Nindu Noorella Saavasam Serial Today Episode: అమర్ బయటకు వెళ్లిపోతుంటే భాగీ అడ్డు పడుతుంది. రొమాంటిక్ గా చూస్తుంది. సారీ చెప్తుంది. మన ఇంటికి ఉన్న థ్రెట్ గురించి తెలిసింది. అందుకే మా నాన్నను ఇంటికి రావొద్దన్నారు అని అర్థం అయింది అంటుంది. తర్వాత అంజు, రాథోడ్ దగ్గరకు వెళ్లి రణవీర్ నెంబర్ అడుగుతుంది. ఎందుకని రణవీర్ అడగ్గానే మొన్న ఆయన ఇచ్చిన డబ్బులు కొన్ని మిగిలాయి. అవి తిరిగి ఆయనకే మనియార్డర్ పంపింద్దామనుకుంటున్నాను అని చెప్పడంతో రాథోడ్ షాక్ అవుతాడు. అలా పంపించకూడదని చెప్తాడు. గిఫ్టుగా ఇచ్చిన మనీని తిరిగి ఇవ్వకూడదు అంటాడు. ఇంతలో రాథోడ్‌ను పొగడటంతో రాథోడ్ వెంటనే రణవీర్ కు ఫోన్ చేసి అంజుకు ఇస్తాడు. అంజు, రణవీర్‌ను వినాయక చవితికి ఇంటికి రండి అని చెప్తుంది. రణవీర్ ఎమోషనల్ అవుతాడు.
రణవీర్: లాయరు ఇవన్నీ తసేయ్ త్వరగా నేను తినేసి పడుకోవాలి.
లాయర్: రణవీర్ ఒక్కసారి మందు తాగడం మొదలపెడితే బాటిల్ అయిపోయే వరకు తాగి తాగి అక్కడే పడుకుంటావు. అలాంటిది ఇవాలేంటి? మొదలుపెట్టక ముందే తీసేయ్ అంటున్నావు.
రణవీర్: అంటే నా కూతురు గురించి తెలియక నా బాధని ఆ నషాలో కలిపేసే వాణ్ని. కానీ అంజలితో మాట్లాడాకా మనసు ఎందుకో ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు నిద్ర పోవడానికి నాకు ఏ మందు అవసరం లేదనిపిస్తుంది.
లాయరు: రణవీర్ ఇన్ని కోట్ల ఆస్థులు నీకు ఇవ్వలేని ప్రశాంతత ఒక చిన్న పాప వల్ల వచ్చిందంటే ఆ పాపని ఆ కాళికా మాతే నీ జీవితంలోకి పంపించిందేమో..
అనగానే సరే నేను వెళ్లి భోజనం చేసి పడుకుంటాను. అని రణవీర్ వెళ్లిపోతాడు. మరోవైపు అరవింద్ తన మనషులతో అమర్ ఇంటి దగ్గరకు వచ్చి దూరం నుంచి అబ్జర్వ్ చేస్తుంటాడు. బాంబు వేసి అమర్ ను చంపాలనుకుంటాడు. రేపు వినాయక చవితి పూజలో వాళ్లింట్లో నేను పెట్టే బాంబు పేలుతుంది అని చెప్తాడు. మరుసటి రోజు అందరూ ఎర్లీగా లేచి గణపతి పూజకు అన్ని ఏర్పాట్లు చేస్తుంటారు. పిల్లలు రెడీ అయి డల్ గా కూర్చుని ఉంటారు. ఈ సారి అమ్మ లేదని అమ్మలా పూజ చేసే వారే లేరని బాధపడుతుంటారు. ఇంతలో భాగీ వచ్చి మీరేం బాధపడకండి మీకందరికీ ఏం కావాలని అడుగుతుంది. దీంతో పిల్లలు భాగీలో ఆరును చూసుకుంటారు. మరోవైపు భాగీ రెడీ అవుతుంది. నెక్లెస్ పెట్టుకోవడానికి ఇబ్బంది పడుతూ అమర్ చూస్తూ..
భాగీ: అలా గుడ్లు అప్పగించి చూడకపోతే వచ్చి హెల్ఫ్ చేయోచ్చు కదా?
( అని మనసులో అనుకుంటుంది. అమర్ దగ్గరకు వస్తాడు)
అమర్: అదే పని నువ్వు చేయకుండా అడగొచ్చు కదా?
భాగీ: నా మనసులో అనుకున్నది మీకెలా తెలిసిపోయింది. ఎలా అండి.. ఓ టెలీపతినా..?
అమర్: తిరుగు..
అని భాగీకి హెల్ఫ్ చేయబోతూ.. రొమాంటిక్‌గా ఫీలవుతుంటాడు. భాగీ కూడా రొమాంటిక్ గా ఫీలవుతుంది. దీంతో బ్యాక్ గ్రౌండ్‌లో రొమాంటిక్ సాంగ్ ప్లే అవుతుంది. తర్వాత అమర్ వినాయక విగ్రహం తీసుకురావడానికి బయటకు వెళ్లబోతుంటే రాథోడ్ అపుతాడు. మీ బదులు నేను బయటకు వెళ్తాను వాడు చాలా ప్రమాదం అని చెప్పగానే అమర్ నువ్వు ఇప్పటికే మా ఫ్యామిలీకి నువ్వు చాలా హెల్ఫ్ చేశావు ఇంకా వద్దులే అని చెప్పి వెళ్లిపోతాడు. మరోవైపు బాబ్జీ కలకత్తా వెళ్లి అంజు గురించి ఎంక్వైరీ చేస్తుంటాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీ ఇంట్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే భయంకరమైన వాస్తు దోషం ఉన్నట్లే