Bigg Boss 8 Telugu Day 21 Sunday Promo : బిగ్‌బాస్ సండే ఫన్డే మొదలైంది. నాగార్జున వస్తూనే.. కంటెస్టెంట్లకు ఈరోజు సండే ఫన్డే నిన్నటిలా అసలు ఉండదంటూ స్టార్ట్ చేశారు. ఎందుకంటే శనివారం జరిగిన ఎపిసోడ్లో నాగార్జున ఓ రేంజ్లో కంటెస్టెంట్లను రఫ్ఫాడించారు. ఈ వారం జరిగిన అన్ని విషయాలను ప్రస్తావిస్తూ సీరియస్ అయ్యారు. ముఖ్యంగా అభయ్ నవీన్‌ని ఇంట్లోనుంచి వెళ్లిపోమని రెడ్ కార్డ్ ఇచ్చారు. అలాగే పృథ్వీకి కూడా రెడ్ కార్డ్ చూపించి.. మరోసారి ఇలా చేస్తే నీకు ఈ కార్డ్ తప్పదంటూ హెచ్చరించారు.
ఆ వేడిని చల్లార్చుతూ.. కంటెస్టెంట్లను ఆ హీట్ నుంచి బయటకు తప్పించేందుకు నాగార్జున ట్రై చేశారు. ఈ నేపథ్యంలోనే సండే ఫన్డే ప్రోమోను బిగ్‌బాస్ టీమ్ రిలీజ్ చేసింది. ఇంతకీ ప్రోమో ఎలా సాగిందంటే.. కొట్టరా కొట్టు తీన్మారు అనే సాంగ్‌తో నాగార్జున ఎనర్జీటిక్గా డ్యాన్స్ వేస్తూ వచ్చారు. టు డే సండే.. ఫన్డే అఫ్ కోర్స్.. నిన్నటిలా ఉండందంటూ అనే డైలాగ్‌తో ప్రోమో ప్రారంభమైంది. నాగార్జున చెప్పిన డైలాగ్‌కు కంటెస్టెంట్లు కూడా నవ్వుతూ రిలాక్స్ అయిపోయారు.
నన్ను ఇన్వాల్వ్ చేయకండి సార్..
పృథ్వీ మంచి హుషారులో ఉన్నాడంటూ నాగార్జున అడగ్గా.. విష్ణుప్రియ సార్ ఇతను ఎనర్జిటిక్‌గానే ఉన్నాడు. కానీ ఇతను వేసుకున్న షర్ట్ మాత్రం ఇతనిది కాదంటూ ఫన్ చేసింది. ఎవరిది అని నాగ్ అడగ్గా.. నైఖిల్ అంటూ ఫన్నీగా రిప్లై ఇచ్చింది. నైఖిలా అంటూ నాగ్ కూడా ఫన్నీగా రియాక్ట్ అయ్యారు. అనంతరం ఇప్పుడు ఓ ఫన్నీ టాస్క్ ఇస్తున్నానంటూ.. సెట్ ఆర్ కట్ ఛాలెంజ్ ఇచ్చారు. ఇది ఎంత ఫన్ అవుతుందో తెలీదు కానీ.. కచ్చితంగా నామినేషన్స్‌కి బెస్ట్ రీజన్స్‌గా మాత్రం అవుతాయి.
ఫిటింగ్ పెట్టేశాడుగా..
సెట్ అయ్యేవాళ్లకి హార్ట్.. సెట్ కానీ వాళ్లకి హార్ట్ బ్రేక్ చేసి ఇవ్వాలంటూ చెప్పాడు. అయితే సన్డే ఫన్ డే కోసం చేసిన టాస్క్ల్లోని రీజన్స్‌ని చాలామంది నామినేషన్స్‌కి తీసుకుంటారు. అయితే ఈ టాస్క్ కూడా నామినేషన్స్‌కి రీజన్స్ ఇచ్చేలానే ఉంది. ఇంతకీ ఎవరు ఎవరికి హార్ట్ ఇచ్చారు? ఎవరి హార్ట్ బ్రేక్ చేశారంటే.. ముందు నిఖిల్‌ని టాస్క్ ఆడాలని నాగ్ సూచించగా.. నిఖిల్ ఎవరికివ్వాలా అని ఆలోచిస్తుంటే.. నాగ్.. విష్ణుని పిలిచి విష్ణు నువ్వు ఎవరిని అనుకుంటున్నావ్ అనగా.. సార్ నన్ను ఇన్వాల్వ్ చేయొద్దంటూ కామెడీ చేసింది.
సోనియా హార్ట్ బ్రేక్ చేసిన పెద్దోడు
పృథ్వీకి నిఖిల్ హార్ట్ ఇచ్చి సోనియాకు హార్ట్‌ని బ్రేక్ చేశాడు. అయితే రీజన్స్ చెప్పమంటూ నాగ్ అడగ్గా.. నేను గుడ్ చెప్పినా.. బ్యాడ్ చెప్పినా వింటాడు అని పృథ్వీ గురించి చెప్పి.. అప్పుడప్పుడు కొన్ని మాటాలతో హర్ట్ చేస్తుందని సోనియా హార్ట్ బ్రేక్ చేసినట్లు తెలిపాడు. తర్వాత మణికంఠ వచ్చి సోనియాకు హార్ట్ ఇచ్చాడు. నిఖిల్‌కు హార్ట్ బ్రేక్ ఇచ్చాడు. టాస్క్‌లో కాస్త ఫిజికల్ అవుతున్నాడంటూ రీజన్ చెప్పగా.. తన టీమ్‌ని గెలిపించుకోవాలిగా అంటూ నిఖిల్‌కు నాగ్ సపోర్ట్ చేశారు.
యశ్మీకి హార్ట్ ఇచ్చేసిన చిన్నోడు
నబీల్ నైనికకు హార్ట్ బ్రేక్ ఇచ్చాడు. ఈ మధ్య తక్కువ మాట్లాడుతుంది అంటూ చెప్పగా నైనిక సీరియస్‌గా చూసింది. నువ్వు అలా చూడకంటూ నబీల్ చెప్పగా.. సరే నువ్వు హార్ట్ బ్రేక్ చేయి.. మొత్తానికి మాట్లాడనంటూ క్యూట్‌గా చెప్పేసింది నైనిక. విష్ణుప్రియ సీతకు హార్ట్ ఇచ్చి.. పృథ్వీకి హార్ట్ బ్రేక్ చేసి ఇచ్చింది. నైనిక కూడా సీతకు హార్ట్ ఇచ్చింది. ప్రేరణ అభయ్‌కి హార్ట్ ఇచ్చింది. యశ్మీకి హార్ట్ బ్రేక్ చేసి ఇచ్చింది. పృథ్వీ కూడా విష్ణు హార్ట్ బ్రేక్ చేసి.. యశ్మీకి హార్ట్ ఇవ్వగా.. విష్ణు బ్రేక్ అయిన హార్ట్‌తో ఫన్నీగా క్లాప్స్ కొట్టడంతో ప్రోమో ముగిసింది.
Also Read : హగ్గులు కాదు ఆటలు ఆడు... మణికంఠకు విష్ణు స్వీట్ వార్నింగ్, ప్రేరణ దోశ పంచాయితీ తేల్చిన నాగ్