లక్కీ తమ దగ్గర ఉన్నాడని నందు లాస్యకి ఫోన్ చేయడంతో ఆవేశంగా వస్తుంది. ఇక తన కొడుకుని తనకి తులసి దూరం చేస్తుందని లాస్య తులసి మీద విరుచుకుపడుతుంది. చేసిన గొడవ చాలు కొడుకుని తీసుకుని వెళ్లిపొమ్మని పరంధామయ్య తిడతాడు. లక్కీ మాత్రం తను రానని డాడీ దగ్గరే ఉంటానని నందుని గట్టిగా కౌగలించుకుంటాడు. లాస్య బలవంతంగా వాడిని లాక్కుని వెళ్ళిపోతుంది. డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ తినడానికి కూర్చుంటారు. ఎవరికీ వడ్డించకుండా ప్రియ ఉంటుంది. ఎవరో చీఫ్ గెస్ట్ వస్తున్నారని దివ్య అక్క చెప్పిందని చెప్తుంది. దివ్య కోసం వెయిట్ చేయాల్సిన పని లేదని విక్రమ్ అంటాడు. తన కోసం ఎదురు చూసేదీ ఏంటని ప్రసన్న వడ్డించబోతుంటే దివ్య ఎంట్రీ ఇస్తుంది.


విక్రమ్ తండ్రిని చక్కగా రెడీ చేసి క్లీన్ షేవ్ చేసి తీసుకొస్తుంది. అది చూసి విక్రమ్, ముసలాయన సంతోషపడతారు. కానీ రాజ్యలక్ష్మికి మాత్రం ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఇలా ఉంటే చాలా బాగుందని విక్రమ్ ఆనందపడతాడు. అందరికీ సర్ ప్రైజ్ ఇవ్వడం కోసం మావయ్యని తీసుకొస్తున్న విషయం చెప్పలేదని అంటుంది.


బసవయ్య: బావకి గాలి, వెలుతురు పడవు. అనవసరంగా వాడిని ఇబ్బంది పెడుతున్నావ్


Also Read: పొట్ట చెక్కలయ్యేలా నవ్వించేసిన రాజ్, కావ్య- కుళ్ళుతో ఉడుక్కుంటున్న స్వప్న


దివ్య: మావయ్యని తీసుకెళ్ళి అత్తయ్య పక్కన కూర్చోబెట్టనా


ప్రకాశం: పర్వాలేదమ్మా నేను ఈ పక్కన కూర్చుంటాను


విక్రమ్: అదేంటి నాన్న మీరు చాలా రోజులకి బయటకి వచ్చారు. అమ్మ పక్కన కూర్చుంటే చూడాలని ఉంది


ఇక బలవంతంగా రాజ్యలక్ష్మి మొహాన నవ్వు పులుముకుని భర్త వీల్ చైర్ నెట్టుకుంటూ పక్కన తెచ్చి కూర్చోబెట్టుకుంటుంది. తల్లిదండ్రులని అలా చూసేసరికి విక్రమ్ ఆనందం మామూలుగా ఉండదు. ఫోటో తీసుకుని ఆనంద పడతాడు. అందరికీ తాను వడ్డిస్తాను కానీ మావయ్యకి మాత్రం మీరే వడ్డించాలని ప్రియ రాజ్యలక్ష్మిని ఇరికిస్తుంది. దీంతో చేసేది లేక రాజ్యలక్ష్మి వడ్డిస్తుంది. అదంతా చూసి పండగలాగా ఉందని సంతోషపడతాడు. మావయ్యకి తినిపించమని రాజ్యలక్ష్మిని దివ్య అడ్డంగా బుక్ చేస్తుంది. దీంతో చేసేది లేక దివ్య చెప్పినట్టుగా తల ఆడిస్తుంది.


లక్కీ తండ్రి కావాలని ఏడుస్తూ ఉంటాడు. లాస్య తులసి ఇంటికి ఎందుకు వెళ్లావని తిడుతుంది. డాడీ నన్ను బాగా చూసుకున్నాడు నేను తన దగ్గరకే వెళ్తానని ఏడుస్తాడు. నందుకి తనకి సంబంధం లేదని లాస్య చెప్పినా కూడా అర్థం చేసుకోడు. వీడికి ఎలా చెప్తే అర్థం అవుతుందోనని లాస్య బాధపడుతుంది. లక్కీని ఇంటికి రానివ్వద్దని అనసూయ తులసికి చెప్తుంది. వాడిని చూస్తే జాలి వేస్తుందని తులసి బాధగా అంటుంది. అప్పుడే లక్కీ తులసికి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండగా లాస్య వచ్చి లాగేసుకుంటుంది.


లాస్య: అసలు నా కొడుకుతో నీకేం అవసరం. వాడు తిండి తినకుండా ఏడిపిస్తున్నాడు


తులసి: ఫోన్ చేసింది వాడు నేను కాదు. వాడి మీద అరిస్తే తిండి ఎలా తింటాడు. కుదురుగా కూర్చుని మాట్లాడు


Also Read: దిమ్మతిరిగే ట్విస్ట్- హత్య తానే చేశానని యష్ కి చెప్పిన అభిమన్యు- మాళవిక నిజంగా చనిపోలేదా?


లాస్య: వాడికి డాడీ కావాలంట.. నీ దగ్గర అన్నింటికీ సమాధానాలు ఉన్నాయి కదా దీనికి కూడా చెప్పు. మీ డాడీని నీకు దూరం చేసింది తులసి ఆంటీ చెప్పనా


తులసి: అలా కాదు నేను తేనె పూసిన కత్తిని చేజేతులా నేనే నా కాపురాన్ని నాశనం చేసుకున్నా. తులసి ఆంటీ బుద్ధి చెప్పినా నేను వినలేదు. నా జీవితాన్ని నేనే నాశనం చేసుకున్నా అని చెప్పు. ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోకపోతే నీ కొడుకు కూడా నీకు దూరం అవుతాడు


తన తండ్రిని తీసుకొచ్చింది దివ్య అని తనకి థాంక్స్ చెప్పాలని అనుకుంటాడు. మళ్ళీ విడాకుల నోటీస్ ఇచ్చిన విషయం గుర్తు చేసుకుని అవసరం లేదులే అని ఆగిపోతాడు. దివ్య వచ్చి ఏమైందని మొగుడిని గిచ్చుతుంది. కనీసం ఒక చిన్న థాంక్స్ అయినా చెప్పొచ్చు కద అని అడుగుతుంది.


రేపటి ఎపిసోడ్లో..


లక్కీ దొంగతనంగా తులసి ఇంట్లోకి చేరతాడు. ఇక మావయ్యని కష్టాలు పెడతావా అని దివ్య రాజ్యలక్ష్మి బాత్ రూమ్ లో కొబ్బరి నూనె పోస్తుంది. అది గమనించుకోకుండా రాజ్యలక్ష్మి కాలు వేసి జారి పడుతుంది. లాస్య తులసి ఇంటికి పోలీసుల్ని తీసుకొచ్చి తన కొడుకుని కిడ్నాప్ చేశారని ఇల్లంతా సెర్చ్ చేయమని అంటుంది. తన కొడుకు ఈ ఇంట్లో లేకపోతే వాళ్ళ కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్తానని అంటుంది. తులసి కూడా తమ ఇంట్లో లక్కీ లేడని వాదిస్తుంది. అప్పుడే లక్కీ నిద్రలేచి మెట్ల మీద నుంచి కిందకి దిగి వస్తాడు. వాడిని చూసి అందరూ షాక్ అవుతారు.