Trinayani Serial Today Episode ఇంజెక్షన్ వల్ల చనిపోతారా అని వల్లభ అడుగుతాడు. అందరూ షాక్ అవుతారు. తిలోత్తమ కవర్ చేయడానికి చచ్చేంత నొప్పి అని అంటుంది. ఇక డాక్టర్‌గా వచ్చిన గజగండ తన భార్యని తీసుకొని వెళ్లిపోతారు. ఇంజెక్షన్‌ విశాల్‌కి వేసి ఉంటే ఈపాటికి విశాల్‌కి పని అయిపోయిండేదని తిలోత్తమ అనుకుంటుంది.


తిలోత్తమ: అసలు ఆ ఇంజెక్షన్ సోఫాలో పెట్టింది ఎవరు.   
విశాల్: అదే నాకు అర్థం కావడం లేదు.
పావనా: ఏది ఏమైనా ఆ ఇంజెక్షన్ దెబ్బకు పండు(గంటలమ్మ) చితికిపోయింది.
వల్లభ: మమ్మీ ఒంట్లో బాలేదా డాక్టర్ దగ్గరకు వెళ్దామా.
తిలోత్తమ: ఏ డాక్టర్‌రా.
నయని: డాక్టర్ గజగండ. వేశాలు వేయడం కక్ష సాధించడం  మీ లాంటి పేషెంట్ల అండ దండతో రెచ్చిపోవడం ఆ డాక్టర్ స్పెషల్.
తిలోత్తమ: మమమ్ని పేషెంట్లు అంటావ్ ఏంటి. 
నయని: ఒకరు బాగుంటే ఓర్వలేని వారు రోగులే. మర్యాదగా మీరు చేసిన తప్పును ఒప్పుకోవాలి.
తిలోత్తమ: గాయత్రీ అక్కయ్య గత జన్మని నా చేతులతో ముగించేశాను అని నీకు ముందే చెప్పాను కదా.
నయని: నువ్వు చెప్పక ముందే నేను తెలుసుకున్నాను. బాబు గారి ప్రాణాలను తీయడానికి శతవిథాలుగా ప్రయత్నిస్తున్నారు అని కూడా తెలుసుకున్నాను. నువ్వు నా నుంచి మాత్రం తప్పించుకోలేవు. 
తిలోత్తమ: చూడు నయని గజగండ మారు వేషంలో వస్తాడు అని మనకు తెలసు కానీ డాక్టర్ వేషంలో వచ్చింది గజగండ అని మాకు తెలీదు.


నయని ఒప్పుకోదు అంతా మీకు తెలిసే చేశారని మీరే ప్లాన్ వేశారని బాబుగారికి ఏమైనా అయితే మాత్రం మిమల్ని వదిలేదాన్ని కాదు అని అంటుంది. పెద్ద బావగారు మీరు చేసిన పనుల వల్ల మీ పుండరీనాథం ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇంట్లో అందరూ హాల్లో కూర్చొంటారు. విశాల్ చూడాల్సిన ఫైల్స్ హాసిని, విక్రాంత్ చూస్తుంటారు. తిలోత్తమ వీళ్లు ఫైల్స్ చూస్తారు కానీ సంతకాలు పెట్టలేరు అంటుంది. విశాల్ వాళ్ల మాటలు వింటూ ఆవేశంగా ఉంటాడు.


హాసిని: చెల్లి పెడుతుంది సంతకం. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో విశాల్ నోటితో చెప్పినా సరిపోతుంది అత్తయ్య.
విశాల్: నేను అలా చెప్తాను అని మీతో చెప్పానా వదిన. నేను సంతకం చేయలేను అని మీ ఇష్టం వచ్చినట్లు చేస్తారా. అందరూ షాక్ అయి నిల్చొంటారు.
దురంధర: ఇంత చిన్న విషయానికి కోప్పడతావేంటి విశాల్.
విశాల్: ఇది చిన్న విషయమా ఏదైనా తేడా జరిగితే కోట్లలో నష్టం వస్తుంది. 
నయని: బాబుగారు మీరే కదా ఫైల్స్ ఒకటికి రెండు సార్లు చూడమని చెప్పారు.
విశాల్: చూడమంటే ఓకే చేసేస్తారా మళ్లీ నాతో చెప్పాల్సిన పని లేదా.
విక్రాంత్: సారీ బ్రో.
వల్లభ: అమ్మ ఏదో తేడా కొడుతుంది.
తిలోత్తమ: విశాల్ కోప్పడితే మనకే మంచిది. విశాల్ చిరాకు పడటంతో అర్థముందని అనుకుంటున్నాం.
దురంధర: విష్ నువ్వు ఆఫీస్ పనులు  చూడలేవని నీ చేయి బాలేదని వీళ్లు చూస్తున్నారు.
విశాల్: నా చేయి బాలేదు అంటే నేను ఏమైపోయినట్లు చచ్చిపోయినట్లా. నేను అన్నదాంట్లో తప్పేముంది.
హాసిని: విశాల్ నువ్వు  ఇలా కోప్పడటం నేను ఎప్పుడూ చూడలేదు.. నువ్వు ఇలా గర్జిస్తుంటే గాయత్రీ కూడా ఎలా చూస్తుందో చూడు.


గాయత్రీ పాప అక్కడికి వచ్చి చూసి మళ్లీ వెళ్లిపోతుంది. అందరూ మా నాన్న ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడా అని ఫీలవుతుందని అంటారు. పంచకమణి మన చేతికి వచ్చే వరకు మనకు ఈ బాధలు తప్పవని నయని అంటే దానికి విశాల్ ఎలా వస్తుంది కావాలి అనుకుంటే రాదు ఎంతో కష్టపడాలి అని కోప్పడతాడు. వదిన కష్టపడకపోతే ఎవరు కష్టపడ్డారు అని విక్రాంత్ అంటాడు. ఇక సుమన వాళ్ల విషయాలు మనకు ఎందుకు అంటే విక్రాంత్ తిడతాడు సుమనను దానికి విశాల్ సుమనకు సపోర్ట్ చేస్తాడు. ఫైల్స్ మీద సంతకం పెట్టు అని విశాల్ సీరియస్‌గా చెప్తాడు. ఒకసారి విక్రాంత్, హాసినిలు చూస్తారని నయని అంటే విశాల్ నేను చెప్పింది చేయ్ అని అంటాడు. నయని సంతకం పెట్టడానికి రెడీ అయిపోతుంది.


తీరా చూస్తే ఆ సీరియస్ అయిన వ్యక్తి విశాల్ కాదు. విశాల్ గదిలో నిద్రపోతూ ఉంటాడు. గాయత్రీ పాప గదికి వెళ్లి తండ్రిని లేపుతుంది. లేవకపోవడంతో ముఖాన నీళ్లు వేస్తుంది. దాంతో అసలైన విశాల్ నిద్ర లేస్తాడు. ఏమైందని గాయత్రీ పాపని విశాల్ అడిగితే గాయత్రీ పాప విశాల్‌ చేయి పట్టుకొని తీసుకెళ్తుంది. మరోవైపు బయట ఉన్న విశాల్ నయనికి సంతకం పెట్టమని హెచ్చరిస్తాడు. గాయత్రీ పాప తీసుకొచ్చిన అసలైన విశాల్ హాల్‌లో ఉన్న విశాల్‌ని చూసి బిత్తర పోతాడు. నయని సంతకం పెడుతుంటే ఆగు నయని అని అంటాడు.


అందరూ ఇద్దరు విశాల్‌లను చూసి గుండె ఆగినంత పని అయి అరుస్తారు. తాము చూస్తుంది కలా నిజమా తెలీకుండా బిత్తరపోతారు. ఇక హాల్‌లో నయని వాళ్ల దగ్గర ఉన్న విశాల్ మాయం అయిపోతాడు. అందరి ఫ్యూజులు ఎగిరిపోతాయి. వచ్చింది విశాల్ కాదు గజగండ అనుకుంటా అని హాసిని అంటుంది. కంపెనీ ఫైల్స్ మీద సంతకాలు పెట్టించుకొని బిజినెస్ నాశనం చేయాలని నా రూపంలో వచ్చాడని విశాల్ కోప్పడతాడు. గాయత్రీ పాప వల్లే తాను నిద్ర లేచానని లేదంటే మాంత్రికుడి చేతిలో మరోసారి మోసపోయేవాళ్లమని అందరూ అనుకుంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: కనకానికి పెద్దాయన సపోర్ట్.. రెండు చేతులు జోడించిన యమున.. సహస్ర కాలు లక్ష్మీ పట్టుకుంటుందా!