Trinayani Serial Today Episode ఇంట్లో ఉన్నది నయని కాదని అర్థం చేసుకో అని విశాల్‌తో తిలోత్తమ, వల్లభ చెప్తారు. దాంతో విశాల్ మా అమ్మ వస్తే నయని మాట్లాడకుండా ఎలా ఉంటుంది అని అంటాడు. దాంతో తిలోత్తమ నేను అబద్ధం చెప్పానని అనుకుంటున్నావా అని హర్ట్ అయి వెళ్లిపోతుంది. ఇక త్రినేత్రి పాపకి ఏమైందని అనుకుంటుంది. పాలు తాగించిన తనని నిందిస్తున్నారని అనుకుంటుంది. విశాల్ బాబు తప్ప అందరూ తనని పరాయిదానిగా చూస్తున్నారని అనుకుంటుంది. 


నా చుట్టూ ఏదో జరుగుతుందని అనుకుంటుంది. పాప మీద ఎవరైనా పగ పెంచుకొని ఇలా చేశారా ఆ నేరం నా మీద నెట్టేశారా అనుకుంటుంది. ఇంతలో అక్కడికి తిలోత్తమ వస్తుంది. మరోవైపు సుమన భర్తతో తను మా అక్క అయితే ఇలా కన్న బిడ్డకి అయినా రిలాక్స్‌గా ఉంటుందా అసలు ఇలా చేస్తుందా అని అంటుంది. తాను మా అక్క కాదని అంటుంది. ఆస్తి కోసమే మా అక్కలా ఉన్న ఆమె ఇలా చేస్తుందని అంటుంది. 


విక్రాంత్: మనసులో తను మా వదిన కాకపోయినా జాలేస్తుంది. ఎందుకు ఇంత రిస్క్ తీసుకుంటుందా అని అనుమానం వస్తుంది. 
తిలోత్తమ: ఈరోజు తాడో పేడో తేలిపోవాలని త్రినేత్రిని లాక్కొని బయటకు వస్తుంది. ఇప్పటి వరకు పాపకి మెలకువ రాలేదు పాలలో ఏం కలిపిందో ఏంటో.
విశాల్: నయని అలా చేయదు అమ్మ.
సుమన: తను మా అక్క అని ఇంకా అనుకుంటున్నారా బావగారు. 
తిలోత్తమ: మా కోడల్ని ఏం చేసి ఇక్కడికి వచ్చావ్.
త్రినేత్రి: పిచ్చా మీకు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు. 


తిలోత్తమ త్రినేత్రిని పోవే బయటకు అని నెట్టేస్తుంది. దాంతో గాయత్రీ దేవి ఆత్మ త్రినేత్రిని పట్టుకుంటుంది. దాంతో త్రినేత్రికి యముడు ఇచ్చిన వరం వల్ల తాను త్రినయని అన్న విషయం గుర్తొస్తుంది. గాయత్రీ దేవిని అమ్మగారు అని పిలుస్తుంది. అందరూ షాక్ అయిపోతారు. నయని నన్ను చూడగలుగుతున్నావా అని అడుగుతుంది. పసి బిడ్డలా నన్ను పట్టుకున్న మిమల్ని చూడకుండా ఎలా ఉంటానని అంటుంది. పెద్దమ్మని చూసి మాట్లాడింది అంటే తాను నయని వదినే అని విక్రాంత్ అంటాడు. ఇక నయని ఎప్పటిలా నయనిలా మాట్లాడుతుంది. దానికి తిలోత్తమ నేను నిన్ను గెంటేస్తున్నా అని గాయత్రీ అక్క వచ్చిందని నాటకం ఆడుతున్నావా అని అడుగుతుంది.


ఆత్మ కనిపించినా కనిపించడం లేదని తిలోత్తమ అందరితో చెప్తుంది. నయని గాయత్రీ అక్క ఉందని నయని అంటే తిలోత్తమ రివర్స్ అయిపోతుంది. అందరూ వాళ్ల మాటలకు షాక్ అయిపోతారు. ఇక సుమన పాప కళ్లు తిరిగిపడిపోయిందని నయనితో అంటే నా బిడ్డకు ఏమైందని నయని షాక్ అయిపోతుంది. నువ్వు ఇచ్చిన పాలు తాగే పాపకి ఇలా అయిందని అంటే నయని షాక్ అయిపోతుంది. అసలేం జరిగిందో అని నయని గాయత్రీ దేవి చెప్తుంది. నువ్వు నన్ను చూడగలిగితే నువ్వు నయనివి లేదంటే కాదు అని అందరితో చెప్పిందని అంటుంది.


విషయం అర్థం చేసుకున్న నయని అమ్మగారు ఇక్కడ లేరు రాలేదని నయని అంటుంది. నేను నయనినో కాదు తిలోత్తమ అత్తయ్యే చెప్తారని నయని అంటుంది. ఐదు నిమిషాల్లో చెప్పిస్తానని నయని కర్ర తీసుకొచ్చి గాయత్రీ దేవి ఆత్మకి ఇచ్చి ఆ దుర్మార్గురాలు చిత్తు చిత్తు అయిపోవాలని కర్ర అందిస్తుంది. తిలోత్తమ భయపడుతుంది. ఆత్మ కర్ర పట్టుకోవడం కర్ర మాత్రమే గాల్లోకి లేవడం చూసి అందరూ షాక్ అయిపోతారు. గాయత్రీ దేవి తిలోత్తమను చితక్కొడుతుంది. మిగతా అందరికి మాత్రం కర్ర మాత్రమే తిలోత్తమని కొట్టడం కనిపిస్తుంది. ఏమైందని కర్ర కొడుతుందేంటని అనుకుంటారు. దాంతో తిలోత్తమ నన్ను వదిలేయ్ అక్క అని బతిమాలుతుంది. నయని అక్కకి చెప్పు కొట్టొద్దని అంటుంది. అందరూ షాక్ అయిపోతారు. దాంతో తిలోత్తమ మీ అమ్మ వచ్చింది అని విశాల్‌తో చెప్తుంది. ఇక నువ్వు నయనివే అని నయనితో అంటుంది. అమ్మ నిన్ను ఎందుకు కొట్టిందని విశాల్ అడిగితే పాప పాలలో మత్తు మందు కలిపానని చెప్తుంది. అందరూ షాక్ అయిపోతారు. విక్రాంత్ తల్లిని తిడితే మా అమ్మ శిక్షించింది వదిలేయరా అంటాడు విశాల్. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 



Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: ఊరుని ఇంటిని చూసి గతం గుర్తుచేసుకొని ఎమోషనలైన లక్ష్మీ.. తగలబెట్టేస్తానంటోన్న మనీషా!