Trinayani Serial Today Episode గాయత్రీ పాప వల్లే మాంత్రికుడు పారిపోయాడని హాసిని పాపని ఎత్తుకొని ముద్దాడుతుంది. ఇక గజగండ ఎప్పుడు ఎవరిలా వస్తాడో తెలీదని అందరూ జాగ్రత్తగా ఉండాలని తిలోత్తమ ఇంట్లో వాళ్లకి చెప్తుంది. ఇక తిలోత్తమ, వల్లభ ఇద్దరూ గజగండ దగ్గరకు వెళ్తారు. 


గజగండ: ఆ గాయత్రీ పాప విశాల్‌ని తీసుకొని రాకపోయి ఉంటే వాళ్ల వ్యాపారం నాశనం చేసుండేదాన్ని.
వల్లభ: నేను చెప్పానా గురువుగారు అది పాప కాదు పెద్ద పీప అని పడుకున్న వాళ్ల నాన్నని నిద్ర లేపి మరి చేయి పట్టుకొని తీసుకొచ్చిందంటే ఎంత తెలివి ఉండాలి.
తిలోత్తమ: పిల్ల గుర్తు పట్టింది అంటే ఇక  నువ్వు ఎన్ని వేషాలు వేసిన లాభం ఏంటి.
గజగండ: ఆలోచించాల్సిన విషయమే తిలోత్తమ నేను వేషం వేసినా ఆ పిల్ల గుర్తు పట్టింది అంటే ఆ పేరు ఎఫెక్టే.
వల్లభ: గాయత్రీ పెద్దమ్మ వల్లే అంటారు అంతే కదా.  అసలు మా పెద్దమ్మ మణికాంత పేపర్లు ఎలా దాచిపెట్టిందో మీకు ఎలా తెలుసు గురూజీ.
గజగండ: మీ అమ్మకి అంతా తెలుసు.
వల్లభ: మా అమ్మకి నేను అంటే ఎంత ఇష్టమో అంత చిరాకు కూడా.


ఫ్లాష్ బ్యాక్..


గాయత్రీ దేవి మణికాంత ప్రాంతం పేపర్లు చూస్తున్న గాయత్రీదేవిని గజగండ దాని గురించి అడుగుతాడు. పేపర్లు గజగండ తెరచి చూశాడని గాయత్రీ దేవి చిన్నగా క్లాస్ ఇస్తుంది. ఇక అమ్మవారి నిధి కాపాడటం మా అనవాయితీ అని చెప్తుంది. 


ప్రస్తుతం..


మణికాంత గురించి తెలుసుకున్న గజగండ అప్పటి నుంచి తంత్ర విద్యలు నేర్చుకున్నాడని తిలోత్తమ చెప్తుంది. తన ఒక్కగానోక్క కొడుకు రక్తపుంజిని చంపినందుకు ప్రతీకారం తీర్చుకుంటామని గజగండ అంటాడు. గాయత్రీ పాపని ఎత్తుకొచ్చేస్తానని అంటాడు. మరోవైపు డోర్ కాలింగ్ బెల్ కొడితే పావనా మూర్తితో పాటు అందరూ తలుపు తీయడానికి బయపడతారు. దురంధర తలుపు తీస్తుంది. తిలోత్తమ, వల్లభలు వస్తారు. గజగండ ఎవరి రూపంలో వస్తాడో అని అందరం టెన్షన్ పడుతున్నామని అంటారు. ఇక తిలోత్తమ పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూసుకోండని అంటుంది. 


తిలోత్తమ: గజగండ పెద్దవాళ్లలానే కాదు చిన్నపిల్లల్లా కూడా రాగలడేమో. 
సుమన: అలా వస్తే అస్సలు కనిపెట్టేలేం అత్తయ్య. అలా వస్తే మా అక్క పాలు పట్టినా పర్లేదు.
విక్రాంత్: నోరు మూసుకుంటే మంచిది.
సుమన: నేను అన్నదాంట్లో తప్పేముంది అండీ. గాయత్రీ విశాల్ బావని చేయి పట్టుకొని వచ్చింది కాబట్టి గజగండ గురించి తెలిసింది లేదంటే ఆ గజగండ మా అక్క బెడ్ రూంలోకి కూడా వెళ్లేవాడేమో.


ఆ మాటతో అందరూ షాక్ అయిపోతారు. ఆ మాట వినగానే గాయత్రీ దేవి ఫొటో ఎగిరి వచ్చి సుమన నెత్తికి ఒక్కటిస్తుంది. సుమన స్ఫృహ కోల్పోతుంది. ఇక గాయత్రీ పాప నీరు వేస్తే సుమన లేచి తనని ఎవరు కొట్టారని అడుగుతుంది. దాంతో పెద్దమ్మ ఫొటో తలకు తగిలిందని చెప్తారు. గాయత్రీ వల్లే ఫొటో నీ మీదకు వచ్చి పడిందని తిలోత్తమ అంటుంది. నోటికొచ్చినట్లు మాట్లాడినందుకు పెద్దమ్మ శిక్ష వేసిందనుకో అని విక్రాంత్ అంటాడు. 


రాత్రి సుమన తల నొప్పి అని బాధ పడుతుంది. విక్రాంత్ వచ్చి సుమన మీద సెటైర్లు వేస్తాడు. సుమన ఉడికిపోయి గాయత్రీ  దేవి ఫొటో తీసేసి స్టోర్‌రూంలో పడేయ్ మని అంటుంది. దానికి విక్రాంత్ నీ ఫొటో గోడమీద పెట్టి దండేస్తానని అంటాడు. మరోవైపు గాయత్రీ పాప గురించి ఆలోచించమని తిలోత్తమ వల్లభకు చెప్తుంది. గాయత్రీ పాపకు ఇంకా మాటలు రాకపోయినా ఆ పాప చూస్తే తను అనుకున్నది అనుకున్నట్లు అయిపోతుందని తిలోత్తమ అంటుంది.. గజగండ, గంటలమ్మలు వచ్చి గాయత్రీ పాప సంగతి చూస్తామన్నారని తిలోత్తమ చెప్తుంది దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: సహస్ర బ్యాడ్‌ లక్.. కర్వాచౌత్‌లో విహారిని జల్లెడలో చూసేసిన కనకం!