Unstoppable 2 First Episode : చంద్రబాబుతో బాలకృష్ణ - 'అన్‌స్టాప‌బుల్‌ 2'కు ఫ్యామిలీ & పొలిటికల్ టచ్

అక్టోబర్ 14న 'అన్‌స్టాప‌బుల్‌ 2' ప్రారంభం కానుంది. తొలి ఎపిసోడ్‌కు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అతిథిగా వచ్చారు. ఆయనతో బాలకృష్ణ సంభాషణ ఏ విధంగా సాగింది? అనేది ఆసక్తికరంగా మారింది.

Continues below advertisement

కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది... 'అన్‌స్టాప‌బుల్‌ 2' (Unstoppable Season 2) ఫస్ట్ ఎపిసోడ్ స్ట్రీమింగ్‌కు మరో మూడు రోజులు మాత్రమే ఉంది! ఎవరు... ఫస్ట్ ఎపిసోడ్‌లో సందడి చేసే గెస్ట్ ఎవరు? అనే ప్రశ్నకు ఆహా తెర దించింది. అయితే... బావ బావమరిది కలిసి చేసిన సందడి ఎలా ఉంటుందనేది ఆసక్తి, ఉత్కంఠ మొదలయ్యాయి. 

Continues below advertisement

Unstoppable 2 First Episode : 'అన్‌స్టాప‌బుల్‌ 2'కు ఫ్యామిలీ & పొలిటికల్ టచ్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ అధినేత, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కు స్వయానా బావ, వియ్యంకుడు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) సీజన్ 2 ఫస్ట్ ఎపిసోడ్‌లో సందడి చేయనున్నారు.  

ఇద్దరు లెజెండ్స్... ఒక్క ఎపిసోడ్!
చంద్రబాబు 'అన్‌స్టాప‌బుల్‌ 2'కు వచ్చారనే విషయం తెలియడంతో ఫస్ట్ ఎపిసోడ్ కోసం సగటు సినిమా ప్రేక్షకులు, షో అభిమానులు మాత్రమే కాదు... రాజకీయ వర్గాలు కూడా వెయిట్ చేస్తున్నాయి.

''షో మొదలు పెడదామా? బ్లాక్‌బ‌స్ట‌ర్‌ షో 'అన్‌స్టాప‌బుల్‌ విత్ ఎన్‌బీకే' సీజన్ 2 మళ్ళీ వీక్షకుల ముందుకు వచ్చింది. నారా చంద్రబాబు నాయుడు కంటే సీజన్ 2 స్టార్ట్ చేయడానికి బెటర్ ఏముంటుంది? ఇది సెన్సేషనల్ ఎపిసోడ్'' అని 'ఆహా' ఓటీటీ పేర్కొంది.

కుటుంబ విషయాలతో పాటు
రాజకీయ చర్చలు వస్తాయా?
చంద్రబాబు, బాలకృష్ణ మధ్య సంభాషణల్లో కుటుంబ విషయాలతో పాటు రాజకీయ చర్చలు వస్తాయా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే...  'అన్‌స్టాప‌బుల్‌' ఫస్ట్ సీజన్‌లో మోహన్ బాబు ఎపిసోడ్‌లో పొలిటికల్ డిస్కషన్ జరిగింది. రవితేజ వచ్చినప్పుడు 'ఏంటి బాసూ... నీకు, నాకు గొడవలు అంట కదా?' అంటూ రూమర్స్ క్లియర్ చేశారు బాలకృష్ణ. 

తెలుగుదేశం పార్టీ, ఏపీ రాజకీయాలకు సంబంధించిన చాలా విషయాలు ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటాయి. ముఖ్యంగా నందమూరి కుటుంబానికి తెలుగు దేశం పార్టీలో సరైన ప్రాముఖ్యం లభించడం లేదని కొందరు విమర్శలు చేస్తుంటారు. ఆ విషయాలు 'అన్‌స్టాప‌బుల్‌ 2' సెకండ్ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్‌లో డిస్కషన్‌కు వస్తాయో? లేదో? చూడాలి.  

Also Read : Prabhas Adipurush Court Case : ప్రభాస్‌కు ఢిల్లీ హైకోర్టు షాక్ - హీరోతో పాటు 'ఆదిపురుష్' యూనిట్‌కు నోటీసులు

విశ్వక్ సేన్, సిద్ధూ జొన్నలగడ్డ కూడా!
'అన్‌స్టాప‌బుల్‌ 2'లో ఒక ఎపిసోడ్‌లో యువ హీరోలు విశ్వక్ సేన్ (Vishwak Sen), సిద్ధూ జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) సందడి చేయనున్నారు. వీళ్ళిద్దరి ఎపిసోడ్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. అది విడుదల విడుదల అయ్యేది త్వరలో ప్రకటించనున్నారు. 

దీపావళికి చిరంజీవితో బాలయ్య సందడి?
'అన్‌స్టాప‌బుల్‌ 2'కు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అతిథిగా రానున్నారని కొన్ని రోజుల నుంచి వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ దీపావళికి చిరు అథితిగా వచ్చిన ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుందని సమాచారం. రెండో సీజన్ ఆఖరి ఎపిసోడ్‌కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram Srinivas) అతిథులుగా రానున్నారని వినికిడి. ఇది ఎంతవరకు నిజమేది త్వరలో తెలుస్తుంది. ఆహా వర్గాలు అయితే అధికారికంగా ఏ విషయాన్నీ వెల్లడించలేదు.

Also Read :  Shadow Madhubabu Novels : ఓటీటీకి 'షాడో' మధుబాబు నవలలు - రైట్స్ అన్నీ ఆ దర్శకుడి దగ్గరే

Continues below advertisement
Sponsored Links by Taboola