Madhuranagarilo July 15th: శ్యామ్ కిరణ్ తో రాధను ప్రపోజ్ చేయడానికి ఈసారి కూడా వర్కట్ కాలేదు అని చెబుతూ ఉంటాడు. ఇక అప్పుడే రాధ పెళ్లి సంబంధం గురించి ఒక వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతుంది. ఆ వ్యక్తి తను మధురానగరి బస్ స్టాప్ లో ఉన్నాను రమ్మని అనడంతో రాధ అక్కడికి వెళుతుంది. కిరణ్ ఇదే అవకాశం వినియోగించుకొని ఎలాగైనా ప్రపోజ్ చేయమని శ్యామ్ కు సలహా ఇస్తాడు.


మరోవైపు గన్నవరం, గోపాల్ చీరలకు స్టీల్ సామాన్లు అమ్ముతుంటాడు. అప్పుడే శిరోజా తన దగ్గర పాత బట్టలు ఉన్నాయని తీసుకొచ్చి ఇస్తుంది. దానికి రెండు ప్లేట్లు ఒక స్పూన్ మాత్రమే ఇస్తాము అని గన్నవరం అనడంతో.. ఇన్ని బట్టలు ఇస్తే ఇవే ఇస్తారా అని.. లోపల ఇంకా ఉన్నాయి అని ఆ మూట పైన ఉంది తీసుకోండి అని అనడంతో దానికి గన్నవరం అన్ని సామాన్లు ఇచ్చేస్తానని అంటాడు.


ఇక గోపాల్ ఆ మూట తేవడానికి శిరోజ తో పాటు ఇంట్లోకి వెళ్తాడు. వెంటనే శిరోజ లేనిది చూసి గన్నవరం తన ఇంట్లో ఉన్న కొన్ని స్టీల్ సామాన్లు ఎత్తుకొని పోతాడు. ఆ మూట తీసుకొని రాగానే గన్నవరం మళ్ళీ ఆ సామాన్లే తీసుకొచ్చి శిరోజకు ఇస్తాడు. దాంతో శిరోజా అవి తీసుకోగా అందులో తన పేరు ఉండటంతో వెంటనే వాళ్ళ దొంగలు అని వాసంతిని పిలుస్తుంది. దెబ్బకు గన్నవరం భయపడి వద్దని చెప్పి ఆ మూట ఇచ్చేసెయ్యండి అన్ని సామాన్లు ఇస్తాను అని ఆ మూట తీసుకొని అన్ని సామాన్లు ఇచ్చి అక్కడ నుంచి వెళ్తారు.


మరోవైపు రాధ బస్టాప్ లో పెళ్లి సంబంధం గురించి ఒక వ్యక్తితో మాట్లాడి అక్కడి నుంచి బయలుదేరుతుండగా  శ్యామ్ ఒక ఐదుగురు చిన్నపిల్లలతో రోజా పువ్వులు ఇప్పించి ఐ లవ్ యు చెప్పిస్తాడు. ఇక రాధ వాళ్ళందరి వైపు చూడటంతో వాళ్ళ వెనుకాల శ్యామ్ అని రాసి ఉంటుంది. దీంతో శ్యామ్ సార్ ప్రపోజ్ చేశాడని అనుకుంటుంది.


వెంటనే శ్యామ్ కూడా అక్కడికి వచ్చి ఐ లవ్ యు అని గులాబీ పువ్వులతో ప్రపోజ్ చేయడంతో రాధ షాక్ అవుతుంది. మీరు నాకు అలా చెప్పడం కరెక్ట్ కాదు అని.. నేను మిమ్మల్ని ప్రేమించడం లేదు అని.. కొన్ని రోజుల్లో మీరు సంయుక్తను పెళ్లి చేసుకోబోతున్నారని.. ఇలా చేయటం మంచిది కాదు అని వార్నింగ్ ఇచ్చినట్లు మాట్లాడుతుంది.


అప్పుడే అక్కడికి ఇద్దరు పోలీసులు సివిల్ డ్రెస్ లో వచ్చి రాధను ఏం జరిగింది.. నువ్వు అతడిని ప్రేమిస్తున్నావా  అని అడుగుతాడు. దాంతో రాదా నేను ఎవరిని ప్రేమించట్లేను ప్రేమించను కూడా అని అక్కడినుండి కోపంగా వెళ్ళిపోతుంది. పోలీసులు అది ఈవ్ టీజింగ్ కింద తీసుకొని శ్యామ్ ను అరెస్ట్ చేస్తారు. కాని శ్యామ్ తను నాకు తెలుసు అని ఎంత చెప్పినా కూడా వాళ్ళు వినిపించుకోరు.


మరోవైపు గన్నవరం, గోపాల్ ఆ పాత చీరలను హీరోయిన్లు కట్టుకున్నారని అమ్ముతారు. అప్పుడే అక్కడికి వచ్చిన నెల్సన్ హీరోయిన్లు కట్టుకున్న చీర అని తన భార్యకు కొనాలని అనుకుంటాడు. భార్య కోసం పాతిక వేలు సంపాదించడంతో.. ఆ పాతిక వేలతో చీర కొంటాడు. దాంతో గన్నవరం, గోపాల్ భలే బోల్తా కొట్టించాము అని తెగ సంబరపడిపోతారు.


ఇక పోలీస్ స్టేషన్లో శ్యామ్ తో పాటు మరో ముగ్గురు వ్యక్తులు కూడా అరెస్ట్ అవుతారు. శ్యామ్ దగ్గరికి ఇన్స్పెక్టర్ వచ్చి.. చూడ్డానికి చదువుకున్నవాడిలా ఉన్నావు.. ఇటువంటి పనులు చేస్తున్నావా అంటూ ప్రశ్నిస్తాడు. తరువాయి భాగంలో శ్యామ్ ఇన్స్పెక్టర్ ఫోన్ నెంబర్ నుండి రాధకు ఫోన్ చేయడంతో..  వెంటనే రాధ శ్యామ్ తన ఫ్రెండ్ ఫోన్ నుండి ఫోన్ చేస్తున్నాడేమో అనుకొని కోపంతో కట్ చేస్తుంది. దాంతో ఇన్స్పెక్టర్ కట్ చేస్తుంది అనటంతో మరోసారి ట్రై చేస్తాను కచ్చితంగా లిఫ్ట్ చేస్తుంది అని అంటాడు శ్యామ్. ఈసారి లిఫ్ట్ చేయకపోతే మరోలా ఉంటుంది అని వార్నింగ్ ఇస్తాడు ఇన్స్పెక్టర్.


also read : Prema Entha Madhuram July 15th: దోష పూజ చేయించుకుంటున్న అను, ఆర్య.. నిప్పు పెట్టడానికి సిద్ధమైన మాన్సీ?


Join Us on Telegram:  https://t.me/abpdesamofficial