డబుల్ ధమాకా... డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్... డబుల్ గెస్టులు... డబుల్ సందడి... అన్నట్టు నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హోస్ట్ చేస్తున్న 'అన్‌స్టాపబుల్' (Unstoppable) సెకండ్ సీజన్ స్టార్టింగ్ మూడు ఎపిసోడ్స్ నడిచాయి. ప్రతి వారం ఇద్దరు ఇద్దరు గెస్టులను ఇంటర్వ్యూ చేశారు.
 
'అన్‌స్టాపబుల్ 2' నాలుగో ఎపిసోడ్‌కు డబుల్ కాదు... ట్రిపుల్ ధమాకాతో సందడి చేశారు. లాస్ట్ ఎపిసోడ్‌లో నిజాం కాలేజీలో తనతో పాటు చదువుకున్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, కెఆర్ సురేష్ రెడ్డిలతో పాటు నటి రాధికా శరత్ కుమార్‌లను ఇంటర్వ్యూ చేశారు. ఇప్పుడు ఐదో ఎపిసోడ్‌కు కూడా అదే విధంగా చేస్తున్నారని సమాచారం అందుతోంది. ఈసారీ బాలకృష్ణ ట్రిపుల్ ధమాకా ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.
 
ఇద్దరు నిర్మాతలు...
ఓ దర్శ కేంద్రుడు!
Unstoppable Season 2 Episode 5 : 'అన్‌స్టాపబుల్ 2' ఐదో ఎపిసోడ్‌కు దర్శ కేంద్రుడు కె. రాఘవేంద్ర రావు (K Raghavendra Rao), ప్రముఖ నిర్మాతలు డి. సురేష్ బాబు (D Suresh Babu), అల్లు అరవింద్ (Allu Aravind) అతిథులుగా రానున్నారని తెలిసింది. ఈ ముగ్గురికీ బాలకృష్ణతో మాత్రమే కాదు... ఆయన తండ్రి, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు (NT Rama Rao) తో కూడా అనుబంధం ఉంది. 


ఎన్టీఆర్ హీరోగా నటించిన చిత్రాలకు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. ఆయన తండ్రి, దర్శకులు కె.ఎస్. ప్రకాష్ రావు కూడా ఎన్టీఆర్ హీరోగా సినిమాలు తీశారు. డి. రామానాయుడు నిర్మాణంలో ఎన్టీఆర్ సినిమాలు చేశారు. అల్లు అరవింద్ తండ్రి, హాస్య నటులు అల్లు రామలింగయ్యకు, ఎన్టీఆర్ ఫ్యామిలీకి మంచి అనుబంధం ఉంది. అందువల్ల, ఈ ముగ్గురితో బాలకృష్ణ సంభాషణ ఏ విధంగా ఉంటుందనే ఆసక్తి మొదలైంది. 


పూలు, పళ్ళు, నాభి డిస్కషన్ వస్తే...
దర్శ కేంద్రుడు కె. రాఘవేంద్ర రావు పేరు చెబితే... ముందుగా ఆయన సినిమాల్లో పాటలు గురించి ఎవరైనా చెబుతారు. పాటల్లో హీరోయిన్ నాభి మీద పళ్ళు, పూలు వంటివి వేయడం కంపల్సరీ. ఆ టాపిక్ మీద బాలకృష్ణ ఎటువంటి ప్రశ్నలు సంధిస్తారో? రాఘవేంద్ర రావు ఎటువంటి సమాధానాలు ఇస్తారో? చూడాలని తెలుగు సినిమా ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. లాస్ట్ ఎపిసోడ్‌లో కొంత పొలిటికల్ డిస్కషన్ నడిచింది. కానీ, ఈసారి ప్యూర్ ఎంటర్‌టైనెంట్ ఉండబోతోందని గెస్టులను చూస్తే అర్థం అవుతోంది. 


Also Read : 'హైపర్' ఆదికి గుండు కొట్టిన కమెడియన్లు - షాక్ ఇచ్చిన డ్రామా ట్రూప్


ఆల్రెడీ 'అన్‌స్టాప‌బుల్‌' సెకండ్ సీజన్ సెన్సేషనల్ రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ అతిథులుగా వచ్చిన తొలి ఎపిసోడ్ పొలిటికల్ పరంగానూ డిస్కషన్స్ క్రియేట్ చేసింది. అదే విధంగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, కెఆర్ సురేష్ రెడ్డి వచ్చిన ఎపిసోడ్ కూడా! ఆహాలో స్ట్రీమింగ్ అయ్యే ఎపిసోడ్స్, యూట్యూబ్‌లో ప్రోమోస్ ట్రెండింగ్‌లో ఉంటున్నాయి.


రాజకీయ నాయకులు, సీనియర్లు వచ్చినప్పుడు షోను ఓ విధంగా నడుపుతున్న బాలకృష్ణ... యువ హీరోలు విశ్వక్ సేన్, సిద్ధూ జొన్నలగడ్డ, శర్వానంద్, అడివి శేష్ వంటి వారు వచ్చినప్పుడు పూర్తిగా బాలుడు అయిపోతున్నారు. యువ హీరోలతో కలిసి విపరీతంగా సందడి చేస్తున్నారు.