Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode దీప బాధ పడుతుంటే కాంచన వెళ్లి నీ భర్తని సీఈఓగా తీసేశారని బాధపడుతున్నావా అని అడుగుతుంది. దానికి దీప మీ మేనకోడలిని పెళ్లి చేసుకొని కంపెనీనే దక్కించుకోవాల్సిన వ్యక్తి నన్ను పెళ్లి చేసుకొని ఉన్న స్థానం నుంచి తొలగిపోయారంటే బాధ కాకపోతే మరేంటి అమ్మ అని దీప అడుగుతుంది.
దీప: కార్తీక్ బాబు ఇప్పుడు ఆ మనషులతో కలవగలరా. కోపం ఉండొచ్చు కానీ మనవడే కదా ప్రతీకారం తీర్చుకోవడం ఏంటి. ఆయన ఏం తప్పు చేశారు. కార్తీక్ బాబు జీవితంలో నేను ఉన్నంత వరకు ఆయన ఒక్కో మెట్టు దిగుతూ ఉంటారు. నేను కార్తీక్ బాబుతో పాటు రెస్టారెంట్‌కి వెళ్లిన తర్వాత ఆయన మంచి తనం అర్థమైంది. అంత గొప్ప మనిషికి భార్య అంటే ఎలా ఉండాలి. నేను అలా ఉన్నానా. ఇప్పుడు నేను కార్తీక్ బాబుని మోసం చేస్తున్నట్లుంది.
కాంచన: ఇక చాలు ఆపు దీప నీ భర్త వ్యక్తిత్వం కంటే ఆ సీఈఓ పదవి ముఖ్యం అనుకుంటున్నావా.
దీప: అనుకోవడం లేదమ్మా. కానీ ఎంత కాదు అనుకున్నా.
కాంచన: చూడు దీప నీ భర్త చాలా తెలివైనవాడు. వాళ్లు ఎవరో సీఈఓ పదవి ఇవ్వడం కాదు వాడు తలచుకుంటే సొంతంగా కంపెనీ పెట్టి సీఈఓ అవ్వగలడు. కానీ విడిపోవాలి అన్న సలహా వాడికి నేను ఇవ్వడంలేదు అంతే.
ఇంతలో శౌర్య వస్తుంది. శౌర్య కార్తీక్ వచ్చాడా అమ్మ అని అడుగుతుంది. కాంచన అనసూయతో మన ప్లాన్ వర్కౌట్ అవుతుంది అమ్మా అని అంటుంది. దీప ఏమంటుందో చూద్దాం పద అని వెళ్తుంది. అక్కడ దీప కార్తీక్ అని పిలవొద్దని అంటుంది. కార్తీక్ నా ఫ్రెండ్ అని శౌర్య అంటే ఫ్రెండ్ కాదు అని అంటుంది దీప. మరేంటి అని శౌర్య అడిగితే నీకు తెలుసు కదా అంటుంది. దానికి శౌర్య మరి నువ్వు ఎందుకు కార్తీక్‌ని కార్తీక్ బాబు అంటావ్ అలా అనకూడదు కదా అయితే కార్తీక్ అనాలి లేదంటే ఏవండీ అనాలి కదా అంటుంది. కాంచన పిల్లకి ఇన్ని తెలివి తేటలు ఉన్నాయా అని అనుకుంటుంది. ఇక దీప శౌర్యతో కార్తీక్ బాబుని పేరు పెట్టి పిలిస్తే ఊరుకోనని అంటుంది. మరేమని పిలవాలో నువ్వే చెప్పు అని శౌర్య అంటే నాన్న అని పిలవమని దీప అంటుంది.
మరోవైపు సుమిత్ర తమ మామయ్య చేసిన పని నచ్చలేదు అని అంటుంది. కుటుంబం విషయాల్లో బిజినెస్‌లు ఎందుకని అడుగుతుంది. అసలు జ్యోత్స్న రెస్టారెంట్ విషయాలు చూసుకోగలదా అని సుమిత్ర అంటే శివనారాయణ వచ్చి చూసుకోగలదమ్మా అని అంటాడు. కార్తీక్, దీపల మీద పగతో కాదని జ్యోత్స్న మంచి కోసం ఇలా సీఈఓ చేశానని అంటాడు. కార్తీక్ సీఈఓ అయినప్పటి నుంచి లాభాలు వచ్చాయని సుమిత్ర అంటే లాభాలు వచ్చాయి కానీ వాడు తన తండ్రి నా పరువు తీశారని చివరకు దీపతో కూడా నన్ను అవమానించాడని అంటాడు. జ్యోత్స్న సీఈఓ అయితే దీప లాంటి వాళ్లు ఇష్టానుసారం ప్రవర్తించడం మానేస్తారని అంటాడు. ఏనాటికైనా మనం కలుస్తామని సుమిత్ర అంటే అవునమ్మా కలుస్తాం కానీ అప్పటికి మీ మామయ్య బతికి ఉండడని చెప్పి వెళ్లిపోతారు. వదినా కార్తీక్ చాలా బాధ పడుతుంటారని సుమిత్ర అనుకుంటుంది.
మరోవైపు దీప ఇళ్లు సర్దుతుంటే కార్తీక్ వస్తాడు. ఇక కార్తీక్ దీపకి ఇస్తాడు. దీప తీసుకోకుండా అలా ఉండిపోతుంది. దాంతో కార్తీక్ అమ్మ తీసుకొచ్చి నీకు ఇవ్వమని చెప్పిందని అంటాడు. దానికి దీప నాకా అని అడిగితే దేవుడికి అని తీసుకురమ్మంది అయినా మల్లె పూలు నువ్వు పెట్టుకుంటే తప్పు ఏంటి నాకా అని అడుగుతున్నావ్ నాకు మల్లెపూలు అంటే చాలా ఇష్టం అని చెప్పి దీప చేతిలో పువ్వులు పెట్టి వెళ్లిపోతాడు కార్తీక్. మీ మనసు గొప్పది బాబు కానీ నేనే మీ చేతిలో వీటిని చూసి కంగారు పడ్డానని దీప అనుకుంటుంది. మరోవైపు జ్యోత్స్న దీప తనని కొట్టిన సంఘటనలు గుర్తు చేసుకొని నాకు గుడ్ టైం స్టార్ట్ అయిందని అనుకుంటుంది. ఇక దీప స్థానం నాకు కావాలి అని ఓ రౌడీకి కాల్ చేసి ఫోన్ చేసి ఓ వ్యక్తికి చంపాలని అంటుంది. దీప నీ పని అయిపోతుందని అనుకుంటుంది.
ఇక శౌర్య కన్ను మంట అనుకుంటూ వస్తుంది. కార్తీక్ వచ్చి ఏమైందని అడిగితే కంట్లో నలక పడిందని అంటుంది. దీప కూడా వస్తుంది. ఇక దీప ఆవిరి పెడతాను అంటే పాప కార్తీక్ ఆవిరి పెట్టాలని అంటుంది. దాంతో కార్తీక్ దీప కొంగుతో శౌర్య కంటికి ఆవిరి పెడతాడు. తర్వాత పాప తగ్గిందని వెళ్లిపోతుంది. దీప కార్తీక్‌లు ఒకర్ని ఒకరు చూసుకుంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: సత్య ఉచ్చులో మహదేవయ్య పడతాడా.. డీఎన్‌ఏ టెస్ట్‌కి ఒప్పుకుంటాడా!