ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే కేవలం బాలీవుడ్ అనే భ్రమలో ఉండేవారు. ఏ రికార్డులు సాధించాలన్నా అక్కడి తీసిన సినిమాలే ముందుండేవి. దక్షిణాదిలో మహా నటులు ఉన్నా ఆ రేంజ్‌లో గుర్తింపుకు నోచుకునే వారు కాదు. సౌత్ లో పెద్ద యాక్టర్లు సైతం బాలీవుడ్ సినిమాల్లో చిన్న క్యారెక్టర్లు వచ్చినా గొప్పగా ఫీలయ్యేవారు. కానీ, రోజులున్నీ ఒకేలా ఉండవు. ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవుతాయి. ప్రస్తుతం సౌత్ నుంచి వచ్చే సినిమాలు బాలీవుడ్ సినిమాలను తలదన్నేలా ఉంటున్నాయి. ఇంకా చెప్పాలంటే దక్షిణాది సినిమాలు హాలీవుడ్ స్థాయి టెక్నికల్ వ్యాల్యూస్ తో వస్తున్నాయి.
గూగుల్ సెర్చ్ లో తెలుగు, కన్నడ సినిమాల హవా
2022లో అత్యధికంగా గూగుల్ లో సెర్చ్ చేసిన టాప్ సినిమాల లిస్టును తాజాగా గూగుల్ విడుదల చేసింది. ఈ లిస్టులో తొలి 5 స్థానాల్లో రెండు స్థానాలను కన్నడ సినిమాలు దక్కించుకోగా, తెలుగు చిత్రం RRR 4వ స్థానంలో ఉంది. దక్షిణాది సినిమాలు దేశవ్యాప్తంగా కోట్లు కొల్లగొడుతున్నాయి. ఇందుకు బెస్ట్ ఎగ్జాంఫుల్ ‘కాంతార’ సినిమా. కేవలం రూ.16 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ. 400 కోట్ల రూపాయలను సాధించింది. రిషబ్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కన్నడ, తెలుగుతో పాటు హిందీలోనూ అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా అత్యధికంగా గూగుల్ చేసిన టాప్ 5 లిస్టులో ‘కాంతార’ చోటు దక్కించుకుంది. ‘కాంతర’ సినిమా ఓటీటీలో విడుదలైనా, థియేటర్లలో ఇప్పటికీ ప్రేక్షకులు ఎగబడి చూస్తున్నారు. కన్నడ నాట కొన్ని చోట్ల థియేటర్లు హౌస్ ఫుల్ అవుతున్నాయి.
ఇదే లిస్టులో స్థానాన్ని సంపాదించుకున్న మరో కన్నడ సినిమా ‘KGF 2’. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పాన్ ఇండియన్ మూవీ విడదలైన అన్ని చోట్ల అద్భుత విజయాన్న సొంతం చేసుకుంది. యష్ అద్భుత నటనతో ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర రూ. 500 కోట్లపైగా వసూళ్లను రాబట్టింది. ‘KGF’ సినిమాతో దేశ వ్యాప్తంగా సత్తా చాటిన ప్రశాంత్ నీల్, అంతకు మించి అన్నట్లుగా ‘KGF 2’ను తెరెక్కించారు. ఈ సినిమా కూడా ఫస్ట్ పార్టుకంటే ఘన విజయాన్ని అందుకుంది. ఈ ఏడాది కన్నడ సినిమా పరిశ్రమకు ఈ రెండు సినిమాలు కనీ వినీ ఎరుగని రీతిలో క్రేజ్ తీసుకొచ్చాయి. ఇక ‘పుష్ప-2’, ‘RRR’ మూవీస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేవలం ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులను ఈ సినిమాలు మెస్మరైజ్ చేస్తున్నాయి. జపాన్‌లో RRR భారీ వసూళ్లను సాధిస్తోంది. అలాగే, ‘పుష్ప-2’ సైతం రష్యా భాషలో రిలీజ్ అయ్యింది. గురువారం అక్కడి థియేటర్లలో సందడి చేసింది. అయితే, రిజల్ట్ ఏమిటనేది కొద్ది గంటల్లో తెలుస్తుంది.
టాప్-10 గూగుల్ సెర్చ్ మూవీస్ లిస్ట్ ఇదే
1 – Brahmastra: Part One – Shiva
2 – KGF: Chapter 2
3 – The Kashmir Files
4 – RRR
5 – Kantara
6 – Pushpa: The Rise
7 – Vikram
8 – Laal Singh Chaddha
9 – Drishyam 2
10 – Thor: Love and Thunder
Read Also: క్యాన్సర్ ను జయించి మళ్లీ షూటింగ్స్ లో హంస నందిని బిజీ బిజీ!