తాజాగా బిగ్ బాస్ సీజన్ 7లో జరిగిన మర్డర్ టాస్క్ చాలా ఎంటర్‌టైనింగ్‌గా సాగింది. కంటెస్టెంట్స్ అంతా బిగ్ బాస్.. తమకు ఇచ్చిన పాత్రలకు పూర్తిస్థాయిలో న్యాయం చేయాలని ప్రయత్నించారు. కానీ క్షుణ్ణంగా చూస్తే.. ఈ టాస్కులో బిగ్ బాస్ సైతం కొందరిని టార్గెట్ చేసినట్టుగా అనిపిస్తుందని ప్రేక్షకులు భావిస్తున్నారు. పైగా హంతకులు ఎవరు అనే విషయాన్ని పోలీసు ఆఫీసర్లుగా ఉన్న అమర్‌దీప్, అర్జున్ సైతం పూర్తిస్థాయిలో కనిపెట్టలేకపోయారు కాబట్టి ఈ టాస్కులో పోలీసులు గెలవలేదని, హంతకులే గెలిచారని ఆడియన్స్ భావిస్తున్నారు. ఇక ఈ టాస్కును బట్టి కెప్టెన్సీ టాస్కులో ఎవరు ఉండబోతున్నారు అనే విషయం స్పష్టమవుతోంది.


ఆ ముగ్గురినే టార్గెట్..
మర్డర్ టాస్కులో మొత్తం నలుగురు హౌజ్‌మేట్స్ చనిపోయారు. అయితే పల్లవి ప్రశాంత్, అశ్విని, గౌతమ్‌ల విషయంలో బిగ్ బాస్ కావాలనే వారిని కెప్టెన్సీ రేసు నుంచి తప్పించడానికి మర్డర్ చేయించాడని ప్రేక్షకులు భావిస్తున్నారు. ముందుగా పల్లవి ప్రశాంత్ మొక్కను దొంగిలించమని, ఆ తర్వాత అశ్విని పేరును అద్దంపై రాయమని, గౌతమ్‌కు తెలియకుండా తనకు స్టిక్కర్ అతికించమని చెప్పి బిగ్ బాస్.. వారిని మర్డర్ చేయించారు. అంటే ఇన్‌డైరెక్ట్‌గా వీరిని కెప్టెన్సీ రేసు నుంచి తప్పించాలని బిగ్ బాస్ ముందు నుండే ప్లాన్ చేశారు కాబోలు అని ప్రేక్షకులు భావించారు. శివాజీ.. గౌతమ్‌ను మర్డర్ చేసే మొదటి ప్రయత్నంలో విఫలం అయ్యాడు. అప్పుడు కూడా గౌతమ్‌ను వదిలేయకుండా ప్రియాంకతో మర్డర్ చేయించాడు బిగ్ బాస్. అంటే క్లియర్‌గా గౌతమ్.. ఈ టాస్కులో యాక్టీవ్‌గా ఉండకూడదు అని బిగ్ బాస్ ఫిక్స్ అయిపోయాడనే భావన ప్రేక్షకుల్లో కలిగింది. 


ఆ నలుగురు సైలెంట్..
మర్డర్స్ జరిగిన తర్వాత చనిపోయిన కంటెస్టెంట్స్ అంతా దెయ్యం డ్రెస్ వేసుకొని.. వారికోసం ఏర్పాటు చేసిన స్మశానంలో మాత్రమే ఉండాలి. కానీసం బిగ్ బాస్ హౌజ్‌లోకి రావడానికి కూడా వారికి అనుమతి లేదు. పైగా బ్రతికున్న కంటెస్టెంట్స్‌తో కూడా మాట్లాడే వీలు లేదు. దీంతో పల్లవి ప్రశాంత్, గౌతమ్, అశ్విని, యావర్.. ఈ రెండు రోజులు పూర్తిగా సైలెంట్ అయిపోయి, తమ ఆటను కనబరచలేకపోయారు. ఇప్పటివరకు హౌజ్‌లో కంటెస్టెంట్స్‌లో అశ్విని, రతిక, అమర్‌దీప్ మాత్రమే కెప్టెన్స్ అవ్వలేదు.


ఇన్వెస్టిగేటర్లుగా ఫెయిల్..
హంతకులను పట్టుకునే విషయంలో పోలీస్ ఆపీసర్లుగా ఉన్న అమర్‌దీప్, అర్జున్ సక్సెస్ అయ్యారని బిగ్ బాస్ చెప్పినా కూడా ప్రేక్షకులు మాత్రం ఈ విషయాన్ని పూర్తిస్థాయిలో అంగీకరించడం లేదు. ముందుగా శివాజీ హంతకుడు అని చెప్పినప్పుడు కూడా సరైన కారణాలు, ఆధారాలు చెప్పమని అడిగినప్పుడు అమర్, అర్జున్ చెప్పలేకపోయారు. ఆ తర్వాత శివాజీతో పాటు ఇంకొక హంతకుడు ఎవరో చెప్పమని అన్నప్పుడు వారిద్దరూ చెప్పకముందే శోభా.. ప్రియాంక పేరును అరవడం మొదలుపెట్టింది. దీంతో అమర్, అర్జున్ కూడా ప్రియాంకనే హంతకురాలు అని ప్రకటించారు. కానీ దానికి కూడా వారు సరైన కారణాలు చెప్పలేకపోయారు. ఈ విషయం శివాజీకి నచ్చలేదు. చీకట్లో బాణం వేసినట్టుగా తమ పేర్లు చెప్పారని, కానీ వారి దగ్గర ఆధారాలు, లేవని అన్నాడు. అయినా కూడా బిగ్ బాస్ పట్టించుకోకుండా అమర్, అర్జున్.. తమ టాస్క్‌లో సక్సెస్ అయినట్టు ప్రకటించాడు.


అమర్‌దీప్‌కే ఎక్కువ మద్దతు..


ఇక దానికి సంబంధించిన ప్రోమో కూడా విడుదలయ్యింది. కంటెస్టెంట్స్ ఇద్దరిద్దరుగా వచ్చి తమ ఎదురుగా ఉన్న ఇద్దరు కంటెస్టెంట్స్ ఫోటోల్లో ఎవరు కెప్టెన్ అవ్వాలని అనుకుంటున్నారు, ఎవరు రేసు నుంచి తప్పించాలని అనుకుంటున్నారో కారణాలు చెప్పాలి. గౌతమ్ వచ్చి శోభా, అర్జున్‌లలో శోభా కెప్టెన్ అవ్వడం తనకు ఇష్టం లేదని అన్నాడు. ఇక ఇప్పటివరకు రతిక, అశ్విని, అమర్‌దీప్‌లు కెప్టెన్ అవ్వలేదు. చివరి కెప్టెన్సీ టాస్క్‌లో కూడా కంటెస్టెంట్స్ మద్దతు ఎక్కువ ముఖ్యం కాబట్టి అమర్‌దీప్‌కే అందరూ ఎక్కువగా మద్దతునిచ్చే అవకాశాలు ఉన్నాయి.


Also Read: సీక్రెట్ టాస్కులో కూడా ఫ్రెండ్‌షిప్ - శోభాకు సాయం చేసి దొరికిపోయిన ప్రియాంక


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply