Jagadhatri Serial July 21 to 25 Weekly Episode తాయారు ప్రమాణ స్వీకారానికి కౌషికి కుటుంబాన్ని పిలుస్తుంది. కౌషికి ఫ్యామిలీ మొత్తం బయల్దేరుతారు. జగద్ధాత్రి, కేథార్ రాకూడదని వాళ్లు వస్తే అక్కడ మనకి ఏం అవుతారని పరిచయం చేస్తాం అని యువరాజ్, నిషికలు పుల్లలేస్తారు. నిషిక వాళ్ల అక్క అని చెప్తా ఏం పర్వాలేదు అందరం కలిసే వెళ్దాం అని కౌషికి చెప్తుంది. తాయారు ప్రమాణ స్వీకారం అయిపోతుంది. తాయారు ఇంటి దగ్గర కౌషికి ఫ్యామిలీ కోసం ఎదురు చూస్తుంటుంది. సాధు సార్ వస్తే తాయారు జేడీ గురించి అడుగుతుంది. జేడీ పర్సనల్ లీవ్ తీసుకుందని చెప్తారు. కౌషికి వాళ్లు తాయారు దగ్గరకు వచ్చి తాయారుకి కంగ్రాట్స్ చెప్తారు.
తాయారు జగద్ధాత్రిని చూసి మీ అమ్మ మీద పడిన నింద చెరిపేయడం ఎంత వరకు వచ్చిందని అడుగుతుంది. ఇక పార్టీ పెద్దలకు వజ్రపాటి ఫ్యామిలీని పరిచయం చేస్తుంది. వైజయంతి ఎమ్మెల్యే సీటు గురించి అడుగుతుంది. కౌషికి వాళ్ల ఫ్యామిలీ గొప్పది అని చెప్తూ ఉదాహరణగా జగద్ధాత్రి, కేథార్ వాళ్ల దూరపు చుట్టం అని పెళ్లి తర్వాత వాళ్లు ఎక్కడుండాలో తెలియకపోతే వాళ్లని ఇంట్లో పెట్టుకున్నారు.. జగద్ధాత్రి తల్లి కావ్య డిపార్టెమెంట్‌ని మోసం చేసి చచ్చిపోయింది. కేథార్‌కి తండ్రి లేడు ఎవడో కూడా తెలీదు.. అలాంటి వారిని కూడా వైజయంతి గారు చూసుకుంటున్నారు అని గొప్పగా చెప్తూనే జగద్ధాత్రిని అవమానిస్తుంది. ఇదే అవకాశంగా నిషిక, యువరాజ్‌లు కూడా కేథార్‌ని అవమానిస్తారు. యువరాజ్ మినిస్టర్‌తో పాపం వాళ్ల తల్లి అయినా వాళ్ల నాన్న ఎవరో చెప్పుంటే బాగుండేది అని అంటాడు. కేథార్ తల దించుకుంటాడు. కౌషికి, సుధాకర్ బాధ పడతారు.
జగద్ధాత్రి కోపంగా మినిస్టర్ గారు మా ఆయన గారికి తండ్రి లేడు అని తెలీదు అని మీకు ఎవరు చెప్పారు మా ఆయనకు తండ్రి ఉన్నారు అని అంటుంది. వైజయంతి, నిషిక వాళ్లు బిత్తరపోతారు. జగద్ధాత్రి నిజం చెప్పేస్తుందేమో అని కౌషికి ఆపేస్తుంది. ఇక తాయారు జగద్ధాత్రి దగ్గర ఉన్న కావ్య డైరీ కోసమే వైజయంతి వాళ్లకి సపోర్ట్ చేస్తున్నట్లు కొడుకుతో చెప్తుంది. టైం చూసి తాయారు జగద్ధాత్రికి డైరీ అడిగితే తన దగ్గర లేదని ఉన్నా ఇవ్వును అని జగద్ధాత్రి చెప్తుంది. తాయారు నీ అంతు చూస్తా అని జగద్ధాత్రిని బెదిరిస్తుంది.
కౌషికి బాబుకి డీఎన్ఏ టెస్ట్ చేసిన రాజు మర్డర్ కేసులో సురేశ్ హస్తం ఉన్నట్లు పోలీసులు గుర్తిస్తారు. సురేశ్‌కి రాజుని చంపాల్సిన అవసరం లేదని రాజు మర్డర్ కేసులో ఇంకేదో మిస్టరీ ఉందని జగద్ధాత్రి, కేథార్ అనుకుంటారు. ఈ కేసుని ఒక్క రోజులో సాల్వ్ చేస్తా అంత వరకు సురేశ్‌ని కస్టడీలోకి తీసుకోవద్దని జేడీ, కేడీలు సాధుసార్‌కి పర్మిషన్ అడుగుతారు. జగద్ధాత్రి వాళ్లు మాట్లాడుకోవడం కౌషికి వాళ్లు వినేస్తారు. సురేశ్ గురించి టెన్షన్ పడతారు. బావ ఇంట్లోకి వస్తే ఏదో పెద్ద ప్రాబ్లమ్ నెత్తిన పెడతారని యువరాజ్ అంటాడు. వైజయంతి తన ఎమ్మెల్యే సీట్ కోసం బాధ పడుతుంది. వైజయంతి కౌషికితో తప్పు సురేశ్ చేయకపోతే పర్లేదు చేస్తే మాత్రం నీకు సురేశ్ కావాలో మేం కావాలో తేల్చుకో అంటుంది.
జగద్ధాత్రి కౌషికికి సురేశ్‌ని ఈ కేసులో ఏం కాదని మాటిస్తుంది. గంగాధర్ తాయారుని చంపడానికి తాయారు ఇంటికి దొంగ చాటుగా వస్తాడు. తాయారు ఇంటి లోపల కేక్ కటింగ్ జరుగుతుంటే ఎవరూ చూడకుండా కిటికీ దగ్గరకు వెళ్లి తాయారుకి గన్ గురి పెడతాడు. అదే టైంలో విక్కీ పిచ్చోడిలా గన్ తీసుకొని ఓ ఆట ఆడుతా అని సుధాకర్‌ని పరుగెత్తిస్తాడు. అందరూ సుధాకర్‌కి ఆరోగ్యం బాలేదు అని ఎంత చెప్పినా వినిపించుకోడు. చివరకు కేథార్ విక్కీ కాళ్లకు తన కాలు అడ్డం పెట్టి పడేస్తాడు. విక్కీ జగద్ధాత్రి, కేథార్‌తో గొడవ పడుతున్న టైంలో గంగాధర్ కాల్చడంతో విక్కీ చేతికి బులెట్ తగిలిపోతుంది. జగద్ధాత్రి, కేథార్ ఎవరా అని చూడటానికి బయటకు వెళ్లి తాయారు మనుషుల నుంచి గంగాధర్‌ని తప్పించి పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్తారు. సాధుసార్, జేడీ, కేడీలు గంగాధర్‌ని ఇంటరాగేషన్ చేస్తారు. మరోవైపు తాయారు కొడుకుతో ఆ గంగాధర్ ఇన్నేళ్ల తర్వాత ఎందుకు వచ్చాడు నన్ను ఎందుకు చంపాలి అనుకున్నాడు. వాడికి నా గతం తెలుసు వాడు నోరు విప్పితే నా జీవితం నాశనం అయిపోతుందని టెన్షన్ పడుతుంది.
గంగాధర్ తాయారు గురించి జేడీ టీమ్‌కి నిజాలు చెప్తాడు. తాయారు తమ ఇంట్లో వంట మనిషిగా పని చేసిందని తన అన్న ఆర్కేయాలజీ హెడ్ బాలాజీ కుటుంబం మొత్తాన్ని నిధి కోసం చంపేసిందని అంటాడు. తాయారు, మీనన్, తాయరు భర్త అప్పటి కార్పొరేటర్ తన అన్న ఇంట్లో నిధి ఉందని తెలుసుకొని అందరికీ విషం పెట్టి చంపేశారని, తన అన్నకి శ్రేయాభిలాషి అయిన కావ్యని కూడా తప్పుడు కేసులో ఇరికించి చంపేశారని చెప్తాడు. కావ్య చావు గురించి ఆ చావు మీద పడిన నింద విన్నప్పుడు నా రక్తం మరిగిపోయిందని ఆవిడ గురించి నిజం తెలిసినా ఏకాకినైపోయా ఆవిడ కోసం పోరాడలేకపోయా. ఒక్క రోజులో అంతా కోల్పోయా అని గంగాధర్ బాధ పడతాడు. గంగాధర్ కేడీ, జేడీలు మాటలు మొత్తం త్రిపాఠి వినేసి మినిస్టర్ తాయారుకి చెప్తాడు. తాయారు త్రిపాఠికి ప్రమోషన్, డబ్బు ఇస్తానని చెప్తుంది. ఇక సాధుసార్‌కి కాల్ చేసి గంగాధర్‌ని తన ఇంటికి తీసుకురమ్మని చెప్తుంది. గంగాధర్ పేరుతో ఎవర్ని అరెస్ట్ చేయలేదని ఒక వేళ చేసినా కోర్టులో జడ్జి ముందు అప్పగించాలి కానీ మీకు కాదు అని చెప్పి కట్ చేస్తాడు. మినిస్టర్‌కి గంగాధర్ గురించి తెలిసింది కాబట్టి గంగాధర్‌ని పాత కేసులో సీజ్ చేసిన ఫాం హౌస్‌లో పెడదామని జేడీ, కేడీలు అనుకుంటారు.
కౌషికి తన బాబాయ్ సుధాకర్, పిన్ని వైజయంతిల పెళ్లి రోజు వేడుక ఘనంగా చేయాలి అనుకొని అందరికీ నగలు కొనాలని ఇంటికి సేటుని నగలు తీసుకొని రప్పిస్తుంది. అందరూ ఎవరికి నచ్చిన నగలు వాళ్లు తీసుకుంటారు. జగద్ధాత్రీ తీసుకోకపోవడంతో కౌషికి, సుధాకర్ తీసుకోమని అంటారు. సుధాకర్ కూడా జగద్ధాత్రి కోసం నగలు తీసుకుంటాడు. మామయ్య తనకే ఇస్తాడని నిషిక గొప్పలకు పోతుంది. ఇక కేథార్ కౌషికి కూతురి కోసం ఓ నగ తీస్తే మా డబ్బుతో మాకే గిఫ్ట్ ఇస్తావా అని యువరాజ్, నిషి గోల చేస్తారు. నా డబ్బుతో కొనాలి అనుకున్నా అని కేథార్ ఎంత చెప్పినా వినకుండా అవమానిస్తారు. కేథార్ చాలా బాధ పడుతూ వెళ్లిపోతాడు. జగద్ధాత్రి కూడా వెళ్లిపోతుంది. సుధాకర్ కేథార్తో మిమల్ని ప్రేమించకుండా ఎవరూ ఉండలేరు. ఈ ఇంటి వాళ్ల కోసం మీరు చాలా కష్టపడుతున్నారు. కేథార్ తప్పు చేశాడు అంటే నేను నమ్ముతానేమో కానీ సుహాసిని కొడుకు తప్పు చేశాడంటే నేను నమ్మను అని అంటాడు. సుధాకర్ జగద్ధాత్రికి నగలు ఇస్తారు. కేథార్ తీసుకోమని జగద్ధాత్రికి సైగ చేస్తాడు. జగద్ధాత్రి తీసుకుంటుంది. జగద్ధాత్రి సుధాకర్‌తో ఈ నగలు నిషిక అక్కకి ఇచ్చామని ఇచ్చారా లేదంటే మీ కోడలిగా ఇచ్చారా అని అడుగుతుంది. సుధాకర్ జగద్ధాత్రితో దీనికి సమాధానం నేను ఇవ్వలేనమ్మా కానీ నా మనసులో ఏం ఉందో నీకు తెలుసు కదమ్మా అంటారు. సుధాకర్‌ని నిషిక, వైజయంతి నిలదీస్తారు. నన్ను కాదని ఆ జగద్ధాత్రికి ఎందుకు నగలు ఇచ్చారు అని అడుగుతుంది. కృతజ్ఞతగా ఇచ్చాను వాళ్లు రోజు రోజుకు రుణపడి పోతున్నారు అందుకే ఇచ్చా.. అని అంటారు. ఇక కౌషికి బాబుకి భర్త్ సర్టిఫికేట్ చేయించాలని కౌషికి ఉద్యోగిని ఇంటికి పిలిస్తే ఆదిలక్ష్మీ ఆ బిడ్డ మా ఇంటి వారసుడు కాదని చెప్పి అతన్ని పంపేస్తుంది. కౌషికి చాలా బాధ పడుతుంది. కన్నీరు పెట్టుకుంటుంది. నిషిక వాళ్లు నవ్వుకుంటారు.
జగద్ధాత్రి కౌషికి దగ్గరకు వెళ్తే కౌషికి ఏడిస్తూ ఒక్కసారి అతను ఆఫీస్‌లో ఈ విషయం చెప్తే బాబు నా కొడుకు అని నిరూపించుకోవడానికి చాలా కష్టపడాలి అంటుంది. జగద్ధాత్రి ఆ సర్టిఫికేట్ వచ్చేలా తాను చేస్తానని చెప్పి కేథార్‌కి ఏదో చెప్తుంది. దాంతో కేథార్ బూచిని పిల్లాడి గెటప్ వేయించి ఆదిలక్ష్మీ ముఖానికి బిందె ఉండటంతో ఆమెను బురిడీ కొట్టించి.. సర్టిఫికేట్ చేయడానికి వచ్చిన వ్యక్తిని ఆ బాబు ఈ బాబు ఇద్దరు బాబులు ఒక బాబు అంటూ తికమక పెట్టి సర్టిఫికేట్ వచ్చేలా చేస్తారు. తర్వాత నిషిక వాళ్లు ఆదిలక్ష్మీకి మొత్తం తగిలిస్తారు. ఇక యువరాజ్ ఓ వ్యక్తిని తీసుకొచ్చి ఆదిలక్ష్మీ బిందె తీయిస్తాడు. ఆదిలక్ష్మీ సురేశ్‌ని పిలిచి సర్టిఫికేట్ కోసం సంతకం పెట్టావా అని అడిగితే లేదని సురేశ్ చెప్తాడు. మీరు నన్ను మోసం చేశారు అని ఆదిలక్ష్మీ అంటే దానికి జగద్ధాత్రి మీరు తెలివైన వారు మీకు ఎవరూ మాయ చేయలేరు అని ఆదిలక్ష్మీ మాట్లాడకుండా చేసేస్తుంది. ఇదే ఈ వారం జరిగింది.