Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today November 27th: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: ఊరుని ఇంటిని చూసి గతం గుర్తుచేసుకొని ఎమోషనలైన లక్ష్మీ.. తగలబెట్టేస్తానంటోన్న మనీషా!

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode మిత్ర, లక్ష్మీల ఘన స్వాగతం చూసిన మనీషా ఓర్వలేక మిత్రని అక్కడి నుంచి తీసుకెళ్లిపోవాలని అనుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Continues below advertisement

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode జయదేవ్ చివరి చెక్ పోస్ట్ దగ్గరకు చేరుకుంటాడు. పోలీసులకు మిత్ర వాళ్ల గురించి చెప్తే ఎంత చెప్పినా వినకుండా బస్ తీసుకొని వెళ్లిపోయారని పోలీసులు చెప్పి మీరు చెప్తే వింటారేమో వెళ్దాం పదండి అని జయదేవ్ వాళ్లతో బయల్దేరుతారు. మరోవైపు మిత్ర ఓ చోట బస్ అపుతాడు. 

Continues below advertisement

వివేక్, మిత్ర ఇద్దరూ కిందకి దిగి చూస్తే దారికి అడ్డంగా రాళ్లు ఉంటాయి. ఇంతలో కొందరు దారి దోపిడీ వాళ్లు కత్తులు చూపించి బస్సులో వాళ్లకి డబ్బు, నగలు అడుగుతారు. భయంతో అందరూ తమ బంగారం తీసి ఇస్తారు. ఇక మరొక దొంత అన్నీ వచ్చేశాయి వెళ్లిపోదాం అంటే లక్ష్మీ మెడలో తాళి తీయమని అంటాడు. లక్ష్మీ ఇవ్వదు. తెంపడానికి దొంగ చేయి వేస్తే లక్ష్మీ దొంగని చితక్కొడుతుంది. మిత్ర, వివేక్‌లు కూడా దొంగల్ని చితక్కొడతారు. ఇంతలో జయదేవ్, పోలీసులు అక్కడికి చేరుకుంటారు. పోలీసులు దొంగల్ని పట్టుకొని వెళ్లిపోతారు. లక్ష్మీ వల్లే ఇలాంటి ప్రమాదం జరిగిందని దేవయాని, మనీషాలు లక్ష్మీని తిడతారు. ఇక ఆపండి అని మిత్ర అరిచి అందరినీ బస్ ఎక్కమంటాడు. 

ఉదయం పార్థసారథి గారు ఊరి వాళ్లతో కలిసి లక్ష్మీ వాళ్ల కోసం ఎదురు చూస్తారు. లక్ష్మీ వాళ్లు వస్తారు. లక్ష్మీతో అందరూ ప్రేమగా మాట్లాడటంతో లక్ష్మీకి ఇక్కడ ఇంత క్రేజ్ ఏంటి అని అనుకుంటాడు మిత్ర. ఇక లక్ష్మీ, జానులతో మీ భర్తలు హీరోల్లా ఉన్నారని మీ పిల్లుల మీ లాగే ఉన్నారని అంటారు. లక్ష్మీ ఇంటిని చూసి తన గత జ్ఞాపకాల్ని తలచుకొని ఎమోషనల్ అవుతుంది. ఇక లక్ష్మీ, మిత్రలకు ఒకే పూల దండ వేసి స్వాగతం పలుకుతారు. మిత్ర చిరాకు పడితే ఆచారం అని లక్ష్మీ మిత్రని సహకరించమని చెప్తుంది. ఇక మిత్ర, లక్ష్మీలతో ఒకరితో ఒకరికి స్వీట్ తినిపించుకోమని అంటారు. అయిష్టంగానే మిత్ర ఒప్పుకుంటాడు. ఇక దేవయాని వివేక్‌తో వాళ్లకి చేసిన ఆచారమే మీకు చేయగలరు వద్దని చెప్పు అంటే వివేక్ తల్లి మాట పట్టించుకోకుండా అడిగి మరీ అలాగే చేయమని అంటాడు. రెండు జంటలకు దిష్టి తీసి ఇంట్లోకి ఆహ్వానిస్తారు. 

లక్ష్మీ తన గదిలోకి వెళ్లి తన తాతతో గడిపిన క్షణాలు మాటలు తలచుకొని ఏడుస్తుంది. తల్లిదండ్రుల ఫొటోలు, తాత ఫొటో చూసి ఏడుస్తుంది. తన పెళ్లి రోజే బస్ యాక్సిడెంట్‌తో తాతయ్య చనిపోవడం గుర్తు చేసుకొని మీరు లేరు తాతయ్య మీ జ్ఞాపకాలు మాత్రమే మిగిలాయి అని ఆ రోజు ప్రమాదంలో మీరు చనిపోకపోయి ఉంటే ఈ రోజు మేం సంతోషంగా ఉండే వాళ్లం అని ఏడుస్తుంది. ఇక జాను అక్కడికి వస్తుంది. అక్కా చెల్లెళ్లు ఇద్దరూ ఎమోషనల్ అవుతారు. ఇక మన వాళ్ల కోసం ఆలోచించి బావగారిని పిల్లల్ని మర్చిపోయినట్లున్నావ్ వెళ్లు అక్కా అని పంపుతుంది. ఇక మనీషా, దేవయానిలకు ఒక గది ఇస్తారు. అందరూ లక్ష్మీని పొగుడుతున్నారని మిత్ర నాకు దూరం అయిపోతాడేమో అని భయంగా ఉందని మనీషా అంటుంది. వీలైనంత త్వరగా ఊరు నుంచి వెళ్లిపోవాలని అందుకు ఏదో ఒక ఫ్యాక్టరీ తగలబెట్టి మిత్రకు కాల్ వచ్చేలా చేసి వెళ్లిపోవాలంటుంది. మరోవైపు మనీషా సరయుకి కాల్ చేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: కార్తీకదీపం 2 సీరియల్: దీపకి మల్లెపూలు ఇచ్చిన కార్తీక్.. దీపని చంపడానికి జ్యోత్స్న ప్లాన్!

Continues below advertisement