Nuvvunte Naa Jathaga Serial July 21 to 25 Weekly Episode  రోజు రోజుకు ఎంతో ఆసక్తికరంగా మారిన నువ్వుంటే నా జతగా సీరియల్ ఈ వారం మొత్తం (సోమవారం నుంచి శుక్రవారం) వరకు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. 

మిథున కిడ్నాప్ ఇంట్లో అందరిని కలచివేస్తుంది. దేవా మిథున కోసం పిచ్చోడిలా తిరుగుతూ వెతుకుతుంటాడు. మిథున తలకు గాయం అవ్వడం ఆ గాయానికి వైద్యం చేసిన డాక్టర్‌ని దేవాని గుర్తు ప్టటి మిథున గురించి చెప్తాడు. దాంతో మిథున ఉన్న ఏరియాలో దేవా మిథుక కోసం వెతుకుతాడు. మిథున కూడా దేవాని చూసి తన తన ఆచూకి దేవాకి చెప్పడానికి క్లాత్ మీద దేవా, మిథున అని రాసి దేవా వైపు విసరుతుంది. దేవా అది చూసి మిథున కచ్చితంగా ఇక్కడే ఉందని  మొత్తం వెతుకుతాడు. క్లాత్ మీద రక్తంతో రావడం వల్ల మిథున చేతికి గాయం కావడంతో కళ్లు తిరిగి పడిపోతూ చేయి కిటికీ దగ్గర పెడుతుంది. ఆ చేతిని చూసి దేవా మిథున అంటూ పరుగులు తీస్తాడు.  ఈ సమయంలోనే మిథునకు దేవా తనని ప్రేమిస్తున్నాడని అర్థమైపోతుంది. రౌడీలు దేవాని కూడా కొట్టి కట్టేయడంతో మిథున కోసం దేవా విలవిల్లాడిపోతాడు. తనని చంపొద్దని వేడుకుంటాడు. ఇంతలో ఎస్‌ఐ అపర్ణదాస్ వచ్చి ఇద్దరినీ కాపాడుతుంది. మిథున, దేవా, అపర్ణ దాస్ ఇంటికి వెళ్తారు. మిథునని చూసి ఇంట్లో అందరూ చాలా సంతోషిస్తారు. హరివర్దన్‌కి అయితే ప్రాణం లేచివచ్చినట్లు అవుతుంది. సత్యమూర్తి అందరితో దేవా మాత్రమే మిథునని క్షేమంగా తీసుకురాగలడు అన్న నా నమ్మకం నిజం అయింది అంటాడు. తనని కాపాడటం కోసం దేవా ప్రాణాలు పణంగా పెట్టాడని చెప్తుంది.  

అపర్ణ దాస్ అందరితో దేవా మిథునని కాపాడాడని దేవా రౌడీ అయినా చాలా మంచోడని అందరితో చెప్తుంది. మిథునకు దేవాని మించిన తోడు మరొకటి ఉండదు అని చెప్పి ఇద్దరి చేతులు కలిపి వెళ్లిపోతుంది.  మరోవైపు మిథునని కిడ్నాప్ చేసిన ఆదిత్య మిథున కోసం ఇప్పటి వరకు ఒక యుద్ధమే చేశా ఈ సారి విధ్వంసం చేస్తా అనుకుంటాడు. ఇక త్రిపుర దేవా అందరి దృష్టిలో మంచోడు అయిపోతున్నాడని మరీ ముఖ్యంగా తన మామయ్య దృష్టిలో మంచోడు అయిపోతున్నాడని అనుకొని దేవా గురించి చెడుగా చెప్తుంది. దేవా వల్లే మిథునకి ఈ పరిస్థితి వచ్చిందని తగిలిస్తుంది. సూర్యకాంతం కూడా త్రిపురని రెచ్చగొడుతూ దేవా, మిథునల్ని విడదీయాలని ప్రయత్నిస్తుంది. 

మిథున స్నానం చేసి గదిలో ఉంటే తల్లి, అత్తా ఇద్దరూ ఒకే సారి జ్యూస్ తీసుకెళ్లి ఇస్తారు. శారద కోడల్ని చూసి చాలా సంతోషపడుతుంది. లలిత మిథునలో ప్రతీ తల్లీ తన కూతుర్ని ప్రేమిస్తుంది కానీ అత్త కూడా ఇంతలా ప్రేమించడం అదృష్టం అని అంటుంది. మిథున లాంటి మహాలక్ష్మీ కోడలిగా రావడం మా అదృష్టమని శారద చెప్తుంది. ఇక శారద మిథున, హరివర్దన్‌ల చాలెంజ్ గురించి అడిగితే నేను గెలిచేశానత్తయ్యా అని మిథున సంతోషం వ్యక్తం చేస్తుంది. దేవా మనసులో నేను ఉన్నానని మా నాన్నకే కాదు ఈ ప్రపంచానికే తెలిసేలా చేశానని అంటుంది. దేవా తన ప్రాణాలను పణంగా పెట్టి నన్ను కాపాడాడు. నేను తన మనసులో లేకపోతే అంతలా విలవిల్లాడిపోతాడా. నా భార్యని నేను కాపాడుకుంటానని పోలీసులతో చెప్తాడు. దేవా అలా పైకి ఉంటాడు కానీ నేను అంటే దేవాకి ఇష్టం అని చెప్తుంది. నేను గెలిచాను అని మిథున సంతోషంగా ఉంటే అత్తయ్యా, తల్లి ఇద్దరూ హగ్ చేసుకుంటారు. ఇక కాంతానికి బేబీ బామ్మ చుక్కలు చూపిస్తుంటుంది. ఇంటిళ్లపాదికి కాంతంతో వంట చేయిస్తుంది. 

మిథున దేవా గురించి ఆలోచిస్తుంది. దేవాకి తన మీద ఉన్న ప్రేమని తనని దేవా కాపాడినప్పుడు చెప్పిన మాటల్ని తలచుకొని దేవా నా మీద నీకు ఎంత ప్రేమ ఉందో నువ్వు నన్ను కాపాడిన విధానంలో తెలిసిపోయింది. ఛాలెంజ్‌లో నేను గెలిచేశా దేవా.. ఇప్పుడు నా మనసులో ప్రేమ నీకు చెప్పడం మాత్రమే ఉంది అని అనుకుంటుంది. అప్పుడే మిథున దగ్గరకు బేబీ బామ్మ వచ్చి రెండు కుటుంబాలు కలిసిపోయే సీన్‌ని మిథునకు చూపిస్తుంది. తండ్రి, మామయ్య అమ్మ, అత్త ఇలా అందరూ కలిసి భోజనాలు చేయడం ఒకరికి ఒకరు వడ్డించుకోవడం చూసి మిథున మురిసిపోతుంది. మిథున సంతోషంగా ఉండటం చూసి దేవా సంతోషపడతాడు. తర్వాత మిథున తండ్రి దగ్గరకు వెళ్లి ఒడిలో పడుకొని ఎన్ని రోజులు అయింది నాన్న ఇలా నీ ఒడిలో పడుకొని.. నా కోసం మీరు ఎంత ఏడ్చారో దేవా అలాగే ఏడ్చాడు నాన్న.. మీరు ఎంతలా తల్లడిల్లిపోయారో దేవా కూడా అంతే తల్లిడిల్లిపోయాడు.. నా కిడ్నాప్‌కి దేవాకి సంబంధం లేదు కానీ పోలీసుల చేతిలో దెబ్బలు తిన్నాడు. తిండి నిద్రలు మాని నా కోసం తిరిగాడు. దేవాకి నా మీద ప్రేమ ఉందని చెప్పడానికి ఇంతకంటే ఏం కావాలి నాన్న.. నేను మీతో చేసిన ఛాలెంజ్‌కి ఇంకా సాక్ష్యాలు కావాలా నాన్న.. ఇంక నేను గెలిచినట్లే కదా నాన్న చెప్తుంది. 

తర్వాత మిథున దేవా దగ్గరకు వెళ్లి ప్రపోజ్ చేస్తుంది. దేవాని హగ్ చేసుకొని ఐలవ్‌యూ దేవా అని చెప్తుంది. దేవా ఏం మాట్లాడకుండా అలా ఉండిపోతాడు. మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన మనం తిరిగి మట్టిలో కలిసిపోయే వరకు ఒక్కటిగా బతుకుదాం దేవా అని అంటుంది. దేవాలో ఏ రియాక్షన్ లేదని మిథున దేవానే చూస్తూ ఉంటుంది. నీ మౌనం నాకు అర్థమవుతుంది.. నీ మనసులో ప్రేమ నాకు కనిపిస్తుంది. నువ్వు  చెప్పలేక నీ గొంతు దాటని మాటలు నా గుండెకు వినిపిస్తున్నాయి. నీ కళ్లు నాకు స్పష్టంగా చెప్తున్నాయి ఐలవ్‌యూ మిథున అని అంటూ మిథున వెళ్లిపోతుంది. తర్వాత ఆదిత్య వస్తాడు. మిథునని చూసి నిన్ను కిడ్నాప్ చేసిన వాడిని వదలను వాడి అంతు చూస్తా అని అంటాడు. వెంటనే దేవా నేను ఆల్రెడీ అదే పనిలో ఉన్నాను.. మిథునని ఎవరో బాగా తెలిసిన వాళ్లే కిడ్నాప్ చేశారు. మిథునని కిడ్నాప్ చేసి దాచిపెట్టిన ప్లేస్‌లో మిథున ఫొటో ఉంది. మిథునని కిడ్నాప్ చేయడం వెనక చాలా ప్రశ్నలు ఉన్నాయి. ప్రస్తుతానికి ఆ సమాధానాలు వెతికే పనిలోనే ఉన్నా.. వాడు ఎవడో ఎవడో కనిపెట్టి తీరుతా అని అంటాడు.  

హరివర్దన్ దేవా మీద పాజిటివ్‌గా ఉన్నాడని ఆదిత్య అతని దగ్గరకు వెళ్లి దేవాని పొగుడుతూనే దేవా వల్లే మిథునకు ఈ పరిస్థితి వచ్చిందని దేవాతో ఉంటే మిథున ప్రాణాలకే ప్రమాదం అని అర్థమయ్యేలా మాట్లాడుతారు. ఇక మొదటి సారి దేవా దగ్గరకు తండ్రి వచ్చి పక్కనే కూర్చొని మాట్లాడుతాడు. ఈ రోజు నువ్వు మిథునని కాపాడి తీసుకురాకపోయి ఉంటే ఆ పాపం నిన్ను కాల్చేయడమే కాదు ఆ పశ్చాత్తాపం మమల్ని చంపేసేది కానీ నువ్వు మాకు ఆ పరిస్థితి తీసుకురాలేదు. మొదటి సారి మిథున వల్ల నీలో ఎంతో కొంత మార్పు వచ్చింది. నువ్వు పూర్తిగా మారుతావన్న ఆశ నమ్మకం నాకు వచ్చిందని అంటారు. 

ఆదిత్య మాటలకు మానిప్యులేట్ అయిన హరివర్దన్ మిథునని ఇంటికి వచ్చేయమని చెప్తారు. మిథున షాక్ అయి దేవా నన్ను ఇష్టపడుతున్నాడు నాన్న అని చెప్తుంది. ఇప్పటివరకు తన ఆ మాట చెప్పలేదు కనీసం ఇప్పుడైనా చెప్పమని చెప్పు అమ్మా నేనేం మాట్లాడను అని హరివర్దన్ అంటారు. కానీ దేవా ఏం మాట్లాడదు. దాంతో మిథున పది రోజుల గడువు అడిగి దేవాని మన ఇంటికే తీసుకొస్తా అప్పటికీ మీరు  దేవాని నమ్మకపోతే  మీరు చెప్పినట్లు చేస్తానని అంటుంది. దాంతో హరివర్దన్ ఒప్పుకుంటారు. ఇక మిథున, దేవా హరివర్దన్ ఇంటికి వెళ్తారు. ఇదే ఈ వారం జరిగింది.  

Also Read: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్: రాజమాత వల్లీ కొత్త ఆర్డర్లు.. ప్రేమని గెంటేసి డోర్ లాక్.. ధీరజ్ పరిస్థితేంటి!