Trinayani Today Episode గాయత్రీ పాప చున్నీ కోసం అందరూ పరుగులు తీసి ఒకరి మీద ఒకరు పడిపోతారు. ఇక ఆ చున్నీ బయటకు ఎగిరిపోతుంది. దీంతో నయని అమ్మగారి చిత్రాన్ని చూసే అదృష్టం కూడా తనకు లేదని బాధపడుతుంది. విశాల్ నయనికి సర్ది చెప్తాడు. త్వరలోనే అమ్మని చూస్తావని భరోసా ఇస్తాడు. 


డమ్మక్క: రాణి వచ్చే టైం దగ్గర పడింది పుత్ర. త్వరలోనే వచ్చేస్తుంది. 


హాసిని: విశాల్ దగ్గరకు చేట తీసుకొని వచ్చి దాని గురించి ప్రశిస్తుంది. దానితో విశాల్ డమ్మక్క ఇచ్చిందని చెప్తాడు. 


విశాల్: వదినా ఆ చున్నీ ఇప్పుడు ఎక్కడుందో తెలుసా. పక్క వీధిలోని అమ్మవారి గుడిలో పడింది. విశాలాక్షి అమ్మవారి మీద భారం వేయడం వల్ల అలా జరిగింది అనుకుంటా. ఈ విషయాలు ఏవీ ఎవరికీ చెప్పకు వదిన.


హాసిని: నో వే.. ఈ నిజాన్ని తెలుసుకోవడం చాలా కష్టం. 


విశాల్: ఎన్ని అవకాశాలు వచ్చినా ఎవరూ పసిగట్టలేకపోతున్నారు. 


మరోవైపు సుమన డ్రస్ పట్టుకొని వస్తుంది. అది చూసిన విక్రాంత్ ఏంటని ప్రశ్నించడంతో తన అక్క గది నుంచి డ్రస్ తీసుకొని వచ్చానని చెప్తుంది. దీంతో విక్రాంత్ పర్మిషన్ లేకుండా నయని గదిలోకి వెళ్లినందుకు సుమనను తిడతాడు. 


సుమన: నేను చెప్పేది వినండి అసలు ఈ డ్రస్ మా అక్క అయినా మీ బ్రో అయినా ఎవరి కోసం తీసుకొచ్చారో తెలుసా.


విక్రాంత్: గానవి కోసమో గాయత్రీ కోసమో తీసుకొచ్చుంటారు. 


సుమన: తీసుకొచ్చే వాళ్లు ఎప్పుడో ఒకసారి వాళ్లకు వేస్తారు. కానీ ఇప్పటి వరకు వాళ్లకి ఈ డ్రస్ వేయడం నేను చూడలేదు. అయినా దీన్ని మంచం కింద దాచిపెట్టారు. 


విక్రాంత్: పొరపాటున పిల్లలు బెడ్ కింద పడేసుంటారు. అది ఇప్పుడు నీ పాపిష్టి కళ్లకు కనపడింది. ఎక్కువ వాగకుండా ఇది వదినకు ఇచ్చేసి రా. 


సుమన: నాకేం అవసరం లేదు.(సుమన డ్రస్ విసిరేస్తుంది)


ఇంతలో విశాల్ ఇంటికి కొరియర్ వస్తుంది. దానితో సుమన, వల్లభ, దురంధరలు నాది అంటే నాది అని ఎగబడతారు. ఇంతలో విశాల్ వచ్చి ఎవరి పేరు మీద వచ్చిందని అడుగుతాడు. దీంతో గుర్రపుకొండ అని చెప్తాడు. దీంత అందరూ ఆలోచనలో పడతారు. 


ఇంతలో డమ్మక్క ఎవరో ఏం పేరో.. ఎవరు పంపించారో.. అన్ని విషయాలు లోపల ఉండొచ్చేమో అని అంటుంది. ఇక హాసిని పార్శిల్‌ తీసుకుంటుంది. పార్శిల్‌ని ఓపెన్ చేస్తే అందులో గుర్రం కాలు బొమ్మలు ఉంటాయి. అంతే కాకుండా గుర్రం సౌండ్ కూడా వస్తుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. ఇక ఆ బాక్స్‌లో లెటర్‌ని హాసిని చూస్తుంది. దాన్ని నయని తీసుకొని చదువుతుంది. 


లెటర్‌లో ఏముందంటే..


"ప్రియమైన శత్రువుకు..


నిన్ను వెంటాడే పీడ కల రాయునది. జీడీ ఎస్టేట్స్‌లో జరిగిన సంఘటన నువ్వు మర్చిపోయి హాయిగా బతికేస్తున్నావని తెలిసి ఈ ఉత్తరం రాశాను. సరిగ్గా 22 ఏళ్ల క్రితం మే నెల చంద్రుడు విశాఖ నక్షత్రంలో కలిసిన రోజు నువ్వేం చేశావో.. అదే నేనూ చేయబోతున్నా.. సిద్ధంగా ఉండు..
ఇట్లు.. నీ వా... యు.. "అని అంటుంది. 


నయని లెటర్ చదవగానే వాయు అంటూ తిలోత్తమ షాక్ అయిపోతుంది. 


హాసిని: ఆ మాట వినగానే అత్తయ్యకు చెమటలు పట్టేశాయి ఏంటి. 


సుమన: అత్తయ్య వాయు ఎవరు మీ చుట్టమా.. విరోధా. 


వల్లభ: అరే ఆ లెటర్ మా మమ్మీకే రాశారని మీరు ఎలా అనుకుంటారు. 


నయని: వాయు అనగానే అదిరిపడింది అత్తయ్య. 


తిలోత్తమ: వాయు మనిషి కాదు అది గుర్రం. 


విశాల్: వాయుని మా అమ్మ గాయత్రీ దేవి ఎంతో అపురూపంగా చూసుకుంది. 22 ఏళ్ల క్రితం అది అనుమానస్పద స్థితిలో చనిపోయింది. కేసు పెట్టాలని అమ్మ అనుకుంది కాని ఎస్టేట్ గురించి చెప్పడం అమ్మకు ఇష్టం లేక కంప్లైంట్ ఇవ్వలేదు. 


నయని: అది సరే బాబుగారు మరి ఆ గుర్రం పేరుతో ఈ లెటర్ ఎవరు రాసి ఉంటారు. 


విశాల్: నాకు తెలీదు.


సుమన: చేతి రాత బట్టి తెలుసుకోలేమా.


విశాల్: తెలీదు..


డమ్మక్క: ఇది తిలోత్తమ అమ్మకే వచ్చింది. కానీ ఇక్కడి విషయం ఏంటంటే..గుర్రాన్ని నిన్ను కన్న తల్లి ప్రేమించినప్పుడు అదే గుర్రం ఈవిడని ఎందుకు శత్రువుగా భావిస్తుంది. 


వల్లభ: ఓ డమ్మక్క గుర్రం పేరుతో మా అమ్మని ఎవరో బెదిరించాలి అని చూస్తున్నారు.


విక్రాంత్: బ్రో ఎస్టేట్, గుర్రపు కొండ అంటే ఇంకా అక్కడ ఎవరున్నారు బ్రో.


విశాల్: వాచ్ మాన్‌లు తప్ప ఇంకా ఎవరూ లేరు. వాళ్ల వయసు కూడా మీద పడింది. 


తిలోత్తమ: విశాలాక్షి కాళ్లకు బదులు గుర్రం కాలు కనిపించి నన్ను గుండెల మీద తన్నాయి. ఇప్పుడు గుర్రం కాలు బోమ్మ అంటే ఎవరో కావాలనే టార్గట్ చేసుకొని ఇదంతా చేస్తున్నారు. వాళ్లు ఎవరో తెలియాలి నేను ఏం చేస్తానో నాకే తెలీదు.


నయని: ఆవేశ పడకండి అత్తయ్య.


విక్రాంత్: బ్రో ఆ ఎస్టేట్ గురించి నాకు మొత్తం తెలుసుకోవాలి అని ఉంది.


మరోవైపు తిలోత్తమ, వల్లభలు అఖండ స్వామి దగ్గరకు వస్తారు.  దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: విజయ్‌ దేవరకొండ హీరోయిన్‌ ఘాటు అందాల షో - యషికాను ఇలా చూస్తే మతిపోవాల్సిందే