పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖ హాస్య నటుడు ఉమర్ షరీఫ్ కన్నుమూశాడు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఉమర్ జర్మనీలో తుది శ్వాస విడిచినట్లు ఆయన భార్య జరీన్ ఉమర్ సోదరి ధృవీకరించింది. ఉమర్ గత కొంత కాలంగా హృదయ సంబంధ వ్యాధులతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. మెరుగైన చికిత్స కోసం అమెరికా వెళ్లాల్సి ఉంది. అయితే అమెరికాకు వెళ్లే సమయంలో అతని ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో జర్మనీలోని న్యూరమ్‌బర్గ్‌లోని ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఉమర్ కన్నుమూశారు. 





ప్రముఖుల సంతాపం.. 
ఉమర్ మరణం పట్ల రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. సెనేటర్ ఫైసల్ జావేద్, ఛైర్మన్ సెనేట్ సాదిక్ సంజ్రానీ, పీపీపీ నేత బిలావల్ భుట్టో జర్దారీ తదితరులు ఉమర్ కుటుంబానికి సంతాపం వ్యక్తం చేశారు. ఉమర్ దేశానికి అందించిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ సైతం ఉమర్ మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. ఉమర్ సంతోషం, నవ్వును ప్రజలందరికీ పంచాడని గుర్తు చేసుకున్నాడు. ప్రముఖ బాలీవుడ్ కమెడియన్ కపిల్ శర్మ సైతం ఉమర్‌కు సంతాపం తెలిపాడు. 










Also Read: సమంతతో విడాకులు - నాగచైతన్య అధికారిక ప్రకటన !


Also Read: లైకా ప్రొడక్షన్స్ తో ధనుష్ భార్య డీల్.. తెలుగు స్ట్రెయిట్ సినిమాతో ఎంట్రీ..


Also Read: పవన్‌తో విభేదాలు.. ఆయన మార్నింగ్ షో కలెక్షనంత ఉండదు మీ సినిమా: ప్రకాష్ రాజ్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి