గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఫ్యాన్స్‌కు సంక్రాంతికి డబుల్ బొనాంజా రెడీ అయ్యింది. సిల్వర్ స్క్రీన్ మీద 'వీర సింహా రెడ్డి' సినిమా... డిజిటల్ స్క్రీన్ మీద ఆ సినిమా టీమ్ అతిథులుగా వచ్చిన 'అన్‌స్టాపబుల్‌ 2' ఎపిసోడ్... డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇస్తున్నారు బాలకృష్ణ. 


బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న సూపర్ డూపర్ హిట్ టాక్ షో 'అన్‌స్టాపబుల్‌ 2'. ఆల్రెడీ సెకండ్ సీజన్ కూడా సూపర్ సక్సెస్ అయ్యింది. ఇప్పుడీ షోకి 'వీర సింహా రెడ్డి' టీమ్ వచ్చింది. హీరోయిన్లు హానీ రోజ్, వరలక్ష్మీ శరత్ కుమార్, దర్శకుడు గోపీచంద్ మలినేని, నిర్మాత నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్ సందడి చేశారు. ఆ ఎపిసోడ్ స్పెషల్ ప్రోమో ఈ రోజు విడుదల చేశారు.


ఇంటర్వెల్ ఓకే చేసినప్పుడే బ్లాక్ బస్టర్
'వీర సింహా రెడ్డి' ఇంటర్వెల్ బ్లాక్ చెప్పినప్పుడు బాలకృష్ణ ఓకే చేశారని, అప్పుడే సినిమా బ్లాక్ బస్టర్ అనే నిర్ణయానికి వచ్చానని గోపీచంద్ మలినేని అన్నారు. ఆ తర్వాత అతడిని బాలకృష్ణ ఓ ఆట ఆదుకున్నారు. ''డబుల్ రోల్ పెట్టి బాగా వాడేసుకున్నావ్! ఇప్పుడు సినిమా కుమ్మేశావ్. నన్ను నానా కుమ్ముడు కుమ్మేశావ్'' అని బాలకృష్ణ అన్నారు. అంతే కాదు... 'అన్‌స్టాపబుల్‌ 2'లో దర్శకుడు గోపిచంద్ మలినేని ఎమోషనల్ అయ్యారు. 'క్రాక్' విడుదలకు ముందు ప్రాపర్టీ అమ్మిన విషయాన్ని, పడిన ఇబ్బందులను గుర్తు చేయడంతో ఆయన కంటతడి పెట్టారు. అంతకు ముందు అతడిని బాలయ్య ఓ ఆట ఆదుకున్నారు. 


బాలకృష్ణ సినిమాలో వరలక్ష్మి విలనా?
వరలక్ష్మి సినిమాలో బాలకృష్ణ హీరోనా?
'అన్‌స్టాపబుల్‌ 2'కు వచ్చిన అతిథులతో బాలకృష్ణ చేసే సందడి అభిమానులను, ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. తన స్టార్ స్టేటస్ పక్కన పెట్టి మరీ ఆయన కొన్ని డైలాగులు వేస్తున్నారు. లేటెస్ట్ ప్రోమోలో ''బాలకృష్ణ సినిమాలో వర విలనా? లేదంటే వరలక్ష్మి విలన్ చేసిన సినిమాలో బాలకృష్ణ హీరోనా?'' అని అడిగారు. ఒక్కసారిగా వరలక్ష్మీ శరత్ కుమార్ ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. తాను ఎక్కువ హైపర్ అని, తన కంటే బాలకృష్ణ ఎక్కువ హైపర్ అని ఆమె చెప్పారు.  


రవితేజ ఫోన్ కాల్
సంక్రాంతికి వచ్చే బాలకృష్ణ సినిమా నిజమైన 'అన్‌స్టాపబుల్‌' అని ఆయన ప్రోమో స్టార్టింగ్ చెప్పేశారు. మలయాళ భామ, సినిమాలో మరో కథానాయిక హానీ రోజ్ తో కలిసి స్టెప్పులు వేశారు. అప్పుడు తొడ కొడుతూ డ్యాన్స్ చేయడం విశేషం. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే... రవితేజ ఫోన్ చేయడం! ''వంద కోట్ల హీరోకి కంగ్రాచ్యులేషన్స్'' అని బాలకృష్ణ చెబితే... ''థాంక్యూ థాంక్యూ తమ్ముడు'' అని రవితేజ అనడం విశేషం. నిర్మాతలు రవిశంకర్, నవీన్ ఎర్నేనితో డ్యాన్స్ చేయించడం విశేషం. 


Also Read : ముతక పంచె, నల్ల చొక్కా, చుట్ట - 'వీర సింహా రెడ్డి' గెటప్ వెనుక కథ వివరించిన బాలకృష్ణ






జనవరి 13న 'వీర సింహా రెడ్డి' ఎపిసోడ్
'వీర సింహా రెడ్డి' సినిమా జనవరి 12న (అనగా... ఈ గురువారం) థియేటర్లలో విడుదల కానుంది. సినిమా విడుదలైన తర్వాత రోజు 'అన్‌స్టాపబుల్‌ 2'లో సినిమా యూనిట్ సందడి చేసిన ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. అంటే... జనవరి 13న విడుదల అన్నమాట. నిజం చెప్పాలంటే... గురువారం రాత్రి పన్నెండు గంటల నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. 


పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ఎప్పుడు?
'అన్‌స్టాపబుల్‌ 2'కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా వచ్చారు. అయితే, ఆయన ఎపిసోడ్ ఎప్పుడు విడుదల చేశారు? అని మెగా అభిమానులు, పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. తొలుత సంక్రాంతికి విడుదల అవుతుందని భావించినా... ప్రస్తుత పరిస్థితి చూస్తే మరి కొన్ని వారాల తర్వాత వచ్చే అవకాశం ఉంది. పవన్ ఎపిసోడ్ ఈ సెకండ్ సీజన్ లాస్ట్ ఎపిసోడ్ కావచ్చని కూడా ప్రచారం జరుగుతోంది. 



Also Read : 'తెగింపు' రివ్యూ : అజిత్ విలనా? హీరోనా? - తెలుగు ప్రేక్షకులకు సినిమా నచ్చుతుందా?