వల్లూరు మధుసూదన రావు అని చెబితే పాఠకులు గుర్తు పట్టడం కష్టం కావచ్చు. కానీ, మధు బాబు... 'షాడో' మధు బాబు (Shadow Madhu Babu) అని చెబితే పెద్ద కష్టం కాదనే చెప్పాలి. ఓ తరం పాఠకులు ఆయన నవలలకు అడిక్ట్ అయ్యారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మధు బాబు రాసిన కథలు చదవడం తమ దినచర్యగా చేసుకున్న మనుషులూ ఉన్నారు.


ఓటీటీలోకి మధు బాబు కథలు!
మధు బాబు అభిమానులకు ఒక గుడ్ న్యూస్! ఆయన కథలు ఓటీటీ వేదికలోకి రానున్నాయి. 'షాడో' కథలను వెబ్ సిరీస్‌గా మలిచే ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయి. అన్ని కథలనూ ఒకేసారి తెరకెక్కించకుండా సీజన్ సీజన్‌లుగా వీక్షకుల ముందుకు తీసుకు రానున్నారు.


శరత్ మండవ చేతిలో 'షాడో' రైట్స్!
మధు బాబు 'షాడో' నవల (కథలు) హక్కులను దర్శకుడు శరత్ మండవ సొంతం చేసుకున్నారు. మధు బాబు రాసిన 'షాడో' కథలకు చెందిన ఐపీ రైట్స్ (Shadow Madhu Babu Novels Intellectual property rights) అన్నీ ఆయన దగ్గర ఉన్నాయని తెలిసింది. ఇప్పుడు ఈ కథలను ఓటీటీ వీక్షకుల ముందుకు ఆయన తీసుకు రానున్నారు. అయితే... అన్ని కథలనూ తానే తెరకెక్కించాలని శరత్ మండవ అనుకోవడం లేదు.


ఒక్కో ఎపిసోడ్‌కు
ఒక్కో దర్శకుడు
'షాడో' వెబ్ సిరీస్ ఫస్ట్ సీజన్ స్క్రిప్ట్ వర్క్ ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజిలో ఉందని టాక్. ఇందులో ఒక్కో ఎపిసోడ్‌ను సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అగ్ర దర్శకులలో ఒక్కొక్కరు డైరెక్ట్ చేయనున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. త్వరలో ఈ సిరీస్‌కు సంబంధించిన వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.


Also Read : Nayanthara Vignesh Became Parents : తల్లిదండ్రులైన నయన్ & విఘ్నేష్ శివన్ - జూన్‌లో పెళ్లి, ఇప్పుడు కవలలు
   


తెలుగు నవలా ప్రపంచంలో మధు బాబు ఒక సంచలనం. డిటెక్టివ్ నవలలతో ఫేమస్ అయ్యారు. తెలుగు నాట 1970 - 1990 మధ్యలో ఆయన రాసిన కథ చదవని పాఠకులు లేదని చెబితే అతిశయోక్తి కాదు. చక్రతీర్థం, కాళికాలయం సీరియళ్లకు కూడా ఆయన కథలు అందించారు. స్వాతి, నవ్య వంటి వార పత్రికలకు, నది అనే మాస పత్రికకు ఆయన కథలు రాశారు. 'షాడో' కథల విషయానికి వస్తే... ప్రతి కథ తర్వాత ఏం జరుగుతుందనేది ఉత్కంఠతో ముందుకు సాగుతుంది. భోళా శంకర్, అసైన్‌మెంట్‌ కరాచీ, డెవిల్స్ ఇన్ నికోబర్, టార్గెట్ షాడో వంటివి అత్యంత పాఠకాదరణ సొంతం చేసుకున్నాయి.
   
ఈ తరం పాఠకులు, ప్రేక్షకులు కూడా ఏదో ఒక సందర్భంలో ఆయన పేరు వినే ఉంటారు. ఇప్పుడు వాళ్ళకు మధు బాబు కథలను పరిచయం చేసే బాధ్యతను శరత్ మండవ తీసుకున్నారు. మాస్ మహారాజ రవితేజ కథానాయకుడిగా నటించిన 'రామారావు ఆన్ డ్యూటీ' చిత్రంతో ఆయన తెలుగు చలన చిత్ర పరిశ్రమకు దర్శకుడిగా పరిచయం అయ్యారు. అందులో యాక్షన్ సన్నివేశాలకు మంచి పేరు వచ్చింది. పాటలు కూడా శ్రోతలను ఆకట్టుకున్నాయి. 'రామారావు ఆండ్ డ్యూటీ' కంటే ముందు తమిళంలో శరత్ మండవ ఓ సినిమా చేశారు.


Also Read : Vishnu Manchu Fight : సన్నీ లియోన్, పాయల్ రాజ్‌పుత్‌తో విష్ణు మంచు ఫైట్