Krishna Mukunda Murari Today Episode : రేవతి భవాని దగ్గర పల్లకీ సేవలో అమ్మవారి విగ్రహం దొర్లిపోవడం గురించి చెప్పి బాధ పడుతుంది. మీరాని అనవసరంగా ఇంటికి తీసుకొచ్చాను అని అంటుంది. ఇక మురారికి కృష్ణ గురించి ఎలా చెప్పాలని అది ఆలోచించమని రేవతి అంటుంది. అయితే భవాని తనకు కృష్ణ గురించి ఏ ఆలోచన లేదని కానీ ముకుంద బయటకు వెళ్లింది కాబట్టి ఏం చేస్తుందా అని భయం వేస్తుందని చెప్తుంది. 


కృష్ణ: ముకుందతో కలిసి కారులో ఇంటికి వస్తూ.. నేను నీకు ఏం అన్యాయం చేశాను ఎందుకు ఇలా నన్ను వేధిస్తున్నావ్. రూపం మార్చుకొని వచ్చి హింసించే అంత పగ నా మీద ఎందుకు. 


ముకుంద: నువ్వు నాకు ఏ అన్యాయం చేయలేదు కృష్ణ. నాకు జరగాల్సిన న్యాయానికి అడ్డుగా ఉన్నావ్. ఆ అడ్డుని తొలగించుకోవాలి అని చూస్తున్నాను అంతే. జీవితంలో నువ్వు చేసిన పెద్ద తప్పు ఏంటో తెలుసా నా మురారిని నువ్వు పెళ్లి చేసుకోవడం. అంత కంటే ఇంకా పెద్ద తప్పు ఏంటో తెలుసా. మురారిని ఇంకా వదిలేయకుండా అంటి పెట్టుకొని ఉండటం. నేను ఎంత కన్నింగ్‌గా ఆలోచిస్తానో నీకు తెలుసు. ఈ రూపం మార్చుకోవడానికి యాక్సిడెంట్ చేయించుకున్నాను. ఒక వేళ నా ప్రాణం పోయి ఉంటే అది నా ప్రేమ. మురారి కోసం ప్రాణం అయినా ఇస్తా. 


కృష్ణ: దీన్ని బరి తెగింపు అంటాడు. నీ స్థానంలో నేను ఉంటే నీలా చేసేదాన్ని కాదు నా రాత ఇంతే అని వదిలి వెళ్లిపోయేదాన్ని.


ముకుంద: ఇప్పుడు వెళ్లిపో. ఇప్పటికైనా మించిపోయేది లేదు. ఇప్పుడే నీ పుట్టింటికి వెళ్లిపో. ఇప్పుడు నువ్వు వెళ్లిపోతే కాస్త సంతోషంగా అయినా ఉంటావ్. ఇంటికి వచ్చి ఇబ్బందుల పాలవ్వకు.


కృష్ణ: నువ్వు నన్ను ఏం చేయలేవు ముకుంద.


మురారి గురించి అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. భవాని పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది. రజిని వదినలను దెప్పిపొడుపు మాటలు మాట్లాడుతుంది. ఇంతలో పోలీసులు ఇంటికి వస్తారు. భవాని పోలీసులకు మురారి గురించి అడుగుతుంది. పోలీసులు తొందరలోనే తెలుసుకుంటామని అంటారు. ఇంతలో ముకుంద, కృష్ణ ఇంటికి వస్తారు. పోలీసుల్ని చూసి కృష్ణ షాక్ అవుతుంది. 


భవాని: మనసులో.. మీరా కృష్ణతో కలిసి వచ్చిందేంటి. నిజం చెప్పేసిందా.


రజిని: వచ్చావా నీ కోసమే అందరం ఎదురు చూస్తున్నాం. ఉన్నట్టుండి కనిపించకపోతే మురారితో కలిసి ఎక్కడికైనా చెక్కేశావ్ అనుకున్నాం. కృష్ణని తీసుకొని వచ్చావా.


కృష్ణ: ఏం మాట్లాడుతున్నారు పిన్ని. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది. మిమల్ని చూసినప్పుడే నాకు అర్థమైంది ఏదో జరిగింది అని. 


పోలీసులు: ఏసీపీ సార్ గత మూడు రోజులుగా కనిపించడం లేదు మేడమ్. ఎక్కడికి వెళ్లారో ఎవరికీ తెలీదు. 


కృష్ణ: ఏసీపీ సార్ ఎక్కడికో వెళ్లిపోవడం ఏంటి. పెద్దత్తయ్య ఏం మాట్లాడుతున్నారేంటి ఈయన. మాట్లాడరేంటి పెద్దత్తయ్య. అత్తయ్య మీరు అయినా చెప్పండి. రెండు రోజులు నుంచి ఏసీపీ సార్ కాల్ లిఫ్ట్ చేయకపోతే బిజీగా ఉన్నారని చెప్పారు అత్తయ్య కానీ ఇప్పుడు కనిపించడం లేదు అంటున్నారు ఏంటి. మధు ఏసీపీ సార్‌కి ఏమైంది. అత్తయ్య మీరు మౌనంగా ఉంటే నాకు భయంగా ఉంది చెప్పండి ఏమైంది. ఎందుకు ఎవరూ మాట్లాడటం లేదు. ఏసీపీ సార్‌కి ఏమైంది.


ఆదర్శ్‌: నేను చెప్తాను. మీ ఏసీపీ సార్‌కి ఏమైపోలేదు. వాడే ఈ మీరాని గర్భవతిని చేసి ఎక్కడికో పారిపోయాడు. 


జిని: నీ మొగుడి మీద అంత పెద్ద అభాండం వేస్తే ఖండిచకుండా అలా ఉండిపోయావ్ అంటే మురారి అలా చేశాడు అంటే నువ్వు నమ్ముతున్నావా.


కృష్ణ: మనసులో.. ముకుంద ఇంత చేస్తే ఏసీపీ సార్ ఏం చేశారు. కనీసం నా దగ్గరకు అయినా రావాలి కాదా.


పోలీస్ భవానిని బయటకు పిలిచి మురారి ఎవర్నో గర్భవతిని చేశారు అంటున్నారు. అంటే మిమల్ని ఫేస్ చేయలేకే ఆయన వెళ్లిపోయి ఉంటారు. ఆయన ఎక్కడైనా ఏదైనా నోట్ పెట్టి ఉంటారు. వెతకండి మేడమ్.  కృష్ణ రేవతి ఏడుస్తుంటే అక్కడికి వెళ్లి మీకు మీ కొడుకు మీద నమ్మకం లేదు కానీ నాకు నా భర్త మీద నమ్మకం ఉందని చెప్తుంది. మీరా గర్భవతి అని తెలియగానే ఇంటి నుంచి వెళ్లిపోయాడు అని ఎవరికైనా అనుమానం వస్తుందని అంటుంది. మీరా డీఎన్‌ఏ టెస్ట్ చేయమని చెప్పిందని ఇంత కచ్చితంగా చెప్తే ఎవరికైనా అనుమానం వస్తుందని అంటుంది. కృష్ణకు మీరా కడుపులో ఉన్నది తన బిడ్డ అని తెలుసు కాబట్టి నిజాలు త్వరలో బయట పడతాయని ధైర్యం చెప్తుంది.


మరోవైపు భవాని మురారి గదికి వెళ్తుంది. అక్కడ మురారి ఏదైనా నోట్ రాసి ఉంటాడేమో అని వెతుకుతుంది. టేబుల్ మీద హాస్పిటల్ ఫైల్ కనిపించి చూస్తుంది. అది చూసి కుప్పకూలిపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: కార్తీకదీపం 2 సీరియల్: శౌర్యకు పాటలు నేర్పిన దీప, ఫిదా అయిన కార్తీక్.. శ్రీధర్‌, కావేరిల సంబంధం కార్తీక్‌కి తెలిసిపోయిందా!