Janaki Kalaganaledhu August 15th: జ్ఞానంబ మధ్యతరగతి గురించి.. వాళ్లు పడే బాధలు గురించి చెప్పటంతో అందరూ సైలెంట్ అవుతారు. ఒక ఆశతోనే మీ ముందు కూర్చొని మాట్లాడుతున్నాను అని అంటుంది. వెన్నెల మాత్రం బాధపడుతూ కనిపిస్తుంది. మీ నాన్న అడగొద్దనే అన్నాడు.. కానీ నాకు నా కొడుకుల మీద నమ్మకం ఉంది అడుగుతాను అని నేనే అన్నాను అని అంటుంది.


దాంతో రామ ఈ పెళ్లి నేను చేస్తాను మీ కళ్ళల్లో కన్నీటి చుక్క కూడా కనిపించకూడదు అని అంటాడు. జానకి కూడా అవును అని ధైర్యం ఇవ్వటంతో వెంటనే మల్లిక మా సంగతి చెప్పేసాను కదా పెళ్లి ఖర్చులు 10 లక్షల అని ఇప్పుడు అంటారు.. ఇచ్చేకొడుకులు ఉన్నారు కదా అని పెంచుకుంటూ పోతారు చివరికి తడిసి మోపుడు అవుతుంది అని వెటకారంతో అంటుంది.


వెంటనే జెస్సి కూడా కావాలని ఎందుకు ఎవరు పెంచుతారు అక్క అని అనటంతో వెంటనే మల్లిక తన షాప్ కు వచ్చినవాళ్లు తక్కువ రేటుతో డబ్బులు అడిగి ఎక్కువ రేటు చీర తీసుకెళ్తారు అని చెబుతుంది. ఇక విష్ణు ఏదో చెప్పబోతుండగా అతని నోరు మూయిస్తుంది మల్లిక. వెంటనే జెస్సి.. అఖిల్ మాట్లాడు అత్తయ్య గారిని సమాధానం కోసం ఎదురుచూస్తున్నారు అని అనటంతో వెంటనే అఖిల్ నాకు కూడా బాధ్యత తీసుకోవాలని ఉంది కానీ మన పరిస్థితి బాలేదు కదా.. సంపాదన తక్కువ ఉంటే ఖర్చులు ఎక్కువగా ఉన్నాయని చెబుతాడు. మీరు కూడా నా పరిస్థితిని అర్థం చేసుకోండి అంటాడు.


వెంటనే గోవిందరాజులు కొన్ని ఎమోషనల్ డైలాగులు చెబుతాడు. ఇక రామ అలా మాట్లాడకండి నాన్నగారు నేను బాధ్యత తీసుకుంటాను అనటంతో.. నీ ఒక్కడికి ఎలా బాధ్యతలు అప్పచెప్పుతాము అని అంటారు. అప్పుడే జ్ఞానంబ మనకు తలకొరివి పెట్టేది వాడు ఒక్కడే కదా అనటంతో ఆ మాటకు అందరూ బాధపడుతున్నట్లు కనిపిస్తారు. ఇక గోవిందరాజులు ఇక మీకు ఎవరికి ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా తనే ఈ ఇల్లు అమ్మి వెన్నెల పెళ్లి చేస్తానని అందరూ షాక్ అవుతారు.


వెంటనే జ్ఞానంబ ఇల్లు అమ్మడం ఇష్టం లేకపోతే మీ ముగ్గురు పెళ్లి బాధ్యత చూసుకొని మీ సొంతం అవుతుంది అని అంటుంది. నిర్ణయం ఏంటో రేపు ఉదయాన్నే చెప్పండి అని అక్కడి నుంచి తన భర్తను తీసుకొని వెళుతుంది. అందరు వెళ్ళిన తర్వాత వెన్నెల ఏడుస్తూ తనకు ఈ పెళ్లి వద్దని ఇలా ఒంటరిగా ఉంటాను కిషోర్ కి ఫోన్ చేసి చెబుతాను అని అంటుంది.


వెంటనే జానకి ఆపుతుంది. తన వల్ల ఇంట్లో గొడవలు కావద్దని ఒకరికొకరు దూరం కావొద్దు అని చెబుతూ బాధపడుతుంది. దాంతో జానకి అలా ఏమి జరగదు అని.. నేనున్నాను కదా అని ధైర్యం ఇస్తుంది. విష్ణు తన గదిలో మల్లికకు తెలియకుండా తన చెల్లి పెళ్లి కోసం కొన్ని లెక్కలు వేస్తూ ఉంటాడు. అప్పుడే మల్లిక వచ్చి అది చూసి షాక్ అవుతుంది. అంతేకాకుండా నోటికి వచ్చినట్లు తిడుతుంది.


జెస్సి కూడా జరిగేది నీ చెల్లి పెళ్లి కదా అని అఖిల్  అనడంతో.. తన దగ్గర అంత స్తోమత లేదు అని అంటాడు అఖిల్ . కానీ జెస్సి బాధ్యత కదా అని అనటంతో అఖిల్ తన దగ్గర అంత స్తోమత లేదు. ఇల్లు అమ్ముతాను అన్నాడు కదా అమ్మ నీకు అని అంటాడు. మరోవైపు రామ దంపతులు కూడా జరిగిన విషయం తలుచుకుంటూ బాధపడతారు.


ఇక ఎప్పటికీ వాళ్ళు మారరు అని ఎమోషనల్ గా రామ జానకి తో అంటాడు.  గోవిందరాజులు ఇంటి డాక్యుమెంట్లు తీయడంతో జ్ఞానంబ వచ్చి నిర్ణయం చెప్పడానికి పిల్లలకు రేపు ఉదయం వరకు సమయం ఇచ్చాము కదా ఎందుకు అప్పుడే పేపర్లు బయటకు తీశారు.. పిల్లల మీద నమ్మకం లేదా అని అంటుంది. ఎందుకు లేదు పూర్తిగా నమ్మకం ఉంది నీ ఇల్లు నువ్వే తాకట్టు పెట్టుకో అంటారని పూర్తిగా నమ్మకం ఉంది అని అంటాడు.


 


also read : Prema Entha Madhuram August 14th: 'ప్రేమ ఎంత మధురం' సీరియల్: మదన్ హ్యాండ్ ఓవర్‌లో అను బాబు, ఆర్యకు ఎదురుపడ్డ ఛాయాదేవి?


 


Join Us on Telegram: https://t.me/abpdesamofficial