Trinayani Today Episode : గంటలమ్మ గాయత్రీ దేవి ఆత్మను రప్పిస్తాను అని అందరికీ చెప్తుంది. హాల్‌లో ముగ్గు వేసి మంత్రాలు చదువుతుంది. ఇక హాసిని విశాల్‌కు గంటలమ్మ గురించి చెప్పడంతో విశాల్ పసి బిడ్డగా ఉన్న తన తల్లిని గదిలో పెట్టి తాళం వేసి రావొద్దని చెప్తాడు. గంటలమ్మ మంత్రాలకు పాప మూర్ఛపోయి దాని నుంచి గాయత్రీ దేవి ఆత్మ బయటకు వస్తుంది. హాల్ గంటలమ్మ పెట్టిన దీపం ఆరిపోతుంది. పసుపు, కుంకుమలు ఎగిరిపోతాయి. ఇక గాయత్రీ దేవి ఆత్మ గాయత్రీ పాప పడుకొని ఉంటే తన మనసులో మాటలు చెప్తుంది.


గాయత్రీ దేవి: ఇక్కడ గత జన్మలో నేనుగా అక్కడ పునర్జనలో నువ్వుగా దేహం మారింది కానీ ఆత్మ ఒక్కటే గాయత్రీ. విశాలాక్షి అమ్మవారికి నా మీద దయ ఉంటే నా ఆత్మకు ఆశ్రయం ఇచ్చిన నీ రూపాన్ని..  నీ దేహాన్ని ఒకే ఒక్కసారి నా చేతుల్లోకి తీసుకొని ముద్దాడాలి అని ఉంది. అంటూ గాయత్రీ దేవి ఆత్మ గాయత్రీ పాప దగ్గర కూర్చొని పాపని తాకగానే స్పర్శ తెలుస్తుంది. దీంతో గాయత్రీ దేవి ఏమోషనల్ అయి పాపని ముద్దాడుతుంది. అత్త అయిన నేను నయని కడుపులో బిడ్డగా పుట్టి కోడలిని అమ్మని దేహం చేసిన దేహం నీది చిట్టి తల్లి. 


మరోవైపు గంటలమ్మ మంత్రాలు చదువుతుంది. ఆ మంత్రాలకు గాయత్రీ దేవి బయటకు వెళ్తుంది. పెద్ద గాలి వీస్తుంది. మెట్ల మీద నుంచి గాయత్రీ దేవి కిందకి దిగుతూ ఉంటుంది. దాన్ని గంటలమ్మ చూస్తుంది. నయని కూడా తన అత్త అయిన గాయత్రీ దేవి ఆత్మని చూస్తుంది. చూస్తూ సంతోషంలో అలాగే ఉండిపోతుంది. 


విశాల్: అన్నయ్య చూస్తున్నావ్ కదా.


వల్లభ: ఏం చూడలేకపోతున్నా తంబి.


విశాల్: ఇలాంటి వారిని తీసుకొచ్చి పూజలు చేయిస్తే ఇలాగే ఉంటుంది. 


హాసిని: అత్తయ్య రావడం ఏమో కానీ మనం పోయేలా ఉన్నాం.


నయని: అమ్మగారు.. అందరూ షాక్ అయిపోతారు. నయనికి మాత్రమే గాయత్రీ దేవి కనిపిస్తుంది. అమ్మగారు అని గట్టిగట్టిగా అరుస్తుంది. బాబుగారు బాబుగారు అమ్మగారు వస్తున్నారు బాబుగారు.


విశాల్: అమ్మా.. అవునా ఎక్కడ నయని.


నయని: మెట్లు మెట్టు దిగుతూ వస్తున్నారు.


విశాల్: మాకు కనిపించడం లేదు ఏంటి అక్క.


గంటలమ్మ: నాకు మీ అక్కకి తప్ప ఆత్మ మీ ఎవరికీ కనిపించదు.


నయని: అమ్మగారు నా బిడ్డగా వస్తాను అన్న మీరు మళ్లీ ఆత్మగా ఎందుకు వచ్చారు అమ్మ. ఏం జరిగిందో చెప్పండి అమ్మగారు.


గాయత్రీదేవి: వివరంగా చెప్పే టైం లేదు నయని. పునర్జన్మ ఎత్తిన నా దేహాన్ని కూడా హాని తలపెట్టే ఇలాంటి మంత్రగత్తెలను ఇక్కడి నుంచి పంపించేయాలి. 


గంటలమ్మ: రా గాయత్రీదేవి రా.. నీ లాంటి ఆత్మలను స్వాధీన రేఖలోకి లాక్కోవడమే నా పని. 


గాయత్రీదేవి: ఏయ్ నోర్ముయ్. నూరేళ్ల నా ఆయుష్షుని అర్థాంతరంగా హరించి వేసిన దుర్మార్గురాలు తిలోత్తమ. తన మీద ప్రతీకారం తీర్చుకోవాలి అని నా కోడలి కడుపున పునర్జన్మ ఎత్తిన నన్ను బంధించాలి అని చూస్తావా. 


విశాల్: అమ్మ ఆత్మ చూసే అదృష్టం నాకు లేదు. కానీ నా బిడ్డగా ఎలా ఉందో ఏమైందో. 


గంటలమ్మ గాయత్రీదేవి ఆత్మను బంధించాలి అని మంత్రాలు చదివితే గాయత్రీదేవి గంటలమ్మ చేయి పట్టుకుంటుంది. దీంతో గంటలమ్మ నువ్వు ఆత్మవి కాదా ప్రాణాలతో ఉన్నావా. ప్రాణాలతో ఉంటేనే నన్ను పట్టుకోగలవు అని అంటుంది. గంటలమ్మ మాటలకు అందరూ షాక్ అవుతారు. గాయత్రీదేవి నవ్వుతూ నేను ఆత్మనే అని అంటుంది. 


గాయత్రీదేవి:  విశాలాక్షి అమ్మ అంశతో పుట్టిన నా కోడలు ఆత్మనైన నన్ను నా చేయి పట్టుకోగలిగినప్పుడు నేను నీ చేయి ఏంటి నీ గొంతు అయినా పట్టుకోగలను. (నయని గాయత్రీదేవి చేయి పట్టుకొని ఉంటుంది.) 


విశాల్: నయని ఏం జరుగుతుందో మాకు అర్థం కావడం లేదు.


నయని: అమ్మగారి చేయి నేను పట్టుకున్నాను. నా బిడ్డ చేయి నేను పట్టుకున్నాను. 


గంటలమ్మ: బిడ్డా..


గాయత్రీదేవి: నా కడుపున నా బిడ్డ పుడితే నా కోడలి కడుపున నేను పుట్టాను. నన్ను బంధించి పునర్జన్మలో నా దేహాన్ని విచ్ఛిన్నం చేయాలి అని చూస్తే నిన్ను ఏం చేస్తానో నాకే తెలీదు. 


గంటలమ్మ: ఏయ్ దగ్గరకు రాకు మంత్ర దండంతో నిన్ను కొట్టాను అంటే మళ్లీ నీ శరీరంలోకి నువ్వు వెళ్లలేవు.


గాయత్రీదేవి:  ఏం చేస్తావ్ నువ్వు.. అంటూ ముందుకు వెళ్తుంది. నయని కూడా ముందుకు వెళ్తుంది. 


గంటలమ్మ మంత్రదండంతో గాయత్రీదేవిని కొట్టబోతే నయని మంత్ర దండం పట్టుకుంటుంది. అందరూ బిత్తరపోయి చూస్తారు.ఇక గాయత్రీదేవి నయనితో స్వాధీన రేఖ మీద ఉన్న గుమ్మడి కాయ పగలగొట్టి ముగ్గు చెరిపేయమని చెప్పమంటుంది. నయని అలాగే విశాల్‌కు చెప్తుంది. వద్దు అని గంటలమ్మ అరుస్తుంది. విశాల్ అలానే చేస్తాడు. భంగం అయిందని గంటలమ్మ అరుస్తుంది. నయని గంటలమ్మని వెళ్లగొట్టేస్తుంది. గంటలమ్మ వెళ్లిపోతుంది. ఇక గాయత్రీదేవి ఆత్మ నయని చేయి వదిలించుకొని విశాల్‌ని దగ్గరకు వెళ్తుంది. ప్రేమగా చూస్తూ పైకి వెళ్లిపోతుంది. ఇక నయని కూడా అమ్మగారు అంటూ ఎమోషనల్‌గా వెతుకుతుంది. 



విక్రాంత్ దగ్గరకు దురంధర, సుమన వస్తారు. గాయత్రీ దేవి ఆత్మ వచ్చిందని దాని గురించి మాట్లాడకుండా నీ పని నువ్వు చేసుకుంటున్నావ్ ఏంటి అని అడుగుతుంది. ఇక సుమన ఆత్మ కనిపించింది అంటే పాపగా పుట్టిన గాయత్రీదేవి చనిపోయిందని అంటుంది. విక్రాంత్ సుమనను తిడతాడు. దురంధర కూడా సుమనను తిడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: సత్యభామ సీరియల్: సత్య మనసులో మాటలు విని కుప్పకూలిపోయిన క్రిష్.. కలిసుందామన్న హర్షని హర్ట్ చేసిన నందిని!