Illu Illalu Pillalu Serial July 28 to aug 2nd Weekly Episode ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ రోజు రోజుకు చాలా ఇంట్రస్టింగ్‌గా సాగుతుంది.. ఈ వారం మొత్తం అదిరిపోయే ట్విస్ట్‌లు, గిల్లిగజ్జాలు, ఒకరి మీద ఒకరి పెత్తనాలతో ఎపిసోడ్స్ అదరగొట్టేశాయి. ఇంతకీ ఈ వారం మొత్తం ఏం జరిగిందో ఆ హైలెట్స్‌ ఇప్పుడు తెలుసుకుందాం..

గయ్యాలి గంప శ్రీవల్లి ఇంటి పెత్తనం దక్కించుకోవడంతో ఇంట్లో అందరికీ కొత్త కొత్త రూల్స్ పెడుతుంది. అందులో భాగంగా రాత్రి పది తర్వాత ఎవరు వచ్చినా ఇంటి బయటే ఉండాలి లోపలికి అనుమతి లేదు అని చెప్పేస్తుంది. ధీరజ్ డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు కదా ఇంటికి ఆలస్యంగా వస్తాడు అని ప్రేమ చెప్పిన వల్లి వినదు. అందర్ని పది అయ్యే సరికి ఎవరి గదుల్లోకి వాళ్లని పంపేస్తుంది. ప్రేమ ధీరజ్‌ కోసం బయట వెయిట్ చేస్తుంటే ప్రేమని లోపలికి పిలుస్తుంది. ధీరజ్ రాకుండా రాను అని చెప్పిన ప్రేమను వల్లి బయటకు తోసేసి తలుపు గడియ వేసేస్తుంది. ప్రేమ ధీరజ్ ఇద్దరూ కిటికీ విప్పేసి ఇంట్లోకి వెళ్లిపోతారు. ఉదయం ఆ విషయం తెలుసుకున్న వల్లి ఇంట్లో పంచాయితీ పెట్టేస్తుంది. తన మాట కాదు అంటే మామయ్య మాట కాదన్నట్లే అని ప్రేమకి స్టోర్‌రూం క్లీన్ చేయమని పనిష్మెంట్ ఇస్తుంది.

ప్రేమ అలాంటి పనులు చేయడం చూసి ప్రేమ తండ్రి చాలా ఎమోషనల్ అవుతాడు. ప్రేమను ఇంటికి వచ్చేయమని బతిమాలుతాడు. ప్రేమ, ఆమె తండ్రి మాటలు ధీరజ్ విని బాధ పడతాడు. వల్లితో గొడవ పడతాను అంటే ప్రేమ ఆపేస్తుంది. మరో ఎపిసోడ్‌లో నర్మద రామరాజు దగ్గరకు వెళ్లి అందర్ని వదిలేసి వచ్చిన మాకు తల్లిదండ్రులు లాంటి మీరు మాట్లాడకుండా దూరం పెట్టడం మేం తట్టుకోలేకపోతున్నాం.. మాకు అమ్మ అయినా నాన్న అయినా అన్నీ మీరే కదా మామయ్య మీరు దూరం పెడితే ఎలా అని ఏడుస్తుంది. దాంతో రామరాజు మాట్లాడుతా అని  అంటాడు. ఇక నర్మదని ఆఫీస్‌లో డ్రాప్ చేయమని సాగర్‌కి చెప్తాడు. 

సాగర్ నర్మదని డ్రాప్ చేయడానికి బైక్ ఎక్కమని అంటే తండ్రి చెప్పాడు కాబట్టి వచ్చావ్ నిన్నే నమ్ముకున్న నేను తప్పు చేయలేదు అని చెప్పినా నువ్వు నమ్మడం లేదు నేను నీతో రాను అని చెప్పేసి వెళ్లిపోతుంది. ఇక రాత్రి అందరూ భోజనం చేస్తున్నప్పుడు రామరాజు నర్మద, ప్రేమల్ని పిలుస్తాడు. అది చూసిన వల్లి మళ్లీ అందరూ కలిసిపోయేలా ఉన్నారని మామయ్య గారు మీ చొక్కా చింపేశారు.. మీకు అవమానం జరిగింది నాకు ముద్దు దిగడం లేదు అంటూ డ్రామా మొదలు పెట్టి రామరాజు ముద్దు కూడా ముట్టుకుండా చేస్తుంది. గొడవ మొత్తం గుర్తు చేసుకొని కూతుళ్లు అనుకున్న కోడళ్ల వల్ల నా పరువు పోయింది. నేను బతికున్న శవంలా అయిపోయాను  అని రామరాజు చిన్ని పిల్లాడిలా ఏడ్చేస్తాడు. దాంతో సాగర్, ధీరజ్‌లు ప్రేమ వల్లే ఇదంతా అంటే  నర్మద వల్లే అని చివరకు  ఆ ఇద్దరి వల్లే ఇదంతా అని పెళ్లాల్ని తిడుతారు. 

తమ్ముళ్ల దగ్గరకు చందు వచ్చి మీ భార్యల్ని మీరు అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు అని క్లాస్ ఇస్తాడు. ఇక నర్మద, ప్రేమలు ఇంట్లో అందరూ తమని దూరం పెడతున్నారని ఈ ఇంట్లో ఎందుకు ఉంటున్నామో తెలీడం మొదటి సారి అమ్మ గుర్తొస్తుంది. అమ్మ ఒడిలో తల పెట్టుకొని కష్టం చెప్పుకోవాలని ఉందని ఏడుస్తారు. కోడళ్ల మాటలు విన్ని వేదవతి ఏడుస్తూ ఇద్దరి మధ్యన కూర్చొని ఇంకొసారి అమ్మ లేదు అంటే చంపేస్తా.. నేను ఎవర్ని మరి.. అని కోప్పడుతుంది. దాంతో ప్రేమ, నర్మద ఇద్దరూ అత్త భుజం మీద వాలిపోయి ఏడుస్తారు. మొత్తానికి అత్తా కోడళ్లు కలిసిపోతారు. వల్లికి అనుమానం మీరు కలిసిపోయారా అని అడుగుతుంది. 

నర్మద అత్తకి సైగ చేయడం, వేదవతి కోడళ్లు అంటే నచ్చనట్లు మాట్లాడుతుంది. నర్మద, ప్రేమ, వేదవతిలు కావాలనే గొడవ పడతారు. అది చూసి శ్రీవల్లి హమ్మయ్యా వీళ్లు కలవలేదు అనుకుంటుంది. మరో ఎపిసోడ్‌లో సేటు వచ్చి చందు కాలర్ పట్టుకొని పది లక్షల కోసం ప్రశ్నించడం చందు సేటుని బతిమాలడం నర్మద చూసేస్తుంది. ఏమైనా సమస్యనా బావగారు ఉంటే చెప్పండి అందరం కలిసి పరిష్కరించుకుందామన్నా చందు ఏం లేదు అనేస్తాడు. చందు వల్లిని ఈడ్చుకొచ్చి మీ ఇంట్లో డబ్బులు అడుగుదాం అని తీసుకెళ్తుంటే నర్మద మళ్లీ చూసి ప్రశ్నిస్తుంది. 

శ్రీవల్లి దొరికిపోయానని అనుకొని మా మొగుడు పెళ్లాల విషయాలు నీకు ఎందుకు అని నర్మదతో గొడవ పడుతుంది. చందుకి సర్ది చెప్పి పంపేస్తుంది. నీ బాగోతం బయట పెడతా అని నర్మద వల్లితో చిటెకలు వేసి మరీ ఛాలెంజ్ చేస్తుంది. ఇక వల్లి పుట్టింటి గుట్టు తెలుసుకోవడానికి నర్మద, ప్రేమలు వల్లితో ఉప్మా తినిపించి అందులో బొద్దింక పడింది నువ్వు చనిపోతావ్ అని చెప్పి వల్లి వాంతులు చేసుకునేలా చేసి ఇంట్లో అందరికీ వల్లి నెల తప్పిందని చెప్తారు. వల్లి పుట్టింటి వాళ్లు కూడా గుడ్‌ న్యూస్ అని వస్తారు. తీరా అందరితో తాను ప్రెగ్నెంట్ కాదని వల్లి చెప్తుంది. ఇక నర్మద, ప్రేమలు ముందు అనుకున్నట్లు వల్లి పుట్టింటి గుట్టు తెలుసుకోవడానికి భాగ్యం, ఆనంద్‌రావులను ఫాలో అవుతారు. ఇవీ ఈ వారం హైలెట్స్.