Trinayani November 21st Today Episode - 'త్రినయని' సీరియల్: సుమనను కట్టేసి ఉలూచిని ఎత్తుకెళ్లిన పెద్దబొట్టమ్మ!

Trinayani Serial Today Episode: ఉలూచిని తనతో తీసుకెళ్లడానికి పెద్దబొట్టమ్మకు విక్రాంత్ సాయం చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Continues below advertisement

Trinayani Serial November 21st Episode: పావనామూర్తి దానాన్ని తీసుకోవడానికి చాలా భయపడతాడు. దీంతో నయని స్వామి వారికే దానం ఇస్తాం అంటుంది. ఇక విశాల్ కూడా స్వామి వారికి దానం తీసుకోమంటారు. నయని గురువుగారికి దానం సమర్పిస్తుంది. ఇక తిల్లోత్తమ పావనామూర్తిని గురువుగారి మీదకు తోసేస్తుంది. దీంతో గుమ్మడికాయ ముక్కలైపోతుంది. అయితే పొరపాటున జరగడం వల్ల ఏం కాదు అంటారు గురువుగారు. అయితే తిలోత్తమ గుమ్మడికాయలో ఏదో కలిపి ఉండటం వల్ల గుమ్మడికాయ కుళ్లిపోతుంది. అందరూ కంగారు పడతారు. తిలోత్తమ నవ్వుకుంటుంది. 

Continues below advertisement

విశాల్: నయని పెన్నూపేపర్‌తో రాసుకుంటుంటే.. నయని ఇంటికి కావాల్సిన సరుకులు డ్రైవర్‌కి చెప్తే తెస్తాడు కదా నువ్వేందుకు రాసుకోవడం
నయని: ఇది సరుకల లిస్ట్‌ కాదు బాబుగారు. అమ్మగారి జాతకానికి సంబంధించిన గ్రహబలం లెక్కిస్తున్నాను. 
విశాల్: నీకు జాతకాలు చూడటం వచ్చా
నయని: జీవితాన్ని చూసిన వాళ్లు ఎప్పుడు ఏది చేయాలో తెలుసుకునే ఉంటారు. అయితే కన్నతల్లి బిడ్డ జీవితంలో ఎలాంటి ఆపద రాకుండా చూసుకోవాలని అని ప్రయత్నిస్తుంది. గాయత్రి అమ్మగారికి గండం రానే వస్తుంది
. ఆత్మగా ఉన్నప్పుడు ఆమెను ఏ దృష్ట శక్తి ఏమీ చేసేది కాదు. పసి కందుగా ఉన్న నా బిడ్డ ఎన్ని కష్టాలు పడుతుందో అని ఆలోచిస్తున్నా. 
విశాల్: మీ తాతయ్య శంకర శాస్త్రలా జాతకాలు రాస్తున్నావ్ అన్నమాట
నయని: విధిరాతని ఎవరూ రాయలేరు బాబుగారు. అనుకోని ఆపద వస్తే దాన్ని అధిగమించడానికి గ్రహబలాన్ని తోడుగా తెచ్చుకోవాలి. చిత్రగుప్తుడి పూజలో గుమ్మడి పండు పగిలిపోవడమే అపశకునం అనుకుంటే అది కుళ్లిపోవడం ఇంకా అపశకునంలా అనిపిస్తుంది.
విశాల్: నయని నువ్వు టెన్షన్‌లో సరిగా ఆలోచించలేదు అనిపిస్తుంది. పండు కుళ్లిపోతే దుర్వాసన రావాలి కదా. మరి రాలేదు ఏంటి
నయని: అవును బాబుగారు పండు ముక్కలు అయినా చూడటానికి బాగానే ఉంది. పాడై ఉంటే మీరన్నట్లు దుర్వాసన రావాలి
విశాల్: రాలేదు అంటే అది బాగుంది అని అర్ధం. అంటే మనం బాగుండ కూడదు అని ఎవరో చేసిన ప్రయత్నం
నయని: అర్ధమవుతుంది బాబుగారు మనం మానసికంగా నలిగిపోవాలని ఇంట్లో వాళ్లు చేసే పని ఇది. ఇదంతా మిమల్ని పెంచిన అమ్మ చేసింది అంటే ఎలా తట్టుకుంటారో.. ఇదంతా సుమన చేసిందని అనుకుంటున్నాను. ఎదుటి వారు సంతోషంగా ఉండకూడదు అనుకునేవాళ్లలో తను ముందుంటుంది. అమ్మగారికి అయితే గండం రాబోతుంది అని యమదీప దానం చేసిన రోజు అర్ధమైంది. దాన్ని తప్పించడం ఎలా అన్నది ఆలోచించాలి. మీరు ధైర్యంగా ఉంటే చాలా మీ వెనక నేను ఉంటా. ఈ ప్రయత్నంలో కచ్చితంగా నా పెద్ద బిడ్డను కలుసుకుంటాను. 

మరోవైపు విక్రాంత్ నాగులాపురం నుంచి తెచ్చిన పెట్టెను చూసి గురువుగారు చెప్పింది ఆలోచించుకుంటూ ఆ పెట్టెను తెరుస్తాడు. అందులోని 5 గవ్వలను తీసి వీటితో ఏం చేస్తారు అని అనుకుంటాడు. అప్పుడే పెద్దబొట్టమ్మ విక్రాంత్‌కు కనిపిస్తుంది. అయితే విక్రాంత్ షాక్ అవుతాడు. 
విక్రాంత్: పెద్ద బొట్టమ్మ నువ్వు నయని వదిన, సుమనలకు మాత్రమే కనిసిప్తావ్ కదా 
పెద్దబొట్టమ్మ: నీ చేతిలో గవ్వలు ఉన్నంత సేపు నీకు మాత్రమే కనిపిస్తాను. నాకు ఓ సాయం చేస్తావా బాబు.. ఈ రోజు నాగుల చవితి నాబిడ్డ ఉలూచిని పుట్ట వరకు తీసుకెళ్లి పుట్టలోని పాములకు పాలు పోయించి మళ్లీ తీసుకెళ్లి తెచ్చేస్తా. సుమనకు నేను కనబడకుండా ఉండాలి అంటే నువ్వు ఆ గవ్వలు నీ చేతిలోనే ఉంచుకో ఈ తాయత్తు కట్టుకో అని కడుతుంది. 

ఇక పెద్దబొట్టమ్మ సుమనను బంధించేశాను. ఉలూచిని తీసుకెళ్లి మళ్లీ తెచ్చేస్తాను అని అంటుంది. మరొవైపు ఆస్తిక అని కనిపించిన చోట సుమన రాస్తుంది. ఇక డమ్మక్క నువ్వు ఎంత ప్రయత్నించినా వెళ్లాల్సిన వారు వెళ్లిన చోటుకే వెళ్తారు అని అంటుంది. నయని వచ్చి ఇంట్లో నుంచి ఉలూచి బయటకు వెళ్లకూడదు అని సుమన ఇలా రాస్తుందని చెప్తుంది. సుమన షాక్ అవుతుంది. ఇక వల్లభ మరి ఇప్పుడు సుమన ఎవరిని కాపాడుకోవాలని ఇలా రాసిందని అడుగుతాడు. దానికి విక్రాంత్ పెద్దబొట్టమ్మ వచ్చి ఉలూచిని తీసుకెళ్లిపోతుంది అంటాడు. ఇక పెద్దబొట్టమ్మ సుమనను కట్టేస్తుంది. అది ఎవరికీ కనిపించదు. సుమన ఎవరు ఎవరు అని అడుగుతుంది. అందరూ ఏంటని షాక్ అవుతారు. ఉలూచినీ తీసుకెళ్లడానికి ఇలా పెద్దబొట్టమ్మ చేస్తుందని అందరూ ఉలూచినీ వెతకడానికి వెళ్తారు. మరోవైపు పెద్ద బొట్టమ్మ ఉలూచిని ఎత్తుకొని తీసుకెళ్తుండగా విక్రాంత్ చూస్తాడు ఎందుకు సుమనను కట్టేశావు అని అడగడంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.  

Continues below advertisement