'గుండె నిండా గుడి గంట‌లు' సీరియ‌ల్‌ (Gundeninda Gudigantalu Serial)తో తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌కు చేరువ‌య్యాడు విష్ణుకాంత్‌. అస‌లు పేరు కంటే బాలుగానే ఎక్కువ‌గా పాపుల‌ర్ అయ్యాడు. 'స్టార్ మా'లో టెలికాస్ట్ అవుతున్న ఈ సీరియ‌ల్‌లో తండ్రిపై ప్రేమానురాగాలు ఉన్న‌ కొడుకుగా, కుటుంబ బాధ్య‌త‌ల మ‌ధ్య న‌లిగిపోయే మిడిల్ క్లాస్ యువ‌కుడిగా, భార్య గౌర‌వాన్ని నిల‌బెట్టే భ‌ర్త‌గా మ‌ల్టీపుల్ షేడ్స్‌తో కూడిన మాస్ క్యారెక్ట‌ర్‌లో విష్ణుకాంత్  త‌న న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంటున్నాడు. 

గుడిగంటలే కాదు... 'మా ఇంటి దేవ‌త‌'లోనూ!'గుండె నిండా గుడి గంట‌లు' ద్వారా వ‌చ్చిన పాపులారిటీతో విష్ణుకాంత్‌కు తెలుగులో సీరియ‌ల్ ఆఫ‌ర్లు  బాగానే వ‌స్తున్నాయి. ఇటీవ‌లే 'స్టార్ మా'లో ప్ర‌సార‌మ‌వుతున్న 'దేవ‌త' సీరియ‌ల్‌లో గెస్ట్ రోల్ చేశాడు. కొన్ని టీవీ షోస్‌లో క‌నిపించాడు. ప్ర‌స్తుతం తెలుగులో 'గుండె నిండా గుడి గంట‌లు'తో పాటు జెమిని టీవీలో టెలికాస్ట్ అవుతున్న 'మా ఇంటి దేవ‌త' సీరియ‌ల్‌లో విష్ణుకాంత్ లీడ్ రోల్‌లో న‌టిస్తున్నాడు. 

టీఆర్పీ రేటింగుల్లో గుండె నిండా టాప్‌!లేటెస్ట్ టీఆర్‌పీ రేటింగ్‌లో విష్ణుకాంత్ న‌టించిన 'గుండె నిండా గుడి గంట‌లు' టాప్‌లో నిల‌వ‌గా... 'మా ఇంటి దేవ‌త' సీరియ‌ల్ లాస్ట్‌లో నిలిచి డిజప్పాయింట్ చేసింది. తాజా టీఆర్‌పీలో గుండె నిండా గుడి గంట‌లు 12.86 రేటింగ్‌ను సొంతం చేసుకున్న‌ది. కార్తీక దీపం 2 (14.70), ఇల్లు ఇల్లాలు పిల్ల‌లు (13.43 త‌ర్వాత‌) త‌ర్వాత మూడో ప్లేస్‌లో గుండె నిండా సీరియ‌ల్‌ నిలిచింది.

Also Read: బిగ్‌ బాస్ బాలాదిత్య కొత్త సీరియ‌ల్ టైటిల్ ఇదే - 'వంట‌ల‌క్క‌'కు జోడీగా!

అర్బ‌న్ ఏరియా రేటింగ్స్‌లో 'స్టార్ మా' సీరియ‌ల్స్‌లో 'గుండె నిండా గుడి గంట‌లు' టాప్‌లో ఉంది. ఈ సీరియ‌ల్‌కు 11.65  రేటింగ్ రాగా... 'కార్తీక దీపం 2' 11.58తో సెకండ్ ప్లేస్‌లో ఉంది. 'స్టార్ మా'లో తిరుగులేని ఆద‌ర‌ణ‌తో బాలు సీరియ‌ల్ దూసుకుపోతుంది. 

'మా ఇంటి దేవత' సీరియల్ లాస్ట్ ప్లేస్‌!మ‌రోవైపు 'మా ఇంటి దేవ‌త' సీరియ‌ల్ మాత్రం పూర్ రేటింగ్‌తో నిరాశ‌ ప‌రిచింది. ఈ సీరియ‌ల్‌కు వ‌న్ రేటింగ్ మాత్ర‌మే వ‌చ్చింది. అర్బ‌న్ ఏరియాలో ఏ మాత్రం ప్ర‌భావం చూపించ‌లేక‌పోయింది. 0.62 రేటింగ్‌ను మాత్ర‌మే ద‌క్కించుకున్న‌ది. బాలు న‌టించిన  ఓ సీరియ‌ల్ టాప్‌లో మ‌రో సీరియ‌ల్ లాస్ట్‌లో ఉండ‌టం సీరియ‌ల్ ఫ్యాన్స్‌లో ఆస‌క్తిక‌రంగా మారింది. 'గుండె నిండా గుడి గంట‌లు' సీరియ‌ల్‌లో విష్ణుకాంత్‌తో పాటు అమూల్య‌గౌడ‌, అనీలా శ్రీకుమార్‌, విహారిక చౌద‌రి కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

Also Readతెలుగు 'బిగ్ బాస్'లో కన్నడ హీరోయిన్... లాస్ట్ ఇయర్ ఛాన్స్ మిస్, ఈసారి పక్కా!