Trinayani Serial Today Episode గాయత్రీదేవి ఫొటోతో తిలోత్తమ మాట్లాడటంతో హాసిని ఇంట్లో వాళ్లందరికీ పిలిచి హడావుడి చేస్తుంది. పెద్దమ్మ ఫొటోతో ఏం మాట్లాడుతున్నావ్ అమ్మా అని విక్రాంత్ తిలోత్తమను అడుగుతాడు. దానికి తిలోత్తమ అనుకున్న పని అవ్వలేదు అని చెప్పుకుంటున్నాను అని అంటుంది. 

Continues below advertisement


హాసిని: ఇంతకీ తమరు ఏ పని మీద వెళ్లారు తెలుసుకోవచ్చా.
వల్లభ: గజగండని కలిశావా మమ్మీ ఏమన్నాడు. (అందరూ షాక్ అయిపోతారు.)
తిలోత్తమ: మనసులో.. తెలివి తక్కువ వెధవ అందరి ముందు ఏం మాట్లాడాలో మాట్లాడకూడదో తెలీదు. అనవసరంగా నోరు జారి ఇరికించేశాడు..
నయని: గజగండని కలవడానికి వెళ్లారా.
విశాల్: అమ్మ అతను ఎక్కడున్నాడో నీకు తెలుసా.
హాసిని: తాంత్రిక విద్యలు నేర్చుకోవడానికి వెళ్లారా.
వల్లభ: ఏయ్ ఎన్ని సార్లు నేర్చుకుంటుంది మా మమ్మీ.
తిలోత్తమ: రేయ్ నువ్వు నోరు మూసుకుంటావా. వీడి మాటలు వింటే అంతే సంగతి. 
విశాల్: నువ్వు అయితే గజగండని కలవడానికి వెళ్లారు కదా అమ్మ
తిలోత్తమ: అవును నాన్న
నయని: ఎందుకు వెళ్లారు. 
తిలోత్తమ: మీ ఆయన కోసమే నయని. తన చేయి చలనం లేకుండా అలాగే ఎన్నాళ్లు అని ఉండిపోవాలి. నువ్వు సాధించిన పంచకమణి గజగండ ఎత్తుకుపోయాడని తెలిసి నాకు ఉండబుద్ధి కాలేదు. 
సుమన: పంచకమణి చూశారా అత్తయ్య ఎలా ఉంది.


ఇక సుమన, పెద్దబొట్టమ్మ పంచకమణి గురించి నాటకం ఆడారని వల్లభ తిలోత్తమతో చెప్తాడు. పంచకమణి అడిగాను అని తనకు తెలీకుండా మణిని చేతిలోకి తీసుకోగానే గజగండ కనిపెట్టేశాడని తిలోత్తమ చెప్తుంది. అందరూ డిసప్పాయింట్ అవుతారు. పట్టుకొని పరుగెత్తి వచ్చేయాల్సిందని అంటారు. ఇక గాయత్రీ పాప తిలోత్తమ చేతి గ్లౌజ్ తీసేస్తుంది. తిలోత్తమ చేయి నార్మల్‌గా అయిపోతుంది. అందరూ షాక్ అయిపోతారు. తిలోత్తమ కూడా ఆశ్చర్యపోతుంది. చాలా సంతోషిస్తుంది. పంచకమణి పట్టుకోవడం వల్లే ఇలా జరుగుంటుందని పావనమూర్తి అంటాడు. 


నయని: బాబుగారు మనం కూడా ఆ గజగండ దగ్గరకు వెళ్లి పంచకమణిని ఒక్కసారి మీ చేత్తో పట్టుకుంటామని అడుగుదామా మీకు నయం అవుతుంది. మళ్లీ పంచకమణిని అతనికి ఇచ్చేద్దాం.
సుమన: ఎలా అక్క మీ ఆయనకు తగ్గిపోతే మణిని ఆ మాత్రికుడికి ఇచ్చేస్తావా మరి మానసాదేవి అమ్మవారికి ఇచ్చిన మాట సంగతేంటి. మళ్లీ మణిని గుడిలో పెడతాను అని మాట ఇచ్చి వచ్చావు కదా.
పావనా: దేవుడికి ఇచ్చిన మాట తప్పితే ఏముంది ముందు అల్లుడికి నయం అయితే చాలు.  
విశాల్: లేదు లేదు నయని మాట తప్పకూడదు. నాకు నయం అవడం సంగతి పక్కన పెడితే ముందు పంచకమణి అమ్మవారికి దక్కాలి.


గజగండ దగ్గర నుంచి మణి ఎలా తీసుకుంటామా అది ఆలోచించమని హాసిని అంటుంది. దానికి నయని అత్తయ్య నన్ను గజగండ దగ్గరకు తీసుకెళ్తే నేను ఆ మణి తీసుకుంటా అని అంటుంది. వెంటనే వెళ్తే అనుమానం వస్తుందని తిలోత్తమ అంటుంది. నేనే తర్వాత తీసుకెళ్తానని తిలోత్తమ అంటుంది. తిలోత్తమ గజగండ దగ్గరకు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిందని అంటే ఏదో కుట్ర అని హాసిని అంటుంది. పంచకమణితో ఎలాంటి వ్యాధి అయినా నయం అయిపోతుందని అనుకుంటారు. 


తిలోత్తమ చేయి బాగు అవ్వడం చూసిన విశాల్ ఎంత ఆశగా చూశాడో అని పావనా ఫీలవుతాడు. విశాల్ కోసం మనమంతా ఏకం అవుదామని హాసిని అంటుంది.. ఇక సుమన గజగండ దగ్గర ఉన్న పంచకమణి తన చేతిలో తీసుకున్నట్లు సుమన ఊహించుకుంటుంది. విక్రాంత్ సుమనను తిడతాడు. నయని పంచకమణి దక్కించుకుంటే అది తనని తీసుకోమని విక్రాంత్‌కి చెప్తుంది. విక్రాంత్ సుమన మీద ఫుల్ ఫైర్ అవుతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: తన నగలు కొట్టేసిన చారుకేశ విహారి ఇంట్లో వాడని తెలుసుకున్న లక్ష్మీ.. విహారికి ఆదికేశవ్ ఫోన్!