Gruhalakshmi Serial Today Episode Written Episode
దీపక్: మన ఇంటికి వెళ్దాం రా అక్క. అమ్మలేని ఇళ్లు బోసిగా ఉంది. మనిషి విలువ ఉన్నప్పుడుకంటే లేనప్పుడే బాగా తెలుస్తుంది అంటారు. ఇప్పుడు తెలుస్తుంది కార్యక్రమాలు అన్నీ పూర్తయిన వరకు నువ్వు మాతోనే ఉండు అక్క.
తులసి: లేదురా అమ్మ లేని ఇంట్లోకి వచ్చే ధైర్యం నాకు లేదురా. అడుగడుగునా అమ్మ నాకు గుర్తొస్తుంది. అమ్మ పట్ల నేను చేసిన తప్పు నాకు గుర్తొస్తుంది. నేను తట్టుకోలేనురా.
దీపక్: అలా అంటే ఎలా అక్క నువ్వు ధైర్యంగా ఉంటేనే మేము ధైర్యంగా ఉంటాము
తులసి: ఎన్నో కష్టాలను బాధలను తట్టుకొని నిలబడ్డాను. నా గుండెను రాయిలా మార్చేశాను. కానీ అమ్మలేని లోటు తట్టుకోవడం నా వల్ల కావడం లేదురా. నా జీవితంలో తారసపడ్డ ప్రతీవాళ్లు ఏదో ఒక సమయంలో నన్ను బాధపెట్టారు. కానీ అమ్మ ఒక్కర్తేరా నన్ను చిన్నప్పుడు గుండెల్లో మోసింది. పెద్దయ్యకు నా బాధలు తన గుండెలో పెట్టుకుని మోసింది. ఇన్నాళ్లు ఏ కష్టం వచ్చినా చెప్పుకోవడానికి అమ్మ ఉంది అనే ధైర్యం ఉండేది అలాంటి అమ్మను దేవుడు దొంగతనంగా లాక్కెళ్లిపోయాడు. ఇప్పుడు కష్టం వస్తే ఎవరికి చెప్పుకోను. దేవుడి వైపు చూస్తూ చేతులు జోడించడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితిరా నాది
తులసి, దీపక్‌ల మాటలు చాటుగా విన్న నందూ ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లి పోతాడు. ఇక హాల్‌లో దివ్య తన తల్లి మాటల్ని తలచుకొని బాధపడుతుంది. అక్కడికి పరందామయ్య వస్తాడు. దివ్యతో అనసూయ గురించి అడుగుతాడు పరందామయ్య.
పరందామయ్య: అమ్మ దివ్య నా దిగులు అంతా మీ అమ్మ గురించే తల్లీ. జీవితంలో సర్వశ్వం కోల్పొయింది. ఈ దిగులు నుంచి ఎప్పుడు బయటపడుతుందో
దివ్య: అమ్మమ్మ పోయింది అనే బాధకన్నా బతికించుకునే అవకాశం ఉండి కూడా బతికించుకోలేదన్న బాధే అమ్మ తట్టుకోలేకపోతుంది.
పరందామయ్య: అది సహజమే కదా అమ్మ. ఇంట్లో ఎవరికీ ఏ అవసరం వచ్చినా తల తాకట్టు పెట్టి అయినా డబ్బు తెచ్చేది. ఇప్పుడు డబ్బు సమస్యలేదు మంచి హోదాలో ఉంది. అయినా తన తల్లిని రక్షించుకునే అవకాశం ఆ దేవుడు తులసికి ఇవ్వలేదు అమ్మ.
నందూ: దివ్య ఏమైంది మీకు నేను రాగానే తాతయ్య మాట్లాడటం ఆపేశాడు, నువ్వు లేచి వెళ్లి పోతున్నావు. మీ అమ్మ అయితే గదిలో కూర్చొంది బయటకు కూడా రావడం లేదు. ఎందుకిలా ఆ మౌనానికి అర్ధం ఏంటి సమాధానం చెప్పు దివ్య. ఎందుకు నన్ను దూరం పెడుతున్నారు. నేను చేసిన తప్పు ఏంటి.
పరందామయ్య: నీకు తెలీదా నేను మళ్లీ చెప్పాలా
దివ్య: ఒక మంచి మనిషిని బాధ పెట్టారు నాన్న. ఒక ప్రేమించే హృదయానికి తీరని గాయం చేశారు అది మీకు తెలీదా
నందూ: అది నేను కావాలని చేసింది కాదు దివ్య. అనుకోకుండా జరిగిపోయింది. అది మీరు అర్ధం చేసుకోవడం లేదు
పరందామయ్య: అర్ధం లేకుండా మాట్లాడకు.. అనుకోకుండా జరగడం ఏంట్రా. వైజాగ్‌కు వెళ్లినప్పుడు తులసి ఫోన్ నీ దగ్గర ఎందుకు ఉందిరా.. తర్వాత ఫోన్ ఎందుకురా తిరిగి ఇవ్వలేదు. దీపక్ తులసికి కాల్ చేశాక మాట్లాడకుండా ఎందుకు కట్ చేశావురా.. ఎందుకు స్విఛ్ ఆఫ్ చేశావు. నిన్నేరా అడిగేది. సమాధానం చెప్పు. మమల్ని అన్నావ్ కదా ఇప్పుడు నువ్వెందుకు మౌనంగా ఉన్నావు. సరేరా ఆ తర్వాత దీపక్ నీకు కాల్ చేశాడు కదా మరి అప్పుడెందుకు తనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు.
నందూ: నేను తులసి కలిసి మళ్లీ జీవించడం దీపక్‌కు ఇష్టం లేదు అందుకే దీపక్ మీద కోపంగా ఉన్నాను
దివ్య: మామయ్య గొంతులో కంగారు చూసి అయినా ఏం జరిగుంటుందో అని నీకు అనుమానం రాలేదా నాన్న
పరందామయ్య: ఏ కారణంతో నువ్వు దీపక్‌తో మాట్లాడలేదో ఆ కారణం తులసికి తెలిస్తే జీవితంలోనే కాదురా ఈ ఇంట్లో కూడా చోటివ్వదు.
దివ్య: ఇప్పటికైనా అర్ధమైందా నాన్న. నిజానికి ఇది పాపం కాదు మహాపాపం. అమ్మకు తల్లిని దూరం చేశావ్.
నందూ: మీరే కదా తులసికి నా మనసులో మాట చెప్పమని తొందర పెట్టారు. మీరే కదా నా మనసులో మాట చెప్పమని హడావుడి చేశారు.
పరందామయ్య: రేయ్... తెలివితక్కువతో పనిచేసి వేలు మా వైపునకు చూపించకు. దీపక్‌తో మాట్లాడొద్దు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేయమని మేము చెప్పామా.
నందూ: నాన్న నాది తప్పే. నన్ను క్షమించమని తులసికి మీరు చెప్పొచ్చుకదా
పరందామయ్య: ఆ మాట మేం చెప్తే తులసి మమల్ని క్షమించదు
నందూ: మరి ఇంట్లో నా పరిస్థితి ఏంటి.. దివ్య ఒకసారి నానమ్మను పిలువు
పరందామయ్య: అవసరం లేదు. నామాటే తన మాట
నందూ: అమ్మని కన్విన్స్ చేసుకోవడం నీ చేతుల్లోనే ఉంది. అందుకు నువ్వే ఏదో చేయాలి నాన్న.
పరందామయ్య: కానీ ఒక్క విషయం నీ మనసులో మాట చెప్పుకోవడానికి దీపక్‌ను అడ్డుకున్నావ్ అని తులసికి మాత్రం తెలిస్తే ఈ ఇంట్లో తుఫాను రావడం ఖాయం.
మరోవైపు తులసి తన తల్లి ఫొటో దగ్గర ఏడుస్తుంది. ఇక దివ్యను విక్రమ్ ఓదార్చుతాడు. తన తల్లిదండ్రులను ఇక ఒకటి చేయడం ఆ దేవుడి వల్ల కూడా కాదని దివ్య ఏడుస్తుంది. ఇంతలో దివ్యకు తన అత్తయ్య ఫోన్ చేస్తుంది. తన అమ్మమ్మ చావు గురించి వెటకారంగా మాట్లాడుతుంది. ఇక తులసితో కూడా మాట్లాడుతాను అంటే తన తల్లి ఇప్పుడు మాట్లాడలేదని తర్వాత మాట్లాడిస్తాఅని అంటుంది. ఇక విక్రమ్ వెళ్లిపోతాడు. మరోవైపు తన తల్లి ఏం తినడంలేదు మాట్లాడటం లేదని దివ్య వాళ్ల తాతయ్యతో చెప్తుంది. ఇక నందూ వెళ్లి భోజనం వడ్డించుకొని తీసుకెళ్తుండగా దివ్య అడ్డుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.