Rangula Ratnam July 15th: హాస్పిటల్లో శంకర్ కళ్లకు కట్టిన కట్టు విప్పుతాడు డాక్టర్. మరోవైపు ఒకచోట నిలబడి శంకర్ ని చూసుకుంటారు పూర్ణ, రఘు. వైపు పూర్ణ కూతురు గురించి తలుచుకుంటూ ఎమోషనల్ అవుతూనే.. మరోవైపు భర్త కు కళ్ళు వచ్చాక చూపు వచ్చిన ఆనందంతో పాటు ఆయనకు దూరం అవుతున్న బాధ కూడా వెంటాడుతుంది. ఇక డాక్టర్ కట్లు విప్పిన తర్వాత శంకర్ ఎదురుగా తన కూతురు వర్ష ఉంటుంది అని అనుకుంటాడు.


సత్యంని చూసి చుట్టుపక్కల వర్ష కనిపించకపోయేసరికి వర్షం ఎక్కడా అని సత్యంను అడుగుతాడు. వర్ష దగ్గరికి వెళ్లి చెప్పలేదు కదా.. ఆపరేషన్ అయిన విషయం కూడా నువ్వు వర్షకు చెప్పలేదు కదా అంటూ సత్యంపై అరుస్తాడు. ఇక సత్యం వర్ష దగ్గరికి వెళ్లే పరిస్థితి లేదు అని కాస్త నువ్వు ఓపికగా ఉండు అని ధైర్యం ఇస్తూ ఉంటాడు. ఇక డాక్టర్ కూడా శంకర్ ను టెన్షన్స్ పెట్టుకోకుండా ఉండమని అంటాడు.


శంకర్ వినిపించుకోకుండా కూతురు దగ్గరికి వెళ్ళాలి అని మొండి చేస్తాడు. సత్యం వాళ్ళు ఎంత ఆపిన కూడా ఆగకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెంటనే డాక్టరమ్మ వెళ్లనివ్వండి నిజం తెలిసాక తన గుండె ధైర్యం తెచ్చుకుంటాడు.. ఇప్పుడు చూసే వరకు చూడాలి చూడాలి అని తపనతో మళ్లీ ఏదైనా టెన్షన్ పెట్టుకుంటాడు. కాబట్టి వెళ్ళనివ్వండి అని అంటుంది. ఇక పూర్ణ వాళ్లు కూడా బాగా ఎమోషనల్ అవుతూ ఉంటారు.


మరోవైపు వర్ష ఫోటో దగ్గర భర్తతో పాటు అత్త మామ కూర్చొని బాగా ఏడుస్తూ ఉంటారు. అప్పుడే వర్ష అని పిలుస్తూ శంకర్ లోపలికి రావడంతో ఆకాష్ వాళ్ళంతా వర్ష ఫోటోకి అడ్డుగా నిలబడతారు. ఇక వర్ష ఎక్కడ అని ఆకాష్ ని అడగటంతో.. ఏడుస్తూ ఫోటో కనబడేలా చేస్తారు. వర్ష ఫోటో అలా చూసి కుప్పకూలిపోతాడు శంకర్ ప్రసాద్. కూతురు లేదని జీర్ణించుకోలేకపోతాడు.


ఇక వర్ష అత్తమామలు వర్ష గురించి గొప్పగా చెబుతుంటారు. ఒకప్పుడు బ్రహ్మ రాక్షసులకు ప్రవర్తించిన మమ్మల్ని తను మార్చేసింది అని అంటారు. ఆకాష్ కూడా తనకు బ్రెయిన్ ట్యూబర్ అని.. ఎవరికి చెప్పకుండా ఆ విషయాన్ని తను రహస్యంగా ఉంచింది అని.. ఆ విషయం తనకు తెలిసే వరకు డాక్టర్స్ ఛాన్స్ లేదని అన్నారని చెప్పటంతో వెంటనే శంకర్ ఆపండి అంటే వారిపై గట్టిగా అరుస్తాడు.


మీరే నా కూతుర్ని చంపేశారు అని.. పెళ్లి సమయంలో నా కూతురు మాట వినకుండా గుడ్డిగా నీకిచ్చి పెళ్లి చేశాను అని.. ఆ తర్వాత తిరిగి ఇంటికి వచ్చేయమని అన్నా కూడా నా కూతురు రాలేదు అని.. నా కూతురిని చంపి ఇప్పుడు దేవత అని పొగుడుతున్నారా అని వారిపై అరుస్తాడు. అంతేకాకుండా ఆకాష్ కాలర్ పట్టుకుని కోపంతో రగిలిపోతాడు. అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా ఎవరు ఆపిన కూడా వినిపించుకోకుండా వెళ్ళిపోతాడు.


అప్పుడే పూర్ణ, సత్యం వాళ్ళు అక్కడికి రావడంతో జరిగిన విషయం మొత్తం వాళ్ళు చెప్పటంతో.. వెంటనే శంకర్ ను వెతకడానికి వెళ్తారు. నాలుగు వైపులా శంకర్ ని వెతికిన కూడా ఎక్కడ కనిపించడు. తరువాయి భాగంలో శంకర్ కు రేఖ ఎదురుపడి ఇప్పుడు నేను గొప్ప స్థాయిలో ఉన్నాను అంటూ శంకర్ ను అవమానిస్తుంది. అంతేకాకుండా పాపం ఆకలితో ఉన్నావు అంటూ వంద రూపాయలు విసిరేస్తుంది.


also read : Madhuranagarilo July 15th: శ్యామ్ ను అరెస్టు చేసిన పోలీసులు.. కనికరం లేకుండా ప్రవర్తిస్తున్న రాధ?


Join Us on Telegram: https://t.me/abpdesamofficial