Trinayani Serial Today Episode గాయత్రీ దేవి ఉందా లేదా అని నయనిని హాసిని అడుగుతుంది. నయని ఉందని చెప్తే హాసిని గాయత్రీ అత్తయ్య గారు నాది ఓ ధర్మ సందేహం అడగమంటారా అని అంటుంది. దానికి గాయత్రీ దేవి అడగమని అంటుంది. నయని ఆత్మ అడగమన్నట్లు హాసినిని అడగమని అంటుంది.


హాసిని: నయని చెల్లి కన్న తొలిబిడ్డ మణికాంత గిరికి దారి చెప్తుంది అన్నారు. మరి మీరు చెప్పారేంటి.
వల్లభ: కరెక్టే కదా మమ్మీ.
గాయత్రీదేవి: నేను నయని కడుపున పుట్టాను.
తిలోత్తమ: ఈ జన్మలో ఇప్పుడు పసిబిడ్డగా ఉంటావు కదా అక్క ఆత్మలా అయితే ఇలా కనిపిస్తావు మరి బిడ్డలా అయితే ఎలా కనిపిస్తావో తెలీదు.
విక్రాంత్: పెద్దమ్మ పసిబిడ్డగా వస్తే వదిన కూడా తన తొలిబిడ్డను తెలుసుకుంటుందని అనుకున్నాం.
సుమన: ఎక్కడో ఏదో తేడా కొడుతుంది. దారి పాప కదా చెప్పాల్సింది.
విక్రాంత్: తనకు మాటలు రావు కదా ఎలా చెప్తుంది.
తిలోత్తమ: నువ్వేంటి అక్క మాట్లాడవు.
గాయత్రీదేవి: నేను చెప్పింది దారి అందులో వెళ్లాల్సిన వారు వెళ్తారు. వెళ్లకూడని వాళ్లు ఎలా వెళ్లాలో పసి పాప రూపంలో నేనే దారి చూపిస్తాను.
తిలోత్తమ: అక్క వెళ్లిపోతుంది నయని తనేం చెప్పిందో నాకు అర్థం కావడం లేదు. 


గాయత్రీదేవి చెప్పిన అడ్రస్‌ను సుమన గూగుల్ మ్యాప్‌ పెట్టుకొని క్యాలిక్యూలేట్ చేసుకొని పేపర్ మీద రాసుకుంటుంది. విక్రాంత్ ఏం చేస్తున్నావ్ అంటే మణికాంత గిరి వెళ్లడానికి దారి గీస్తున్నానని చెప్తుంది. ఆ అడ్రస్ గీసి నయని వదినకు ఇవ్వు అని విక్రాంత్ అంటే నేను వెళ్తా కానీ తనకు ఎందుకు ఇస్తాను అని సుమన అంటుంది. మరోవైపు నయని ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటే అక్కడికి గాయత్రీదేవి వస్తుంది.


నయని: విశాలాక్షి అమ్మవారిలా మీరు కూడా నన్ను పరీక్షించకండి అమ్మగారు. బాబుగారి ఆరోగ్యం రోజు రోజుకు క్షీణించిపోతుంది. పౌర్ణమి వచ్చే వరకు మణికాంత గిరి వెళ్లలేను. మీరు చెప్పినట్లు ఆ దారి వెంట అడుగులు వేసినా ఈ లోపు ఆ దుర్మార్గుడు గజగండ బాబుగారిని ఏం చేస్తాడో అమ్మగారు.
గాయత్రీదేవి: తీసుకెళ్లు నయని.
నయని: బాబుగారినా అమ్మగారు.
గాయత్రీదేవి: అవును మానసాదేవి అమ్మవారి సన్నిధికి నా కొడుకు రావాలి. 
నయని: నేను వెళ్లడమే సాహసం అనుకుంటే బాబుగారి ప్రాణాలను కూడా పణంగా పెట్టాలా అమ్మగారు.
గాయత్రీదేవి: నయని ఈ సారి మణికాంత ప్రాంతానికి నువ్వు ఒక్కదానివే వెళ్లాలి అన్నా వెళ్ల లేవు వెంట నీ పసుపు కుంకుమలతో పాటు నీ బిడ్డ కూడా వస్తుంది.
నయని: గానవీనా.
గాయత్రీదేవి: గాయత్రీ నీ బిడ్డ కాదా.
నయని: నేను ఒక్కదాన్నే వెళ్తే నా బిడ్డలని బాబు గారు క్షేమంగా చూసుకుంటారు అనుకున్నా అమ్మగారు ఇప్పుడు దత్తత తీసుకున్న ఆ బిడ్డకి బంగారు భవిష్యత్‌ ఇస్తానని అంటే ఇప్పుడు తనని తీసుకెళ్లి ప్రాణాల మీదకు తీసుకురావాలా అమ్మగారు. 
గాయత్రీదేవి: నయని నువ్వు కావాలి అనుకుంటే రాదు. వద్దు అనుకుంటే పోదు. అంతా విధి ప్రకారమే జరుగుతుంది. గాయత్రీని, విశాల్‌ని నువ్వు మానసాదేవి ఆలయానికి తీసుకెళ్లాల్సిన అగత్యం ఏర్పడుతుంది. విశాలాక్షి అమ్మవారి మీద భారం వేసి ముందు అడుగువేయి. వాళ్లని తీసుకెళ్లకపోతే నువ్వు భుజంగమణి దక్కించుకున్నా వాళ్లని ఆ గజగండ తీసుకెళ్లి భుజంగమణి ఇస్తే తప్పు వాళ్లని వదలను అని చెప్పే అవకాశం ఉంది.
నయని: అవును అమ్మగారు. నేను నా వాళ్ల అందరినీ తీసుకెళ్లడం మంచిదేమో.
గాయత్రీదేవి: పౌర్ణమి అవసరాలే నిన్ను నడిపిస్తాయి. గాయత్రీ పాప నిద్ర లేస్తున్నట్లు ఉంది వెళ్లి చూడు. 


నయని విశాల్ దగ్గరకు వెళ్లి గాయత్రీ పాపని తీసుకెళ్తానని చెప్తుంది. దాంతో విశాల్‌ నేను కూడా వస్తాను అని అంటాడు. ఇంట్లో అందరికి నయని పాపని, విశాల్‌ని తీసుకెళ్తానని చెప్తుంది.  అదే బెస్ట్ అని ఇక ఎవరి గొడవ ఉండదని విక్రాంత్ అంటాడు. దానికి సుమన మేం దాన్ని చూడొద్ద అని అంటాడు. ఇక హాసినికి ఓ మాట చెప్పి వెళ్దామని విశాల్ అంటాడు. ఇంతలో హాసిని హారతి తీసుకొచ్చి వాళ్లకి ఇస్తుంది. మేం వస్తామో రామో తెలీదు వదిన ఒకవేళ మేం తిరిగి రాకపోతే గానవిని గాయత్రీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌ని జాగ్రత్తగా చూసుకోమని విశాల్ హాసిని, విక్రాంత్ లకు చెప్తాడు. సుమన, వల్లభలు అప్పుడే ఆస్తులు వాటాల గురించి మాట్లాడుకుంటారు. ఎవరు ఏమనుకున్నా నయని మాత్రం తిరిగి వచ్చేస్తుందని తిలోత్తమ అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: 'త్రినయని' సీరియల్: గజగండని తప్పుదోవ పట్టించిన గాయత్రీదేవి.. విశాల్‌ని చూస్తూ ఎమోషనల్!