Prema Entha Madhuram August 14th: జిండే  మాఫియా గ్యాంగ్ తో వెళ్తుంటాడు. వారిని ఆర్య వెనకాల నుండి ఫాలో అవుతాడు. మరోవైపు మాఫియా గ్యాంగ్ లీడర్ కాస్త కంగారు పడుతుంటాడు. అప్పుడే తమ మనషులు జిండే ని తీసుకొస్తారు. జిండేను చూసి ఎవరు అంటూ ఇక్కడకి ఎందుకు తీసుకొచ్చారు అని అనడంతో తను కూడా ఇదే దంద చేస్తాను అని.. తన దగ్గర కొంతమంది పిల్లలు ఉన్నారని.. ఆ పిల్లలను మీకు అప్పజెప్పుతాను అంటూ.. కానీ ఈ ఫోటోలో ఉన్న బాబు కావాలి అనటంతో ఆల్రెడీ ఆ బాబుని మరొకరికి ఇచ్చాను అని వచ్చిన ఆఫర్ గురించి చెబుతాడు.


ఇక ఆ బాబుని ఎవరికి ఇచ్చావు అని జిండే అడగటంతో తనకు తెలియదు అని ఆ మాఫియా లీడర్ అంటాడు. వెంటనే జిండే గన్ గురిపెట్టి బెదిరించడంతో అదే సమయంలో వెనకాల ఒక వ్యక్తి జిండే తలపై కొడతాడు. అప్పుడే ఆర్య కూడా ఎంట్రీ ఇచ్చి రౌడీలను చితక్కొడతాడు. ఆ తరువాత ఆ మాఫియా లీడర్ పీక మీద కాలు పెట్టి బాబుని ఎవరికీ ఇచ్చావు అంటు గట్టిగా అడగటంతో తనకు తెలియదని.. బాబుని తీసుకెళ్లిన వ్యక్తిని చూపిస్తాడు. ఇక అతని గొంతు పట్టుకొని పైకి లేపి బాబుని ఎవరికి అప్పగించావని అనటంతో అతడి గురించి చెబుతాడు.


వెంటనే జిండే కొంతమంది ఫోటో చూయించగా అందులో మదన్ ఫోటో చూడగానే తానే అని జరిగిన విషయం చెబుతాడు. ఇక వారి అడ్రస్ చెప్పమని జిండే అతడిని లాక్కొని వెళ్తాడు. ఆర్య వెంటనే నీరజ్ కి ఫోన్ చేసి బాబుని తీసుకెళ్లింది మదన్ అని చెప్పటంతో అంజలి, నీరజ్ షాక్ అవుతారు. ఇక వారిని భానుని తీసుకొని ఒక దగ్గరికి రమ్మని అడ్రస్ చెబుతాడు. ఇక ఆర్య వాళ్ళు ఆ రౌడీని తీసుకొని వెళ్తుంటారు. అప్పుడే ఆర్యకు ఆ లేడీ విలన్ కాల్ చేసి బాబు తన దగ్గర ఉన్నాడని చెబుతుంది. నీ కన్నా కొడుకు కోసం ఎక్కడెక్కడో తిరుగుతున్నావు కదా.. నువ్వు బాధపడాలని ఇలా చేశాను అని అంటుంది.


ఇక ఆర్య ఆ బాబు తన కన్న కొడుకు కాదని అంటున్న కూడా తను వినకుండా ఫోన్ కట్ చేస్తుంది. వెంటనే ఫోన్ కట్ చేసి జిండేకి విషయం చెబుతాడు. భాను బాబుని చూసి తన బాబు అనుకుందని ఎలాగైనా భాను కి బాబును అప్పజెప్పాలి అని అంటాడు. మరోవైపు మదన్ ఆ లేడీ విలన్ తో బాబు ఇక్కడే ఉన్నాడని ఎందుకు చెప్పావ్.. పైగా ఆ బాబు తన కొడుకే అని ఆర్యతో చెప్పేసావా అంటూ షాక్ అవుతాడు. ఇప్పుడు ఆ బాబుని వెతుక్కుంటూ ఆర్య వస్తాడని.. అసలు మీరేం ప్లాన్ చేస్తున్నారు అర్థం కావట్లేదు అనడంతో ఆర్యకు తన శత్రువుని పరిచయం చేయడానికి చేస్తున్నాను అని అంటుంది.


అప్పుడే ఆర్య వచ్చి మదన్ అని గట్టిగా అరిచి బాబు ఎక్కడ అంటూ కోపంగా అడుగుతాడు. అప్పుడే అను వాళ్ళు కూడా అక్కడికి చేరుకుంటారు. జిండే కూడా మర్యాదగా భాను బాబుని అప్పజెప్పమని అంటాడు. ఇక అనుకూడా తన బాబుని తనకు ఇవ్వమని బ్రతిమాలుతుంది. ఇక అక్కడే ఉన్న లేడీ విలన్ మాత్రం పొగరుగా కనిపిస్తూ ఉంటుంది. ఇక బాబును అప్పచెప్పుతావా లేకుంటే పోలీసులకు ఫోన్ చేయమంటావా అని జిండే అనడంతో.. వెంటనే ఆ లేడీ.. నా ఇంట్లో అడుగు పెట్టే పోలీస్ ఎవడు అనటంతో అందరూ ఆశ్చర్యపోతారు.


వెంటనే ఆర్య ఎవరు నువ్వు అనటంతో.. తన ఫేస్ అందరికీ చూపిస్తుంది. వచ్చి ఆర్య ఎదురుగా నిలబడి ఛాయాదేవి.. నీ చిరకాల శత్రువుని అని పొగరుగా అంటుంది. హౌ ఆర్ యు మిస్టర్ ఆర్య వర్ధన్ అంటూ.. సారీ టెన్షన్ లో ఉండి ఈ క్వశ్చన్ అడగకూడదేమో అని అంటుంది. వెంటనే ఆర్య ఎవరు నువ్వు.. ఎందుకు నన్ను టార్గెట్ చేశావు అని ప్రశ్నిస్తాడు. దాంతో ఛాయాదేవి.. అన్ని ఒకేసారి ఎందుకు అడుగుతున్నావు.. అన్ని విషయాలు తెలుసుకోవాలన్న ఆరాటం దేనికి ఆర్య వర్ధన్.. ఒక్కొక్కటి తెలుసుకుంటూ పోదాం.. ఈ శత్రుత్వం ఒక్కరోజుతో తీరిపోయేది కాదు అని అనటంతో వెంటనే ఆర్య కోపంతో హ్మ్ అంటూ చెయ్యి పెట్టి ఆపుతాడు.


also read it : Madhuranagarilo August 12th: రాధ శ్యామ్ ను ప్రేమిస్తున్న విషయం తెలిసి షాకైన సంయుక్త.. ఆ లెటర్ చూసి సంతోషంలో మునిగిన మధుర దంపతులు?



Join Us on Telegram: https://t.me/abpdesamofficial