Brahmamudi Serial Weekly Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈ వారం చాలా ఆసక్తిగా జరిగింది. ఒక దశలో రాజ్‌కు గతం గుర్తుకు వస్తుందేమో అన్నంతా సాగింది. ఎన్నో కీలక మలుపులతో ఈ వారం మొత్తం బ్రహ్మముడి సీరియల్‌ బుల్లితెర ప్రేక్షకులకు వినోదాన్ని పంచిందనే చెప్పవచ్చు.. అప్పును ఏసీబీ కేసు నుంచి తప్పించేందుకు రాజ్‌.. రౌడీలతో ఫైటింగ్‌ చేయడంతో ఈ వారం మొదలైంది. అప్పును ఏసీబీ ట్రాప్‌లో ఇరికించిన శ్రీనును యామిని తన మనుషుల చేత కిడ్నాప్‌ చేయిస్తుంది. విషయం తెలసుకున్న రాజ్‌ వెళ్లి శ్రీను ను సేవ్‌ చేసి కోర్టుకు తీసుకొస్తాడు. కోర్టులో శ్రీను నిజం చెప్పడంతో అప్పు కేసు నుంచి బయట పడుతుంది. అయితే తనతో ఆ డ్రామా ఆడించింది. ఒక లేడీ అని చెబుతూనే యామిని పేరు మాత్రం చెప్పడు శ్రీను. దీంతో యామిని ఊపిరి పీల్చుకుంటుంది. తాను సేఫ్‌ అనుకుంటుంది. అయితే రాజ్‌ మాత్రం ఆ లేడీ ఎవరో తాను కనిపెడతానని చాలెంజ్‌ చేయడతంతో యామిని షాక్‌ అవుతుంది. కోర్టు నుంచి వెళ్లిపోయిన యామిని దగ్గరకు రుద్రాణి వెళ్లి కొద్ది రోజులు కావ్య గురించి మర్చిపోమ్మని చెప్తుంది. లేదంటే నువ్వు కష్టాల్లో పడతావనడంతో యామని సరే అంటుంది.

ఇక ఇదే వారం మరో ఆసక్తికరమైన ఎపిసోడ్‌ జరిగింది. ఇన్నాళ్లు అపర్ణ ఎవరినైతే అసహ్యించుకుని దూరం పెట్టిందో ఆ వ్యక్తి తన సొంత కూతురు రేవతి కొడుకు జూనియర్‌ రాజ్‌ ను అపర్ణ కలుస్తుంది. వాడితో ఫ్రెండ్లీగా ఉంటూ క్లోజ్‌ అవుతుంది. తన కొడుకుతో అపర్ణ ఫ్రెండ్లీగా ఉండటం చూసిన రేవతి సంతోషంగా ఫీలవుతూనే భయపడుతుంది. వాడు తన కొడుకు అని అపర్ణకు తెలిస్తే ఎలా రియాక్ట్‌ అవుతుందోనని జగదీష్‌తో ఎమోషనల్‌ అవుతుంది. ఇక మరో ఏపిసోడ్‌లో ఇందిరాదేవి ద్వారా నిజం తెలుసుకున్న కావ్య ఎలాగైనా రేవతిని అపర్ణను కలపాలని నిర్ణయించుకుంటుంది. అందుకోసం స్వప్న కూతురి ఫస్ట్‌ బర్తుడేను ఉపయోగించుకోవాలని డిసైడ్‌ అవుతుంది. అదే నిజాన్ని రాజ్‌కు చెప్పడంతో రాజ్‌ ప్లాన్‌ చెప్తాడు. ఇద్దరూ కలిసి అపర్ణ చేత రేవతికి కాల్ చేయిస్తారు. బర్తుడే ఫంక్షన్‌కు రమ్మని రేవతిని స్వయంగా అపర్ణ పిలిచేలా చేస్తారు.

ఇక బర్తుడే వేడుకలు మొదలవుతాయి. ఇంట్ల అందరూ గిఫ్టులు తీసుకొచ్చి స్వప్న కూతురుకు ఇస్తుంటారు. అయితే తాను గిఫ్ట్‌ తీసుకురాలేదని రాజ్‌ కంగారు పడుతుంటే కావ్య నేను తీసుకొచ్చానని చెప్తుంది. దీంతో రాజ్‌ వెంటనే కావ్య చేతిలో గిఫ్ట్‌ లాక్కుని స్వప్న కూతురుకు ఇస్తాడు. అయితే అది నేను తీసుకొచ్చానని కావ్య చెప్పగానే.. రాజ్‌ మాత్రం మీరు నేను వేరు కాదు కదండి అంటాడు. రాజ్‌ మాటలకు అందరూ షాక్‌ అవుతారు. దీంతో కావ్య ఏవో మాటలు చెప్పి అందరినీ డైవర్ట్‌ చేస్తుంది. ఇక రాహుల్‌ తాను తీసుకొచ్చిన డ్రెస్‌ స్వప్నకు ఇవ్వగానే ఆ డ్రెస్‌ ను స్వప్న విసిరి కొడుతుంది. ఇంత చీఫ్ డ్రెస్‌ తీసుకొస్తావా..? అని రాహుల్‌ను తిడుతుంది.

ఇక అందరూ స్వప్నను ఊరడించి.. రాహుల్‌ని  తిడతారు. అపర్ణ కేక్‌ కట్‌ చేయమని చెప్పగానే కావ్య ఇంకొకరు రావాలి వెయిట్‌ చేద్దాం అంటుంది. ఎవరు కావ్య అని అపర్ణ అడిగితే అదే అత్తయ్య మమ్మల్ని సేవ్‌ చేశారు అని చెప్పాను కదా.. రేవతి గారు మీరే ఫోన్‌ చేసి ఇన్వైట్‌ చేశారు కదా అంటుంది. దీంతో అవును కదా అంటూ అపర్ణ అంటుండగానే రేవతి, జగదీష్‌ కలిసి వస్తారు. వాళ్లను చూసిన అపర్ణ, సుభాష్‌ షాక్‌ అవుతారు. ఇంట్లోకి వచ్చిన వాళ్లను అపర్ణ తిడుతుంది. మీరు అని తెలిస్తే అసలు పిలిచేదాన్నే కాదు అంటుంది. కావ్య, ఇందిరాదేవి ఎంత చెప్పినా అపర్ణ వినదు. ఇద్దరిని ఇంట్లోంచి వెళ్లపోమ్మని వార్నింగ్‌ ఇస్తుంది. దీంతో చేసేది ఏం లేక రేవతి, జగదీష్‌ అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఇది ఈ వారం జరిగిన బ్రహ్మముడి కథనం.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!