Trinayani September 25th Written Update: అయినా అదేంటి మమ్మీ ఏదో అప్పడం తినేసినట్టు విషపూరితమైన కత్తిని అలా తినేసింది అని తిలోత్తముతో వల్లభ అంటాడు.


తిలోత్తమ: అవునురా తను మనిషి రూపంలో ఉంటే ఆ విషం తనకి ప్రభావితం అయ్యేది కానీ పాము రూపంలో ఉంది కనుక అది తనకి ఏమీ చేయదు


వల్లభ: 10 కోట్ల విషయంలో సుమనకి బానే సహాయం చేశాము గానీ ఈ విషపుకత్తి ప్లాన్ మాత్రం బెడిసి కొట్టింది మమ్మీ


తిలోత్తమ: పోనీలే అది మన మంచికే ఆ పాము యొక్క శక్తి ఏంటో మనకి అంచనా వచ్చింది తన్ని ఎలాగైనా మంచిగా చేసుకొని సుమనని వాడుకున్నట్టే తనని కూడా మన వైపు లాగుకోవాలి. ఇంకో విషయం ఈ సంవత్సరం నయని ప్రసవించి రెండో సంవత్సరం అవ్వబోతుంది అంటే జాతకం ప్రకారం నాకు మరణ గండం ఉండబోతుంది అని వల్లభతో అంటుంది తిలోత్తమా.


ఆ తర్వాత సీన్లో పిల్లలు ఇద్దరికీ నయని దిష్టి తీస్తూ ఉండగా అక్కడికి విశాల్ వస్తాడు.


విశాల్: పిల్లలు ఇద్దరికీ దిష్టి తీస్తున్నావా?


నయని: అవును బాబు గారు పిల్లలు ఇద్దరు ఎంత ముచ్చటగా ఉన్నారో ఈరోజు. అలాగే పుండరీ నాధుడు కూడా భలే బాగున్నాడు.


విశాల్: మరి సుమనా బిడ్డ?


నయని: దాని గురించే ఒక విషయం మాట్లాడాలి అనుకుంటున్నాను బాబు గారు. మనం పంతులు గారిని కలిసి దీని గురించి కనుక్కుందాము అసలు గాయత్రమ్మగారు విశాలాక్షి అమ్మ గారిని ఎందుకు కలిశారో ఆ సంఘటన అంతా పూర్తిగా తెలుసుకుందాము అని అనగా విశాల్ మనసులో అది తెలియక పోవడమే మంచిది లేకపోతే సుమనకి నీకు గొడవలు పెరిగిపోతాయి అని అనుకుంటాడు.


ఆ తర్వాత రోజు ఉదయం పవన మూర్తి మెట్లు దిగుతూ హాల్లోకి రాగా చీకట్లో ఒక రూపం కనిపించి వెంటనే గట్టిగా అరుస్తాడు. ఆ అరుపుకి కుటుంబ సభ్యులందరూ హాల్లోకి వచ్చి లైట్లు వేస్తారు. చూసేసరికి అక్కడ సుమన కూర్చొని ఉంటుంది.


దురంధర: వామ్మో వామ్మో ఏమైంది మా ఆయన అరిచాడు అంటే మళ్ళీ పడిపోయాడేమో


పవనమూర్తి: లేదే బాబు సడన్ గా లైట్లు అన్ని ఆపి ఉండడంతో సుమనని దెయ్యం అనుకొని అరిచాను. అయినా నువ్వేంటమ్మా ఇప్పుడు కూర్చొని ఏం చేస్తున్నావు?


సుమన: కనిపించట్లేదా నా పాపకు దిష్టి తీస్తున్నాను


వల్లభ: అక్కడ పాప ఏది?


సుమన: అది కనిపించదు ఎందుకంటే పాము రూపంలో ఉంది. ఇంకొంచెం సేపట్లో పాప అవుతుంది. నిన్న రాత్రి మా అక్క పిల్లలు ముగ్గురికి దిష్టి తీసింది కానీ నా పాపని మాత్రం వదిలేసింది అందుకే ఎవరి కళ్ళు పడకూడదు అని ఎటువంటి హాని రాకూడదు అని నా పాపకి నేను దిష్టి తీసుకుంటున్నాను అని అనగా ఇంతలో పాము పాపగా మారిపోతుంది.


విక్రాంత్: అప్పుడే పాము పాపగా మారిపోయింది. ఐదు నిమిషాలలో ఎంత చిత్రం జరిగిందో.


సుమన: ఇంక సరే దిష్టి తీసేసాను నీకు బట్టలు మారుస్తాను అని చెప్పి పాపను తీసుకొని పైకి వెళ్ళిపోతుంది.


విక్రాంత్: సుమనకి ఈ మధ్య పిచ్చి పట్టినట్టుంది


నయని: లేదు ఎవరి పాప మీద వాళ్ళకి పక్షపాతం ఉంటుంది అది తన మంచికే అని అంటుంది. ఆ తర్వాత సీన్లో సుమన పాపని తన గదిలో పడుకోబెట్టి ఫోటోలు తీస్తూ ఉంటుంది. ఇంతలో విక్రాంత్ అక్కడికి వస్తాడు.


విక్రాంత్: ఏం చేస్తున్నావే?


సుమన: చూశారా నా పాప రోజుకి రెండు అవతారాలలో ఎలా ఉంటుందో. దీన్నే ఫోటోలు తీసి సోషల్ పెడితే ఎవరూ నమ్మరు అందుకే వీడియోలు తీసి పెడితే వైరల్ అయిపోయి నాకు డబ్బులు వస్తాయి. అప్పుడు నిజంగానే లక్ష్మీదేవికి జన్మనిచ్చిన దాన్ని అవుతాను.


విక్రాంత్: నీకేమైనా పిచ్చి పట్టిందా డబ్బులు కోసం ఇంత చేస్తున్నావు అయినా ఇది ఎవరైనా చూస్తే ముందు నాగదేవత లాగ కొలుస్తారు కానీ తరువాత విషపూరితమైన జంతువు లాగే చూస్తారు


సుమన: నేనేం డబ్బు కోసం చేయడం లేదు ఇదంతా తన పెళ్లి కోసమే. అప్పుడు కట్నాలు ఇవ్వడానికి డబ్బులు ఎవడిస్తాడు? అయినా మా అక్క అందరి దగ్గర ఫేమస్ అయినప్పుడు మీరందరూ ఎంత గర్వంగా చూశారు. ఒక నాగుపాము తనికి సహాయం చేస్తుంది అని అందరికీ తెలుసు మరి నా కూతురి విషయానికి వస్తే ఎందుకు ఏది చెప్పనివ్వడం లేదు?


విక్రాంత్: అది వదిన మంచితనంతో సంపాదించుకున్న గౌరవం. ఇంక పాప విషయానికి వస్తే తన ఫోటో కూడా నువ్వు పోస్ట్ చేయడానికి వీలు లేదు నా మాట కాదని ఏదైనా చేస్తే ఆ పది కోట్లు కూడా డిపోసిట్ చేయి నివ్వకుండా చేస్తాను జాగ్రత్త అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు విక్రాంత్.


ఆ తర్వాత సీన్లో దురంధర బయటికి వెళ్ళడానికి బయలుదేరుతుంది. ఇంతలో ఎక్కడికి వెళ్తున్నావు అని పవన మూర్తి అడగగా సుమనకి చెక్ బ్యాంకులో డిపాజిట్ చేయడానికి తోడుగా వెళ్తున్నాను అని అంటుంది. ఇంతలో విశాలాక్షమ్మ అక్కడికి వస్తుంది.


తిలోత్తమ: ఏంటి సుమన నువ్వు చెక్ డిపాజిట్ చేయడానికి వెళ్తున్నావు అని నన్ను ఎదురు రమ్మన్నావు ఇప్పుడు ఈవిడ ఎదురొచ్చింది పనవుతుందంటావా?


విశాల్: విశాలాక్షి ఇంటికి వచ్చిన ప్రతిసారి ఏదో ఒక మంచే జరుగుతుంది


నయని: ఇంతకీ నువ్వు వచ్చిన కారణమేంటమ్మా?


విశాలాక్షి: నేను రాకపోయి ఉంటే బయటికి వెళ్లిన సుమను కూడా ఇంటికి ఎప్పటికీ రాకపోయేది. నుదిటిన బొట్టు లేకుండా బయటికి వెళుతుంది ఆ నుదిటిన బొట్టు స్థానంలో రక్తం ఉండేది. అది చెప్పడానికే వచ్చాను


సుమన: మా అక్క చెప్పిన విషయాలే నేను నమ్ముతాను అయినా బొట్టు పెట్టుకోకపోతే ప్రాణగండం అనడం ఏంటి? నేనెందుకు నువ్వు చెప్పినవి నమ్మాలి?


తిలోత్తమ: నువ్వేమి త్రినయనివి కాదు అయినా బొట్టు పెట్టుకోకపోతే అప్పుడు తన భర్త అయిన విక్రాంత్ కి హాని కలుగుతుంది కానీ తనకెందుకు కలుగుతుంది?


విశాలాక్షి: త్రినైయనిని కాకపోయినా ఆ త్రినాథుడిని కట్టుకున్న దానిని.


నయని: ఇప్పుడు సుమనకి ప్రాణగండం ఉన్నదా?


Also Read: Guppedanta Manasu September 25th: శైలేంద్ర క్రూరత్వం- రిషి మీద అటాక్, ప్రాణాపాయ స్థితిలో జగతి


Join Us On Telegram: https://t.me/abpdesamofficial