Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode లక్కీ మిత్రకు తన తల్లి గురించి అడుగుతుంది. మిత్ర లక్కీతో మీ అమ్మ ఎవరో తెలిస్తే నన్ను వదిలేసి వెళ్లిపోతావా లక్కీ అని అడుగుతాడు. దానికి లక్కీ తండ్రిని గట్టిగా పట్టేసి లేదు నాన్న అని బదులిస్తుంది. మిమల్ని ఎప్పటికీ వదిలిపెట్టనని అమ్మ గురించి తెలుసుకోవాలి అనిపించిందని అంటుంది. 


లక్కీ: జున్ను నాన్నని వెతికి వెతికి కనిపెట్టాడు అలాగే నేను కూడా అమ్మని కనిపెడదామని అనుకున్నా నాన్న అంతే.
మిత్ర: అమ్మ కనిపిస్తే నీకు అమ్మ దగ్గరకు వెళ్లాలి అనిపిస్తే.
లక్కీ: వెళ్లను నాన్న.. మా అమ్మ ఆ గుడిలో దేవత అయినా సరే నేను నీ దగ్గరే ఉంటాను. అందరి కంటే ఆదేవుడి కంటే నాకు నువ్వే ఎక్కువ నాన్న.
అరవింద: లక్ష్మీ నిన్ను ఒకటి అడగాలి. జున్ను డెలివరీ ఎక్కడ జరిగింది.
దేవయాని:  దేవుడా ఈ అత్తాకోడళ్లు ఈ రోజు నన్ను చంపుకుని తినే వరకు వదిలేలా లేరే. 
లక్ష్మీ: మున్నార్‌లో అత్తయ్య గారు. (నేనే కావాలని మీకు కనిపించలేదు) మీరు లక్కీని మున్నార్ నుంచి తీసుకొచ్చారా అత్తయ్య గారు.
దేవయాని: దేవుడా టెన్షన్తో చనిపోయేలా ఉన్నానే. లక్ష్మీ లక్కీ  పాలు తాగలేదు నువ్వు త్వరగా వెళ్లు. లక్ష్మీ లక్కీ కోసం పాలు తీసుకొని వెళ్తుంది. ఒక రహస్యాన్ని కాపాడే అంత కష్టమైన పని ఈలోకంలో మరొకటి ఉండదు.
లక్కీ: మా అమ్మ గురించి అడిగాను చెప్పు నాన్న. 
మిత్ర: నిజం చెప్పాలి అంటే నాకు సరిగా తెలీదు లక్కీ. ఆ రోజు మీ అమ్మకి నొప్పులు వస్తుంటే మీ నాన్నమ్మ హాస్పిటల్‌లో జాయిన్ చేసింది. నేను మీ అమ్మ ఫేస్ సరిగా చూడలేదు. ఎందుకో గానీ ఆమె నిన్ను వదిలేసి వెళ్లిపోయింది. 
లక్కీ: నువ్వు కోల్పోయింది ఎవరిని నాన్న. 
లక్ష్మీ: లక్కీ..
లక్కీ: నాన్న అమ్మ వచ్చింది నాకోసం పాలు తీసుకొచ్చింది. అమ్మ అని లక్కీ లక్ష్మీకి ముద్దు పెడుతుంది. లక్ష్మీ కూడా ముద్దు పెట్టి గుడ్ నైట్ చెప్పి వెళ్లిపోతుంది. 


మరోవైపు భాస్కర్ లక్ష్మీకి నిజం చెప్పడానికి తప్పించుకోవాలని ప్రయత్నిస్తాడు. రౌడీలు మాత్రం భాస్కర్ పక్కనే ఉంటారు. ఇక కరెక్ట్‌గా 12 అయితే మిత్ర లక్కీకి, లక్ష్మీ జున్నుకి భర్త్‌డే విషెస్ చెప్తారు. ఇక బయట వర్షం పడుతుంది. మీరు పుట్టనప్పుడు కూడా ఇలాగే వర్షం పడిందని ఇద్దరూ ఇద్దరు పిల్లలకు చెప్తారు. దాంతో ఇద్దరూ పిల్లలు వర్షం చూస్తామని అంటారు. దాంతో మిత్ర, లక్కీని జున్నుని లక్ష్మీ తీసుకొని కిటికీల దగ్గరకు వెళ్లి వర్షం చూపిస్తారు. జున్ను, లక్కీలు మాట్లాడుకుంటారు. నేను ఇలాంటి వర్షం లోనే పుట్టానని జున్ను అంటే లక్కీ కూడా నేను వర్షంలోనే పుట్టానని చెప్తుంది. దాంతో లక్ష్మీ ఆలోచనలో పడుతుంది. నువ్వు ఎక్కడ పుట్టావ్ మీ అమ్మానాన్న ఎవరు అని లక్ష్మీ అడుగుతుంది. లక్కీ నాన్నకి తెలుసుని అంటుంది. మిత్ర అవన్నీ నీకు అవసరం లేదని వెళ్లిపోతాడు. 


ఉదయం మిత్ర ఇంటికి భాస్కర్ గాయాలతో వస్తాడు. ఏమైందని మిత్ర అడిగితే మనీషా కిడ్నాప్ చేసిందని చెప్తాడు. మనీషా, దేవయాని షాక్ అయిపోతారు. ఎందుని మిత్ర అడిగితే నేను మీకు నిజం చెప్పకుండా ఉండటానికి అంటాడు. ఏంటి ఆ నిజం అని అడిగితే ఇంతలో లక్ష్మీ వస్తుంది.


లక్ష్మీ: అన్నయ్య ఏమైంది అన్నయ్య.
భాస్కర్: అమ్మా లక్ష్మీ నీకో నిజం చెప్పాలని వచ్చానమ్మా. నీకు జున్ను ఒక్కడే కొడుకు కాదమ్మా లక్కీ కూడా నీ కూతురే వాళ్లిద్దరూ కవల పిల్లలు. మున్నార్‌లో నా ఇంట్లో ఉన్నది మీ భార్య లక్ష్మీ అని నాకు తెలీదు సార్. మా ఇంట్లోనే ఈ లక్ష్మీ మేడంకి మీరు సీమంతం చేశారు సార్. ఈ లక్ష్మీ మేడంనే మీరు హాస్పిటల్‌లో చేర్చారు. నేను ఇక్కడికి వచ్చాకే లక్ష్మీ మేడం మీ భార్య అని తెలిసింది. మీ ఇద్దరు పిల్లల గురించి చెప్తా అంటే ఈ మనీషా నన్ను ఆపి చంపేస్తా అని బెదిరించింది. 

మనీషా: నమ్మొద్దు మిత్ర నీకు లక్కీ అంటే ఇష్టమని లక్కీ లక్ష్మీ కూతురు అని చెప్తే లక్ష్మీ తప్పులను క్షమిస్తావని ఇలా చెప్తున్నాడు. 
మిత్ర: నోర్ముయ్ మనీషా. భాస్కర్ నాకు నమ్మిన బంటు ప్రాణం పోయినా అబద్ధం చెప్పడు. లక్కీ నా కన్న కూతురని తెలిసి కూడా నువ్వు లక్ష్మీకి ద్రోహం చేయాలని చూశావ్. నా కన్న కొడుకుని దూరం చేయాలని చూశావ్. మా భార్య భర్తలను దూరం చేశావ్ అని మనీషాని కొడతాడు.


నో అంటూ మనీషా నిద్ర లేస్తుంది. ఇదంతా తన కల అని తేరుకుంటుంది. దేవయాని రావడంతో విషయం చెప్తుంది. ఇక మనీషా రౌడీలకు కాల్ చేసి భాస్కర్ జాగ్రత్తగా ఉన్నాడా అంటే ఉన్నాడని చెప్తారు. తీరా రౌడీలు చూస్తే భాస్కర్ తప్పించుకుంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: బిగ్​బాస్​లో సండే ఫన్​డే ఛాలెంజ్ కష్టాలు.. మిక్సీ ఓకే కానీ ఆ తలుపు సౌండేంటి ప్రేరణ