Trinayani july 17th: నేను గాయత్రి అమ్మగారు అనుకున్నాను అని జరిగిన విషయం గురించి నయని విశాల్ తో అంటుంది. అయినా అమ్మగారు అలా ఎందుకు చేస్తారు అలా చేయరు అని నిజాన్ని తానే కవర్ చేస్తూ మాట్లాడుతుంది. ఇక విశాల్ తన మనసులో.. అమ్మని చంపింది తిలోత్తమ్మా అని నీకు తెలుసని నాకు తెలుసు అని.. నాకు తెలిసిన విషయం నీకు తెలియదు అని అనుకుంటాడు.
ఆ తర్వాత విశాల్ నువ్వు అందరి గురించి ఆలోచిస్తావు అనటంతో ఇక నయని తన చెల్లి గురించి మాట్లాడుతుంది. ఇక తిలోత్తమా అమ్మ రేపు కచ్చితంగా బోనం మోయాలి కదా అని అనటంతో అవును అని లేదంటే నష్టం ఎదురవుతుంది అని అంటుంది. మరోవైపు తిలోత్తమా జరిగిన విషయాల గురించి ఆలోచిస్తూ ఉండగా అప్పుడే వల్లభ తిలోత్తమా గొంతు నొప్పికి కాపురం పెట్టడానికి వచ్చి వెటకారంగా మాట్లాడుతాడు.
దాంతో తిక్కరేగిన తిలోత్తమా వెంటనే కొడుకు అని చూడకుండా అతడి గొంతు గట్టిగా నొక్కుతుంది. ఊపిరాడక నొప్పితో వల్లభ బాధపడుతుండడంతో తన పరిస్థితి కూడా ఇలాగే ఉంది అని అంటుంది. ఇక బోనం గురించి మాట్లాడటంతో.. తను రేపు బోనం మోయనని.. గొంతు నొప్పి ఉందని చెప్పి కవర్ చేస్తాను అని అంటుంది. అలా అయితే వాళ్ళు కుదరదని అంటారు కదా అని అనడంతో నేను మాత్రం బోనం ఎత్తుకోను అని అంటుంది.
ఇక మరుసటి రోజు సుమన దగ్గరికి నగలు తీసుకొని వస్తాడు. నగలు విక్రాంతే తీసుకొచ్చాడని మురిసిపోతుంది సుమన. కానీ అవి నయని వదిన ఇచ్చింది అనటంతో కోపంతో ఊగిపోతుంది. ఇక మీ అక్కే కదా నగలు ఇచ్చింది పెట్టుకొ అనడంతో నేను పెట్టుకోను తన దగ్గర చాలా ఉన్నాయని.. అందులో కొన్ని నగలు ఇచ్చింది అని.. వేసుకొని తిరిగితే అందరికీ ఆ నగలు నావే అని చూపిస్తుంది అని అక్క గురించి అపార్థం చేసుకుంటూ ఉంటుంది.
దాంతో విక్రాంత్ తనపై మరింత కోప్పడతాడు. తిరిగి ఆ నగలు ఇచ్చి తిలోత్తమా ఇచ్చిన నగలు చూపిస్తుంది. ఇక ఇవి అత్తయ్య గారు ఇచ్చారు అనటంతో.. తనని ఎక్కువగా నమ్మకు అని అంటాడు విక్రాంత్. కన్నతల్లిని అలా అంటారా అని సుమన అనటంతో పేరుకే తను కన్నతల్లి కానీ తన దగ్గర ప్రేమ లేదు అని చెప్పి పద్ధతిగా రెడీ అవ్వు అని అక్కడి నుంచి వెళ్తాడు.
ఆ తర్వాత అందరూ తిలోత్తమా కోసం ఎదురు చూస్తారు. రాగానే బోనం ఎత్తుకోమని అంటారు. కానీ తను మాత్రం సాయంత్రం వరకు ఎత్తుకోవటం కష్టం అని అంటుంది. ఎత్తుకోకపోతే నష్టం జరుగుతుంది అని ఇంట్లో వాళ్ళు చెప్పినా కూడాఎత్తుకోను అని అంటుంది. బోనం ఎత్తుకొకపోతే ఏం జరగదు అని విశాలాక్షి చెప్పింది కదా అనటంతో.. చచ్చిపోతావు అని ఢమ్మక్క అంటుంది.
అయినా కూడా ఆ మాటలు వినిపించుకోకుండా అక్కడి నుండి వెళ్తుండగా తనకు శ్వాస ఆడదు. దాంతో అందరు కంగారు పడిపోతారు. అత్తయ్య బోనం ఎత్తుకుంటేనే శ్వాస ఆడుతుందని నయని చెప్పటంతో.. ఇక ప్రాణాలు పోతాయేమో అని భయపడి తిలోత్తమా బోనం ఎత్తుకుంటాను అని అంటుంది. దీంతో ఇంట్లో వాళ్ళందరూ బోనం సిద్ధం చేస్తారు.
also read it : Rangula Ratnam July 15th: వర్ష లేదని నిజం తెలుసుకొని కుమిలిపోతున్న తండ్రి.. నడిరోడ్డుపై శంకర్ ప్రసాద్ ను అవమానించిన రేఖ?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial