Trinayani November 24: ఈరోజు ఎపిసోడ్ లో పంచగవ్వ అంటే నీకు తెలుసు కదా అయినా ఎందుకు బావగారు వాళ్ళని రెచ్చగొడతావు అంటూ కోప్పడుతుంది నయని.


సుమన: నాకేమీ తెలియదు మర్చిపోయాను కూడా..


తిలోత్తమ: పంట పొలాల్లో పిచికారి చేసేదాన్ని ప్రసాదం అని చెప్పి ఎవరైనా తినిపిస్తారా?


విశాల్: మేమందరం తీసుకున్నాం కదా.


తిలోత్తమ : నీ భార్య నీ హాసిని సపోర్ట్ చేయకు అంటూ కోపంగా అక్కడినుంచి వెళ్ళిపోతుంది.


నయని: ఆరోగ్యానికి మంచిది అంటారనుకుంటే ఇలా చేశారేంటి.


లైట్ తీసుకోమంటాడు విశాల్.


మరోవైపు పళ్ళు శుభ్రం చేసుకుంటున్న సుమనని స్నానం చేసాక పళ్ళు తోముకుంటున్నావేంటి?


సుమన : ప్రసాదం అని చెప్పి పేడని తినిపించారు కదా నోరు పేడ కంపు కొడుతుంది.


విక్రాంత్ : పేడ అనుకుంటే కంపు కొడుతుంది. ప్రసాదం అనుకుంటే అమృతం అవుతుంది. నోరు బాగోకపోతే బ్రష్ చేస్తున్నావు, బ్రెయిన్ బాగోకపోతే దాన్ని కూడా బయటకు తీసి వాష్ చేస్తావా..


సుమన: నేను పళ్ళు తోముకున్నా కుళ్లుకునే మిమ్మల్ని ఏమనాలి..


విక్రాంత్: మనసు శుభ్రంగా ఉంటే చాలు, ఈ శరీరానికి ఎన్ని సోకులు చేసినా ఇది చివరికి బూడిదే అవుతుంది ఇది గుర్తుపెట్టుకో లేకపోతే నీ ఫోటోకి కూడా పూలదండ వేస్ట్ అనుకుంటారు అని భార్యని తిట్టుకుంటూ అక్కడినుంచి వెళ్ళిపోతాడు.


మరోవైపు విక్రాంత్, విశాల్ అన్యోన్యంగా మాట్లాడుకోవడం చూసి ఆనందపడతాడు వామనమూర్తి.


వామనుమూర్తి : నిజంగా మీ ఇద్దరు రామలక్ష్మణులే నిన్న జరిగిన గొడవకి చిన్నల్లుడు కొద్ది రోజులు మాట్లాడటం మానేస్తాడు అనుకున్నాను.


సుమన : ఆయనకి చీము, నెత్తురు ఉన్న సిగ్గు శరం లేదు అందుకే మాట్లాడేస్తారు.


విక్రాంత్ : నిజంగానే నాకు సిగ్గు లేదు,అందుకే పెళ్ళాం ఎన్ని వెధవ వేషాలు వేసిన బజారున పడకుండా ఊరుకుంటున్నాను.


డమ్మక్క: సోమన వేషాలు చిత్రమే వల్లభుని వేషాలు విచిత్రం.


హాసిని: మా ఆయన కూడా పాత్రలోకి దిగాడా..


డమ్మక్క: అవును అటు చూడు అంటూ ఉండగానే వల్లభ, త్రిలోత్తమ ఒక పెట్టె ని తోసుకుంటూ లోపలికి వస్తారు.


తలకి టవల్ చుట్టుకు వచ్చిన భర్తని చూసి పనివాడు అంటూ వెటకారం ఆడుతుంది హాసిని.


విశాల్: నువ్వు ఉండు వదిన అంటూ వల్లభ వైపు తిరిగి ఏంటా గెటప్ అని అడుగుతాడు.


వల్లభ: గెటప్ ఏంటి అని కాదు ఆ బాక్స్ లో ఏంటి అని అడుగు.


విశాల్: ఏముంది అందులో అంటూ ఆ బాక్స్ ని ఓపెన్ చేస్తాడు. అందులో ఉన్న గాయత్రి దేవి బొమ్మ చెదలు పట్టడం చూసి ఇదేంటి ఇలా అయిపోయింది అని బాధపడతారు విశాల్, నయని.


తిలోత్తమ: గాయత్రీ దేవి అలా అయిపోయింది అంటూ వెటకారంగా మాట్లాడుతుంది.


సుమన : గాయత్రి దేవతయ్య పునర్జన్మ ఎత్తి ఎక్కడో పసిపాపగా ఉంది కదా, తనకి గండం చుట్టుకోబోతుందని తెలుసు కదా, ఆవిడ పరిస్థితి కూడా ఇంతే అని అక్క తెలుసుకోవాలి అంటూ వెటకారంగా మాట్లాడుతుంది.


తన మాటలు పట్టించుకోవద్దు అంటూ ఓదారుస్తాడు విక్రంత్.


వల్లభ: యమదీపదానం చేసిన రోజు దీపపు సెగ గాయత్రీ దేవి పెద్దమ్మ ఫోటోకి తగిలినప్పుడు ప్రమాదం ఆవిడకే అని అందరూ కంగారుపడ్డారు కదా దానికి సాక్ష్యంగానే బొమ్మ ఇలా అయిపోయిందని చూపించాం.


ఇంతలో సుమన హారతి పళ్ళెం తీసుకొని వచ్చి కళ్ళ ముందు పనికిరాకుండా ఉన్నది మరి ఎప్పుడు కళ్ళకి కనిపించకుండా ఉండడానికి అంటూ ఆ బొమ్మని కాల్చే స్తుంది. ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. కోపంతో సుమన చంప పగలగొడుతుంది నయని.


సుమన : ఏంటి అక్క ఇలా కొడతావ్?


నయని: చంపేయాలి నిన్ను.


సుమన: అందుకే కదా నిన్న ఈరోజును పోసి పంపించాలని చూశావు.


నయని: ఉలూచిని పెద్ద బొట్టమ్మ తీసుకురావాలని అలా చేశాను.


సుమన : నేను కూడా అలాగే చేశాను అనుకో. నేను చావలేదు అని గాయత్రి అత్తయ్య పరిగెత్తుకుంటూ వస్తుంది అనుకో.


వాళ్ళిద్దర్నీ మందలిస్తాడు విశాల్.


తిలోత్తమ: మీ ఆవిడ చిన్న కోడల్ని కొట్టింది.


హాసిని: కొట్టకుండా ముద్దు పెట్టుకోవాలా?


వల్లభ : నిన్న నయని అలా చేసినందుకు ఇవాళ సుమన ఇలా చేసింది.


డక్కమ్మ : సుమన కాల్చింది బొమ్మని అని ఆనందపడుతుంది కానీ తన అసూయను మాత్రమే కాల్చుకుంది.


నయనిని వెనకేసుకొస్తారు హాసిని, విక్రాంత్.


తిలోత్తమ: బొమ్మ కాలిపోయిన వాసన వస్తుంది క్లీన్ చేసి రూము ఫ్రెషనర్ స్ప్రే చెయ్యు. మా గాయత్రీ అక్కయ్యకి మల్లె పువ్వులు అంటే చాలా ఇష్టం. ఇలాంటి సమయంలో ఏం చేయాలో పాలు పోదు కదా అందుకే సలహా ఇస్తే త్వరగా కూడా కోలుకుంటారు అని వెటకారంగా మాట్లాడే అక్కడినుంచి వెళ్ళిపోతుంది.


సుమన కూడా కాలిపోయిన కంపు భరించలేకపోతున్నాం అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.