Brahmamudi Serial Today Episode: రాత్రి అయినా కావ్య పని చేస్తూనే ఉంటుంది. మూర్తి వస్తారు ఇంకా పని చేస్తూనే ఉన్నావా అని అడగ్గానే అవనని ఇది స్పెషల్ వినాయకుడు అని చెప్తుంది. తొండం గురించి ఉన్న అర్థం చెప్తుంది కావ్య. ఈ వినాకుడికి రంగులు వేయడానికే నువ్వు దుగ్గిరాల ఇంట్లో అడుగుపెట్టావు అంటాడు మూర్తి. దీంతో తాను రాజ్ వినాకుడికి పూజ చేసింది గుర్తు చేసుకుంటుంది కావ్య. మరోవైపు అందరూ హాల్లో కూర్చుని ఉంటారు.
రాజ్: కొపందీసి కళావతిని తీసుకురమ్మని ఆర్డర్ వేస్తారా ఏంటి? ( అని మనసులో అనుకుని) తాతయ్యా ఎందుకు అందరినీ రమ్మన్నారు.
సీతారామయ్య: ఉదయం నుంచి చూస్తున్నాను. రేపే వినాయక చవితి అన్న విషయం ఈ ఇంట్లో ఎవ్వరికీ గుర్తు లేదా? ఎవ్వరూ ఏర్పాట్లు చేస్తున్నట్లు లేదు. ఏం జరుగుతుంది.
రుద్రాణి: ఏం జరగడం లేదు నాన్నా… ఆ మహా తల్లి వెళ్లిపోయిందని అందరూ దిగులుతో ఉన్నారు. ఏడాదికి ఓసారి వచ్చే పండుగ జరుపుకోవాల్సిందే కదా..?
సుభాష్: రుద్రాణి మనసులో ఏం పెట్టుకుని మాట్లాడుతుందో తెలియదు కానీ ఇంట్లో అపర్ణ ఆరోగ్యం బాగా లేదు. కోడలు ఇంటి నుంచి వెళ్లిపోయింది.
సీతారామయ్య: అంటే ఏంటి నీ ఉద్దేశం. ఐశ్వర్యం ఇచ్చిన్నప్పుడు దేవుడు కావాలి. కానీ ఇప్పుడు వద్దనా..? సంతోషంగా ఉన్నప్పుడే కాదు. కష్టాలు వచ్చిన్నప్పనుడే దేవుడి ఆశీస్సులు కావాలి. ఏమైనా మన ఇంటి ఇలవేల్పు అయిన వినాయక చవితి జరుపుకోవాల్సిందే..
ఇందిరాదేవి: మీ నాన్న గారు చెప్పింది విన్నారుగా.. పొరపాట్లు చేసేవారు. మనుషులు చెప్తే వినని వారిని ఆ దేవుడైనా మారుస్తాడు.
అని ఇందిరాదేవి చెప్తూ ఈసారి పూజలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు రాజ్ చూసుకోవాలి అని చెప్తుంది. ఇంతలో స్వప్న వినాయకుని విగ్రహాన్ని మా కావ్య చాలా బాగా చేస్తుంది అని చెప్పగానే రాజ్ ఇరిటేటింగ్ గా ఫీలవుతాడు. అందరూ వెళ్లిపోతారు. రాజ్ వెళ్లిపోతుంటే
అపర్ణ: రాజ్ ఈ పూజ నీ చేతుల మీదుగా జరిపిస్తే ఎక్కడ నీ భార్య తనంతట తాను నడిచివస్తుందని భయపడుతున్నావా? అంతగా భయపడకు నా కొడలికి సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఎక్కువ. నువ్వు పూజ చేయ్ దేవుడు మిగిలింది చూసుకుంటాడు.
అని చెప్పి అపర్ణ వెళ్లిపోతుంది. మరోవైపు అప్పు కిచెన్ లో వంట చేస్తుంటే కళ్యాణ్ వచ్చి పొట్టి నేను బయటకు వెళ్తున్నాను. ఇవాళ వినాయక చవితి కదా? ఒక విగ్రహం తీసుకొస్తాను అనగానే అవసరం లేదని నేనే విగ్రహం రెడీ చేస్తాను అని బయటకు తీసుకెళ్లి తాను సిద్దంగా ఉంచుకున్న మట్టిని చూపిస్తుంది అప్పు. దీంత ఓహో మొత్తం సిద్దం చేసుకున్నావన్నమాట చేయ్ నేను చూస్తాను అంటాడు కళ్యాణ్. అప్పుకు విగ్రహం చేయడం రాదు. బంటి వచ్చి నాన్నా విగ్రహం పంపిచారని తీసుకొస్తాడు. మరోవైపు కావ్య తాను రెడీ చేసిన విగ్రహం తీసుకుని అర్డర్ ఇచ్చిన వాళ్లకు ఇస్తుంది. ఆ విగ్రహం చూసిన వ్యక్తి చాలా బాగుందని చెప్తాడు. అతనితో డబ్బులు తీసుకుని వెళ్లిపోతున్న కావ్యకు రాజ్ ఎదురుగా వచ్చి డాష్ ఇస్తాడు. కావ్య కిందపడిపోయి లేచి కోపంగా తిట్టబోతూ.. రాజ్ ను చూసి అలాగే నిలబడుతుంది. పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటుంది.
రాజ్: సెంటర్ లో శిలా విగ్రహంలా ఆ చెయ్యి ఎంటి దించు.
కావ్య: చూసుకుని కారు నడపాలని తెలియదా?
రాజ్: చూసుకుని సైకిల్ నడపాలని నీకు తెలియదా?
కావ్య: నాకు తెలుసు మీరు చూసుకునే గుద్దారు. కావాలనే గుద్దారు. ఇది మర్డర్ అటెంప్ట్. మీరు నా మీద హత్యా ప్రయత్నం చేశారు.
రాజ్: అరువు బాగా అరువు.. అరిచి జనాలను పోగు చేసి నేను డబ్బులు ఇచ్చేదాకా అరుస్తూనే ఉండు.
అనగానే ఇదిగో ఇలా మాట్లాడినందుకే ఆరోజు అలా జరిగింది. అంటూ రాజ్‌ను రుద్రాణిని, రాహుల్ ను తిడుతుంది. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. ఒకర్ని ఒకరు బండ బూతులు తిట్టుకుంటారు. ఇంతలో రాజ్ మా దరిద్రం పోయింది. మళ్లీ మా ఇంటి వైపు కన్నెత్తి చూడకు. మా గడపలో కాలు పెట్టకు అనడంతో కావ్య షాక్ అవుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: పొరపాటున కూడా ఇప్పుడు ఉప్పు, బట్టలు లాంటి వస్తువులు కొనద్దట!