Jr NTR Reply To chandrababu :  చంద్రబాబును మామయ్యా అని ఆప్యాయంగా పిలుస్తూ జూనియర్ ఎన్టీఆర్ చేసిన ఓ ట్వీట్ రిప్లయ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ అద్భుతంగా డాన్స్ చేసిన నాటు నాటు పాటకు ఆస్కార్ తర్వాత అంతటి ప్రతిష్టాత్మక అవార్డుగా భావించే గోల్డెన్ గ్లోబ్ అవార్డు లభించింది. ఆ విషయంపై చంద్రబాబునాయుడు ఉదయం మూవీ టీంను అభినందిస్తూ  ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు జూనియర్ ఎన్టీఆర్ రిప్లై ఇచ్చారు. ధ్యాంక్యూ సోమచ్ మామయ్యా అని రిప్లయ్ ఇచ్చారు. 





అదే సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, సీఎం జగన్ కూడా ఆర్ ఆర్ ఆర్ టీంను అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పట్టారు. ఈ అభినందనల ట్వీట్స్ కూడా జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. ప్రధాని మోదీకి కూ స్పందించి.. రీట్వీట్ చేశారు.  ధ్యాంక్యూ సార్ హానర్డ్ అని స్పందించారు. 





సీఎం జగన్‌కు ధ్యాంక్యూ సార్ అని రిప్లయ్ ఇచ్చారు. 







 అయితే ప్రధాని మోదీ , సీఎం  మోదీలు.. అవార్డు వచ్చిన విషయాన్ని చెబుతూ..  చేసిన ట్వీట్‌లో ఎన్టీఆర్ ను కూడా ట్యాగ్ చేశారు. చంద్రబాబు చేసిన ట్వీట్‌లో  ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇలా ఎవర్నీ ట్యాగ్ చేయలేదు. కీరవాణితో  పాటు రాజమౌళిని మాత్రమే ట్యాగ్ చేశారు. అయినప్పటికీ ఎన్టీఆర్ స్పందించారు. 


ఇటీవలి కాలంలో ఎన్టీర్.. చంద్రబాబు పుట్టిన రోజులకు కూడా పెద్దగా  శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్లు చేసిన సందర్భాలు లేవు. కానీ ఇప్పుడు మాత్రం ధ్యాంక్యూ మామయ్యా అని ప్రత్యేకంగా బంధుత్వం కలుపుతూ చెప్పడం సహజంగానే  చర్చనీయాంశం అవుతోంది. ఎన్టీఆర్ అమెరికా నుంచి వచ్చిన తర్వాత చంద్రబాబుతో సమావేశం అవుతారని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. అది నిజమో కాదో తెలియదు కానీ.. ఈ రిప్లయ్ మాత్రం టీడీపీ నేతల్ని ఆకట్టుకుంటోంది. 


 'ఆర్ఆర్ఆర్' సినిమాలో 'నాటు నాటు...' పాటకు గోల్డెన్ గ్లోబ్   బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డు ప్రకటించారు.  భారత చలన చిత్ర పరిశ్రమలో మరో రికార్డు సొంతం చేసుకుంది ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం. గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్ర ప్రభంజనం మొదలైంది. నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కింది. ఈ అవార్డు ప్రకటించిన వెంటనే ఆ హాల్‌ మొత్తం ఒక్కసారిగా కరతాళధ్వనులతో మారుమోగిపోయింది. అక్కడే ఉన్న ట్రుపుల్ ఆర్ టీం దీన్ని చూసి ఎంజాయ్ చేసింది. ట్రిపుల్ ఆర్‌ సాధించిన అవార్డు భారతీయ చలనచిత్రం రంగం సెలబ్రేట్ చేసుకుంటుంది. ఆస్కార్ రేసులోనూ విజయం సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.