Trinayani Serial November 15th Episode : గురువుగారు: (వల్లభ నవ్వుకు) మూర్ఖుడా ఎందుకు వెకిలిగా నవ్వావో అని లలితా దేవి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పు


తిలోత్తమ: గురువుగారు శాంతి స్వరూపులు మీరు. మీకే చిరు కోపం వచ్చింది అంతే మన్నించాలి. నా కొడుకు నవ్వు వెనుక అర్థం ఉంది. కాస్త కర్పూరానికే 7 కోట్లు రూపాయలు కాలి బూడిదైపోతే. వంద దీపాలకు పైగా ఉన్నప్పుడు ఆస్తి నష్టమో, ప్రాణ నష్టమో జరిగితే ఎలా


నయని: అందుకు నవ్వు ఎలా వస్తుంది అత్తయ్య 


లలితాదేవి: వాళ్ల కష్టార్జితం కాదు కదా నయని


సుమన: అంటే నా డబ్బు కూడా కాలిపోతే మీరు ఇలాగే నవ్వుకున్నారు కదా బావగారు


విక్రాంత్: అయినా అది నీ డబ్బు ఏంటి విశాల్ బ్రో ఇచ్చింది


విశాల్: వదిలేరా ఇచ్చేశాక ఇక అది నా డబ్బు కాదు 


ఎద్దులయ్య: ఇప్పుడు ఎవ్వరిదీ కాకుండా సొమ్ము శూన్యంలో కలిసిపోయింది బాబు


హాసిని: ముందు చిట్టీ అడిగిన దానికి సమాధానం ఇవ్వాలి


లలితాదేవి: ఈ ధన త్రయోదశి రోజు లక్ష్మీ దేవికే కాదు యమధర్మరాజుకు కూడా పూజించాలి. యముడు దక్షిణ దిక్కుకు అధిపతి కాబట్టి బియ్యపుపిండితో చేసిన ప్రమిదలతో నిలువు ఒత్తులు వేసి నువ్వల నూనెతో దీపాలను వెలిగించాలి. 


గురువుగారు: ఈ దీపాల వలన సమవర్తి అయిన యముడు శాంతించి అకాల మృత్యువును దరిచేరనీయడని నమ్మకం


తిలోత్తమ: ఇప్పుడు అంత త్వరగా చచ్చేది ఎవరు


నయని: మీరు (అని నయని అనగానే అందరూ షాక్ అవుతారు) మీరు కావొచ్చు.. నేను కావొచ్చు.. బావగారు కావొచ్చు మృత్యువు ఎప్పుడు ఎవర్ని కబళిస్తుందో చెప్పలేం అత్తయ్య


విశాల్: అమ్మ నయని మాటలకు బాధపడకు. చావుకి కూడా దేవుడు ఉంటాడు. అది కూడా విముక్తి కోరుకుంటుంది. కానీ ప్రాణం ఉన్నంత వరకు అది ఖాళీగా ఉంటుంది. ప్రాణం పోయాక దాని పని అదిచేసుకొని పోతుంది. 


పావనామూర్తి: అది సరే అల్లుడు కొంపతీసి యముడు ఇంటివరకు రాడు కదా


విశాల్: రాకూడదు అనే కోరుకుందాం మామయ్య


గురువుగారు: కానీ వస్తాడు యముడు


డమ్మక్క: అకాల మృత్యు గండం ఈ ఇంట్లో ఒకర్ని చేరబోతుంది. 


గురువుగారు: శివభక్తులు వారు వాళ్లు అన్నదాంట్లో నిజం ఉంది. కచ్చితంగా ఎవరికి మృత్యు గండం ఉందో తెలుసుకోవచ్చు


సుమన: మా అక్కకి ముందే తెలిసిపోతుంది కదా స్వామి తెలిసి కూడా ఎందుకు చెప్పకుండా ఉంది. 


నయని: నిజంగా నాకు తెలీదు సుమన 


గురువుగారు: లలితా దేవి యమదీపం దానం చేస్తే ఒక ముత్తయిదువు స్వీకరించాలి. అప్పుడు మృత్యు గండం ఎవరికి ఉంది అనేది మీ అందరికీ తెలుస్తుంది. 


లలితాదేవి: తెలుసుకుంటే జాగ్రత్తపడే అవకాశం ఉంటుంది గురువుగారు. సుమన యమదీపం నీకు దానం చేస్తా రా సుమన అంగీకరించదు. హాసినికి పిలిస్తే నయనిని కూడా పిలుస్తుంది. అప్పుడు నయని నేను తీసుకుంటా అని తీసుకుంటుంది. ఇక డమ్మక్క గండం ఎవరికో తెలుస్తుంది చూడండి అంటుంది. అప్పుడు ఆ దీపం నుంచి పొగ వచ్చి అది గాయత్రి దేవి ఫొటో దగ్గరకు వెళ్తుంది. అందరూ షాక్ అవుతారు. 


ఇంతలో నయని స్వామి పెద్దత్తయ్య దగ్గరకు వెళ్లింది అంటే నా బిడ్డకే కదా ఆపద అంటే అవును అని అంటారు. ఇక లలితాదేవి ఏ పూజలు చేస్తారో ఎంత డబ్బు ఖర్చు అయినా సరే పసిబిడ్డగా ఉన్న తన చెల్లెలు గాయత్రికి ఏం జరగకూడదు అని చెప్తుంది. ఎద్దులయ్యకు పరిష్కారం అడిగితే విధిరాత మార్చలేము అంటారు. లలితాదేవి ముక్కంటిపురం వెళ్లి విశాలాక్షి అమ్మవారిని దర్శించుకుంటాఅని చెప్పి వెళ్లిపోతుంది. ఇక హాసిని గురువుగారి దగ్గరకి వెళ్లి దీన్ని తప్పించలేమా అని అడుగుతుంది. తప్పదు అని స్వామి చెప్పి వెళ్లి పోతారు.


మరోవైపు విక్రాంత్, సుమన గొడవపడతారు. ఇక విశాల్ గాయత్రి పాపను ఎత్తుకొని గతంలో తన తల్లి చనిపోయిన ఘటన గురించి మాట్లాడుతాడు. తన తల్లే తన కూతురిగా పుట్టిందని సంతోషపడుతున్నానని ఇప్పుడు తన తల్లి అయిన గాయత్రీ పాపకు ప్రాణ గండం ఉందని తెలిసి ఎలా కాపాడుకోవాలో తెలియడం లేదని బాధపడతాడు. ఇంతలో నయని అక్కడికి వస్తుంది. ఎవరితో మాట్లాడుతున్నారు అని అడిగితే తన తల్లితో మాట్లాడుతున్నానని సెల్‌లో ఫొటో చూపిస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.