By: ABP Desam | Updated at : 27 Oct 2022 05:35 PM (IST)
'అన్‌స్టాపబుల్' షోకి బ్రేక్ - ఫ్యాన్స్ కోసం అన్ సెన్సార్డ్ వెర్షన్ రెడీ!
నందమూరి బాలకృష్ణ(Balakrishna) హోస్ట్‌గా వ్యవహరిస్తున్న 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే'(Unstoppable with NBK) సీజన్-2 రికార్డులు బ్రేక్ చేస్తోంది. ఫస్ట్ ఎపిసోడ్‌లో తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్ గెస్టులుగా వచ్చిన సంగతి తెలిసిందే. వారు బాలయ్యకు బంధువులు కూడా కావడం, ఈ ఎపిసోడ్‌కు ముందు వదిలిన ప్రోమో అభిమానుల్లో అంచనాలు పెంచేయడంతో.. ఫస్ట్ ఎపిసోడ్ సరికొత్త రికార్డులను సృష్టించింది. 24 గంటల వ్యవధిలో పది లక్షల మందికి పైగా ఈ ఎపిసోడ్‌ను చూశారు. ఇదివరకు ఎన్నడూ ఆహా షోకు ఈ స్థాయిలో వ్యూస్ రాలేదట.
సెకండ్ ఎపిసోడ్ కి యంగ్ హీరోలు సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ లు గెస్ట్ లుగా వచ్చారు. మూడో ఎపిసోడ్ కి ఎవరు అతిథులుగా వస్తారనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది. అభిమానులు కూడా మూడో ఎపిసోడ్ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రతి శుక్రవారం ప్రసారమవుతూ వచ్చిన అన్‌స్టాపబుల్ సీజన్ 2 రేపు ప్రసారం కావడం లేదట. ఎందుకనేది కారణం చెప్పలేదు కానీ.. కొత్త ఎపిసోడ్ కి బదులుగా చంద్రబాబు, నారా లోకేష్ ఎపిసోడ్ అన్ సెన్సార్డ్ వెర్షన్‌ను అప్లోడ్ చేయబోతున్నారట. దీనికి సంబంధించిన ప్రకటన కూడా వచ్చింది.
అన్ సెన్సార్డ్ వెర్షన్ అంటే.. అసలు ఎపిసోడ్ వెనుక ఏం జరిగిందనేది చూపించబోతున్నారు. నిజానికి ఎపిసోడ్ 3ని కూడా షూట్ చేయాలనుకున్నారు కానీ బాలయ్య 'వీర సింహారెడ్డి' షూటింగ్ లో బిజీగా ఉండడంతో అన్‌స్టాపబుల్ కి బ్రేక్ వచ్చినట్లు తెలుస్తోంది.
Inkenno secretlu, marinni storylu.
Miss avvakunda chudandi #BOAT meets #GOAT Uncensored Episode.😎#UnstoppableWithNBKS2 #NBKonAHA #NandamuriBalakrishna pic.twitter.com/VivbDsiXct— ahavideoin (@ahavideoIN) October 27, 2022
'అన్‌స్టాపబుల్' కోసం బాలయ్య రెమ్యునరేషన్:
మొదటి సీజన్ కి బాలయ్య కేవలం రెండున్నర కోట్లు మాత్రమే తీసుకున్నారని టాక్. అప్పటికి ఆ షో ఇంపాక్ట్ బాలయ్యకు తెలియదు. అందుకే ఆయన తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నారు. అయితే బాలయ్య హోస్ట్ చేయడం వలనే 'ఆహా'కి సబ్ స్క్రిప్షన్లు 15 లక్షల వరకు పెరిగాయని అంచనా. ఇప్పుడు సీజన్ 2 కోసం బాలయ్య కాస్త భారీ రెమ్యునరేషన్ కోట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఎంత రెమ్యునరేషన్ ఇస్తున్నారనేది ఫైనల్ కాలేదు కానీ అందుతున్న సమాచారం ప్రకారం.. బాలయ్య రూ.10 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఎలా లేదన్నా.. బాలయ్యకు ఐదారు కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
నిర్మాతగా బాలయ్య కూతురు:
బాలయ్య రెండో కూతురు తేజశ్విని 'అన్‌స్టాపబుల్' టాక్ షోకు క్రియేటివ్ కన్సల్టెంట్ గా పని చేశారు. అయినప్పటికీ.. ఆమె గురించి బాలకృష్ణ కూడా షోలో గానీ, బయట గానీ చెప్పలేదు. అసలు.. ఇప్పటి వరకూ బాలకృష్ణ కుమార్తెకు ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్డ్ వైపు ఇంట్రెస్ట్ ఉన్నట్టు కూడా ఎవరికీ తెలియదు. సైలెంట్‌గా వచ్చిన తేజస్విని తొలి స్టెప్‌లోనే.. సక్సెస్ ఫుల్ అయ్యారు. ఇప్పుడు తేజస్విని నిర్మాతగా మారబోతున్నట్లు సమాచారం. తన తండ్రి బాలకృష్ణ హీరోగా తేజస్విని ఓ సినిమాను నిర్మించాలనుకుంటున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ ను రెడీ చేసే పనిలో పడ్డారు. త్వరలోనే డైరెక్టర్ ని ఫైనల్ చేయబోతున్నారు.
Also Read: బాలయ్య వర్సెస్ చిరు - అల్టిమేటం జారీ చేసిన డిస్ట్రిబ్యూటర్లు?
Radhika Apte: బాలీవుడ్ బడా ఫ్యామిలీ వారసుడితో 'లెజెండ్' హీరోయిన్ ఎఫైర్... రాధికా ఆప్టే రియాక్షన్ ఏమిటంటే?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today January 16th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: విహారినే నా భర్తని తేల్చేసిన లక్ష్మీ! విహారిని గెంటేసిన మామ! నడి వీధిలో అవమానం!
Dhurandhar 2: ధురంధర్ 2 ట్రైలర్ వర్క్ మొదలు… అక్షయ్ ఖన్నా షూట్ చేసిందేమీ లేదు
Dhanush Mrunal Thakur Wedding: ధనుష్, మృణాల్ ఠాకూర్ పెళ్లి ముహూర్తం ఖరారైందా? అసలు నిజం ఏమిటంటే??
Surya Kumar Yadav - Khushi Mukherjee: క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్‌పై కామెంట్స్... ఖుషి ముఖర్జీపై ఎఫ్ఐఆర్ - 100 కోట్ల పరువు నష్టం దావా కేస్
BMC Election Results 2026: ముంబై మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం, ఫలితాల ప్రకటనలో జాప్యం.. కారణం ఇదే
Viral Video: 6 అడుగుల బ్లాక్ కోబ్రాతో గేమ్స్.. చికిత్సకు ముందే పాము కాటుతో వ్యక్తి మృతి- వీడియో వైరల్
మొబైల్స్ లో మునిగి చదువుకు దూరమవుతున్న పిల్లల్ని దార్లోకి తీసుకురావాలంటే ఇలా చేయండి!
SlumDog 33 Temple Road: పూరి - సేతుపతి సినిమాకు 'స్లమ్‌డాగ్' టైటిల్ ఫిక్స్... ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారోచ్