరణ్ 'బ్రూస్ లీ', ప్రభాస్ 'సాహో' సినిమాల్లో నటించిన అరుణ్ విజయ్ కూడా ఎర్లీ మార్నింగ్ షో చూశారు.
'వలిమై' థియేటర్లన్నీ ప్రేక్షకులతో కళకళలాడాయి. ఓవర్సీస్, తమిళనాడులో ఎర్లీ మార్నింగ్ షోస్ చూసిన ప్రేక్షకులు సినిమా సూపర్ అని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఈ సినిమా ట్విట్టర్ రివ్యూ ఎలా ఉందో చూడండి. అజిత్ ఎంట్రీ అదుర్స్ అని చాలామంది చెబుతున్నారు. ఓ ఫ్యాన్ అయితే 4/5 రేటింగ్ ఇచ్చారు. ఇంకొకరు అయితే 'వలిమై' టైటిల్ డిజైన్ ఎందుకు అలా చేశారో సినిమా చూస్తే తెలుస్తుందని, ఆ డిజైన్ వెనుక ఓ కారణం ఉందని పేర్కొన్నారు. ఇంకా ఎవరు ఏం ట్వీట్స్ చేశారంటే...