Trinayani july 14th: తిలోత్తమా మణి ని నయని దగ్గరే ఉంచమని.. ఈరోజు రాత్రికి వెన్నెల్లో పెట్టి చూడాలి అని అంటుంది. అది కరిగిపోతుంది కదా అని సుమన అంటుంది. ఇక దానికంటే ఎక్కువ విలువైనది నీకు ఇస్తాను అంటుంది. ఇక సుమన ఇప్పుడు తల ఊపుతాను కానీ తర్వాత ఏం చేస్తానో చూడండి అని అనుకుంటుంది. ఇక గురువు కూడా చీకటి పడ్డాక వెన్నెల వచ్చాక ఆ మచ్చ గురించి చూడమని చెబుతాడు.
ఆ తర్వాత తిలోత్తమా, వల్లభ అఖండ స్వామీజీ దగ్గరికి వెళ్తారు. దాంతో తిలోత్తమా ఆ స్వామీజీతో తను మచ్చ గురించి చెప్పి.. మణి ద్వారా ఇంతకుముందు ఆ మచ్చ ఎవరికి ఉందో తెలిసిపోతుందని విశాలాక్షి చెప్పిందని అంటుంది. అందుకే ఒకసారి ఈ విషయం మీకు చెప్పడానికి వచ్చాను అని అంటుంది. దాంతో ఆ స్వామీజీ వద్దు తిలోత్తమా అని.. వెన్నెల్లో మణి పెట్టి చూడటం వల్ల నీ ప్రాణాలకు ప్రమాదం అని అంటాడు.
దానితో తిలోత్తమా అయినా పర్వాలేదు అని అంటుంది. దీని వల్ల పక్కకు లాక్కొని వెళ్లి ఏంటి మమ్మీ ప్రాణాలు పోతాయని అఖండ స్వామి చెప్పిన కూడా వినకుండా అలా అంటున్నావు అని అడుగుతాడు. దాంతో ఒక ప్రయత్నం అయితే చేసి చూద్దాం అని మొండిగా మాట్లాడుతుంది. ఇక స్వామీజీ దగ్గరికి వచ్చి దీవించమని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోగా వెంటనే స్వామీజీ కోరి చావు తెచ్చుకుంటుంది కర్మ అని అనుకుంటాడు.
మరోవైపు సుమన కోసం ఒక కషాయాన్ని పట్టుకొస్తాడు విక్రాంత్. అది తాగమని అనడంతో సుమన తాగి చేదుగా ఉంది అని ఛీ కొడుతుంది. ఇక ఇది ఎందుకు తెచ్చావు అని అడగటంతో.. పాము కాటేసినందుకు నువ్వు స్పృహలోకి వచ్చినప్పటికీ కూడా ఎక్కడ ఒకచోట విషం ఉంటుందన్న అనుమానంతో నయని వదిన దగ్గరికి వెళ్లి సలహా అడగటంతో ఈ కషాయి చేసి ఇచ్చి ఇచ్చింది అని అంటాడు.
దానికి సుమన తన అక్క కావాలని ఇచ్చింది అని అక్కను అపార్థం చేసుకుంటూ కోపంతో మండిపడుతుంది. వెంటనే ఆ మాటలు వినలేక లాగి చెంప పగలగొడతాడు విక్రాంత్. దాంతో మరింత కోపంగా కనిపిస్తుంది సుమన. విశాల్ బయట గురువుతో వెన్నెల్లో చంద్రకాంతపు మణి పెట్టి చూడటం వల్ల గాయత్రి పాపని తన తల్లి అని తెలిసిపోతుందేమో అని చెప్పుకుంటూ బాధపడతాడు. తిలోత్తమా అమ్మ చూస్తే ప్రమాదమని అంటాడు.
కూతురు లాగా చూసుకునే విశాలాక్షి ఈ సలహా ఇచ్చింది అని బాధపడతాడు. అంతేకాకుండా గురువుతో మీరు కూడా ఈ పని చేయమని సలహా ఇచ్చారు.. ఆ సమయంలో మీరు ఆపుతారు అనుకున్నాను కానీ ఇలా అంటారనుకోలేదు అని అంటాడు. దాంతో గురువు నేను ఎలా అసత్యం చెప్పాలి అని అంటాడు. ఏం జరుగుతుందో చూద్దామని అంటాడు. అంతేకాకుండా హాసిని చొరవ తీసుకోమని చెబుతాడు.
చీకటి పడటంతో నయని మూకుడు ఏర్పాటు చేస్తూ ఉంటుంది. అప్పుడే గురువు కూడా వస్తాడు. ఎక్కడ నిజం తెలిసి పోతుందో అని విశాల్ తెగ భయపడుతూ కనిపిస్తాడు. ఇక నయని మణి తీస్తుండటంతో గురువు ఆపి ముందు సుమన చుట్టు ముగ్గుతో కవచం వేయమని విక్రాంతతో అంటాడు. దానితో సుమన తనను అందరూ టార్గెట్ చేశారు అని కోపంగా కనిపిస్తుంది. ఇక నయని మూకుడులో మణి పెట్టగా అప్పుడే సుమన వద్దు అంటూ మొగ గొంతుతో అరుస్తుంది. దాంతో అందరూ భయపడిపోతారు.
Also read : Rangula Ratnam July 13th: ‘రంగులరాట్నం’ సీరియల్: నవ్వుతూనే లోకం విడిచిన వర్ష, శోకసంద్రంలో కుటుంబ సభ్యులు?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial