టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన విలక్షణమైన నటనతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. మహేష్ బాబు నటించిన ‘మహర్షి’ సినిమాలో హీరో సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. తర్వాత ‘నాంది’, ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ వంటి విభిన్న కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి మార్కులు కొట్టేశాడు. ఈ సినిమాల తర్వాత అల్లరి నరేష్ తాజాగా ‘ఉగ్రం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. నరేష్ వరుసగా విభిన్నమైన కథలను ఎంచుకుంటోన్న నేపథ్యంలో ఈ మూవీపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి తాజాగా లేటెస్ట్ అప్డేట్ ఒకటి వచ్చింది. మూవీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసింది సినిమా నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్ బ్యానర్. 


‘ఉగ్రం’ సినిమాను ఒక ఎమోషనల్ యాక్షన్ మూవీగా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు విజయ్ కనకమేడల. ప్రస్తుతం అల్లరి నరేష్ కూడా కామెడీ జోనర్ కథలను పక్కనపెట్టి యాక్షన్ సినిమాలే వరుసగా చేస్తున్నాడు. ఇటీవల విడుదల అయిన ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ సినిమా అంతగా ఆకట్టుకోకపోయినా నరేష్ మాత్రం తన రూటు మార్చడం లేదు. ‘ఉగ్రం’ సినిమాపై ఆయన చాలా నమ్మకంతో ఉన్నాడు. గతంలో దర్శకుడు విజయ్, నరేష్ కాంబోలో ‘నాంది’ సినిమా వచ్చింది. ఈ మూవీ అల్లరి నరేష్ లోని మరో నటుడ్ని పరిచయం చేయడమే కాకుండా కమర్షియల్ గా కూడా మంచి హిట్ అందుకుంది. మరోసారి అదే కాంబోలో వచ్చే సినిమా కావడంతో మూవీపై మరిన్ని అంచనాలు ఉన్నాయి. 



ఇక ఈ సినిమాను ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు మేకర్స్. రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ టీజర్ వీడియోను కూడా విడుదల చేసింది మూవీ టీమ్. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ లలో వైరల్ అవుతోంది. సినిమా టైటిల్ కు తగ్గట్టే టీజర్ లో అల్లరి నరేష్ చాలా వైలెంట్ గా కనిపిస్తున్నాడు. చీకట్లో బండి మీద వచ్చి గన్ తీసి కోపంగా అరుస్తూ.. కాల్చే సీన్ ఆకట్టుకుంది. టీజర్ లో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోవడంతో ఈ సినిమాపై ఉత్కంఠ నెలకొంది. ఈ మూవీలో అల్లరి నరేష్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. 




Read Also: ఇండియాపై పాక్ కుట్ర - ఆ హీరోయిన్లతో హనీ ట్రాపింగ్, నటి సజల్ అలీ పాత్రేంటి?




మరోవైపు సమ్మర్ సీజన్ కావడంతో చాలా సినిమాలు ఏప్రిల్ నెలలో విడుదలకు సిద్దం అవుతున్నాయి. అల్లరి నరేష్ ‘ఉగ్రం’ సినిమా విడుదల తేదీకు ముందు తర్వాత చాలా సినిమాలు విడుదల కాబోతున్నాయి. అయినా సరే సమ్మర్ లోనే మూవీను తీసుకువస్తున్నాడు నరేష్. మరి ఈసారైనా అల్లరి నరేష్ కు మంచి హిట్ అందుతుందో లేదో చూడాలి. ఇక ఈ మూవీను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు. మిర్నా మీనన్‌ హీరోయిన్ గా కనిపించనుంది.