Trinayani Serial Today Episode నయని కష్టపడి సంపాదించిన పంచకమణిని గజగండ తీసుకుంటాడు. గంటలమ్మ తన భార్య అని రక్తపుంజి తన కొడుకు అని తన కొడుకుని చంపిన మిమల్ని నరక యాతన అనుభవించేలా చేస్తానని అంటాడు. పంచకమణిని తీసుకొని గజగండ వెళ్లిపోతాడు. తన భర్తకు నయం అవ్వాలి అంటే పంచకమణి ఉండాలని నయని ఏడుస్తుంది. మాంత్రికుడి మోసం గ్రహించలేక మోసపోయానని కుమిలిపోతుంది.
ఉదయం విశాల్ నయని కోసం ఎదురు చూస్తుంటాడు. తిలోత్తమ, వల్లభ, సుమన వచ్చి చక్కగా రెడీ అయి పూజ చేసి బొట్టు కూడా పెట్టి నయని రాక కోసం ఎదురు చూస్తున్నాడని అంటారు. ఇక హాసిని కూడా పూజ చేసి అందరికీ హారతి ఇస్తుంది. గాయత్రీ పాప విశాల్ నుదిటిన బొట్టు పెట్టిందని అంటాడు విక్రాంత్. నయని పంచకమణితో వస్తుందని అందరూ సంతోషంగా నయని రాకకోసం ఎదురు చూస్తుంటారు. నయని మాత్రం దిగులుగా ఇంటి ముఖం పడుతుంది. గురువుగారు కూడా ఇంటికి వస్తారు.
వల్లభ: అమ్మవారి దయ లేకపోతే మణికాంతపురం వెళ్లిన మీరు క్షేమంగా తిరిగి రారు కదా గురువుగారు.
గురువుగారు: నయని వెళ్లింది కదా ఇంకా తిరిగి రాలేదా వల్లభ.
వల్లభ: ఇదేంటి మమ్మీ నన్ను అడుగుతారు.
తిలోత్తమ: గురువుగారు పంచకమణి మీ దగ్గర ఉందా నయని దగ్గర ఉందా.
గురువుగారు: నా దగ్గరెందుకు ఉంటుంది తిలోత్తమ.
విశాల్: నయనిని వదిలేసి మీరు ముందే ఎందుకు వచ్చారు స్వామి.
గురువుగారు: విశాలా మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు.
విక్రాంత్: నయని వదినకు తోడుగా మీరు వెళ్లారు కదా గురువుగారు తనని అక్కడే వదిలేసి వచ్చారేంటి అని అడుగుతున్నారు.
సుమన: కొంప తీసి మా అక్క అక్కడే గల్లంతా.
దురంధర: నోర్ముయ్‌వే సుమ్మి.
గురువుగారు: నేను నయనితో వెళ్లానని మీరు ఎలా అనుకుంటున్నారు.
హాసిని: అదేంటి గురువుగారు నిన్న రాత్రి మీరు నయనితో కలిసి వెళ్లారు కదా.
గురువుగారు: విశాలాక్షి అమ్మ తల్లి అసలు నేను మీ ఇంటికి రాలేదు కదా హాసిని. (అందరూ బిత్తరపోతారు)
విశాల్: అదేంటి స్వామి మీరే కదా వచ్చింది లేకపోతే మీ రూపంలో ఎవరైనా వచ్చుంటారా.
తిలోత్తమ: మనసులో అయితే గజగండ మాయ చేసుంటాడన్న మాట.
గురువుగారు: దివ్య దృష్టితో గజగండ మోసం గుర్తిస్తారు. మోసం జరిగింది విశాలా నయని దృష్టి మరల్చి మాయ చేశాడు.
సుమన: సరిపోయింది పోండి భవిష్యత్ ముందే తెలిసే మా అక్కకి పక్కన ఎవరు ఉన్నారో తెలీకుండా వెళ్లిందో లేక మన కళ్లు కప్పి వెళ్లిందో ఎవరికి తెలుసు.
అందరూ సుమన మీద కోప్పడేలోపు దురుంధర వెళ్లి లాగి పెట్టి ఒక్కటిస్తుంది. నయని నిప్పని తనని మోసం చేసిన వాడు నాశనం అయిపోతాడని అంటుంది. నయని క్షేమంగా తిరిగి వస్తుందా అని గురువుగారిని తిలోత్తమ అంటుంది. ఇంతలో నయని వస్తుంది. అందరూ సంతోషిస్తారు. అందరూ పంచకమణి చూపించమంటారు. నయని మాత్రం డల్‌గా ఉంటుంది. పంచకమణి లేదని నయని చెప్తుంది. అందరూ షాక్ అయిపోతారు. అమ్మవారి దగ్గరకు వెళ్లి నీటి దీపం వెలిగించి పంచకమణి కూడా తీసుకున్నానని కానీ గజగండ మాయ చేసి పంచకమణి తీసుకొని వెళ్లిపోయాడని చెప్తుంది. గురువుగారి రూపంలో ఇంటికి వచ్చింది కూడా గజగండే అని నయని చెప్తుంది. మోసపోయానని బాబుగారి ఆరోగ్యం నయనం చేయలేకపోయానని నయని అంటుంది. విశాల్ కుప్పకూలిపోతాడు. సుమన మాత్రం చేయి పోయింది ఈ షాక్‌తో కాలు కూడా పోయాయని అంటుంది. అందరూ గట్టిగా సుమనను తిడతారు.
విశాల్: నువ్వు కచ్చితంగా పంచకమణి తీసుకొచ్చి ఈ చేతిని నయనం చేస్తావ్ అనుకున్నాను. అయి పోయింది నయని ఇక నా జీవితానికి అర్థం లేనట్లే. నా భవిష్యత్ నాశనం అయిపోయినట్లే.
నయని: అలా మాట్లాడకండి బాబుగారు.
గాయత్రీ పాప విశాల్ ఏడుస్తుంటే కళ్లు తుడుస్తుంది. గురువుగారు విశాల్‌కి ధైర్యం చెప్తారు. గజగండ గంటలమ్మ భర్త అని మీకు తెలుసని నయని తిలోత్తమతో అంటుంది. తిలోత్తమ మాత్రం తనకు తెలీదనేస్తుంది. ఇక పంచకమణి రాదా అని సుమన అడుగుతుంది. గజగండకు పంచకమణి గురించి ఎలా తెలుసని అడుగుతారు. దానికి గురువుగారు గాయత్రీదేవి వల్లే తెలుసని గజగండ యుక్త వయసులో జాతకాలు చెప్తూ బతికేవాడని అతని భార్య గంటలమ్మ గాయత్రీ దేవి దగ్గర దాసిగా పని చేసేదని చెప్తారు. మానసాదేవి ఆలయంలో నిధులు కాపాడే బాధ్యత వారసత్వంగా గాయత్రీ దేవికి దక్కిందని చెప్తారు. గాయత్రీదేవి గరుడాంక త్రేయరాజుల వంశానికి చెందిన వారని గురువుగారు చెప్తారు. అందరూ ఆశ్చర్యపోతారు.
గజగండ నిధి గురించి తెలుసుకొని మాయలు మంత్రాలు నేర్చుకోవడం తెలుసుకున్న గాయత్రీ దేవి మానసాదేవి ఆలయానికి సంబంధించిన అన్నీ పత్రాలు అన్నీ పెట్టెలో పెట్టి నయని తీసేశా చేశారని అంటాడు. పంచకమణి దక్కించుకున్న గజగండ ఇంకా శక్తివంతం అయిపోతాడని విశాల్, గాయత్రీ పాప జాగ్రత్తగా ఉండాలని గురువుగారు చెప్తారు దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.