karthika deepam idi nava vasantham serial today episode : కాంచన ఇంట్లో లేకపోవడంతో శ్రీధర్ కావేరికి కాల్ చేసి మాట్లాడుతూ ఉంటారు. కార్తీక్ రావడంతో కంగారుగా ఫోన్ కట్ చేసేస్తాడు. తండ్రి కంగారు చూసిన కార్తీక్ ఏమైందని అడిగి ఫోన్ తీసుకొంటాడు. తన దగ్గరే సీక్రెట్స్ దాచావా అని అడుగుతాడు. శ్రీధర్ అలా ఏం లేదు అని చెప్తాడు. 


కార్తీక్: అయితే నువ్వు లాస్ట్‌ కాల్ చేసిన నెంబరుకి నేను ఫోన్ చేసి మాట్లాడొచ్చా. 


శ్రీధర్: వీడు ఇంత కచ్చితంగా అడుగుతున్నాడు అంటే ఫోన్‌లో మాట్లాడింది అంతా వినేశాడా. దీప వీడితో నిజం చెప్పేసిందా. 


కార్తీక్: ఏంటి మాస్టారూ అలా ఫ్రీజ్ అయిపోయావు. ఈ రోజు ఏమైంది వరసపెట్టి సిగరెట్లు తాగుతున్నావు. అమ్మ లేదు అని ఎంజాయ్ చేస్తున్నావా. అయితే నేను ఫోన్ చేయొచ్చా.


శ్రీధర్: నా మీద నమ్మకం లేకపోతే చేయొచ్చు. 


కార్తీక్: నేను ఏదో సరదాగా అంటే నమ్మకం లేదా అంటావ్ ఏంటి మాస్టారూ.. టీనేజ్ పిల్లాడు తండ్రికి భయపడి ఫోన్ కట్ చేసినట్లు నన్ను చూసి కాల్ కట్ చేసేశావ్. 


శ్రీధర్: రేయ్ ఏమైందిరా నీకు ఏదేదో మాట్లాడుతున్నావ్.


కార్తీక్: మాస్టారూ నువ్ కట్ చేసిన కాల్‌కి, తాగిన సిగరెట్లకు మీ మూడ్‌కి ఏదో సంబంధం ఉంది. నిజం చెప్పండి మాస్టారూ. పెళ్లికి ముందు నీకు లవ్ ఉందా.


శ్రీధర్: ఉందిరా కాంచన పేరు. వరసకు నీకు అమ్మ అవుతుంది. కొన్ని సార్లు అవకాశం దొరికినా నిజం చెప్పడం చాలా కష్టం దాయడం ఇంకా కష్టం. 


కార్తీక్: అమ్మని ఎంతలా ప్రేమించే ఈ గుణమే నీలో నాకు బాగా ఇష్టం నాన్న.


శ్రీధర్: మనసులో.. మీ పిన్ని గురించి తెలిస్తే ఏమైపోతావో.


కార్తీక్: భర్త అంటే నీలా ఉండాలి నాన్న. మీలాంటి వ్యక్తిని నేను చూడలేదు. అమ్మ చాలా లక్కీ. నేను కూడా నాకు కాబోయే భార్య మీద ఇంత ప్రేమ చూపించలేను.


శ్రీధర్: నేను ఏ తప్పు చేశానో తెలిస్తే నీ లైఫ్‌లో చూసిన వరస్ట్ హజ్బండ్‌గా నేను కనిపిస్తాను.


శౌర్యకు చాలా ఆకలి వేస్తుంది. దీప ఫుడ్ తీసుకురావడం చూసి పడుకున్నట్లు నటిస్తుంది. దీప కావాలనే నువ్వు పడుకుంటున్నావా అయితే నేను బయటకు వెళ్లి తింటాను అని అంటుంది. దాంతో శౌర్య తనకి తనిపించమని అంటుంది. దీప శౌర్యకు తినిపిస్తూ తన తండ్రిని గుర్తు చేసుకొని ఎమోషనల్ అవుతుంది. దాంతో శౌర్య నేను నిన్ను తాతయ్యలా చూసుకుంటానమ్మా అంటూ దీపకు గోరు ముద్దలు తినిపిస్తుంది. దీంతో దీప ఏడుస్తుంది. తర్వాత ఇద్దరూ నవ్వుకుంటారు. శౌర్య తనకు పాటలు నేర్పించమని తల్లిని అడుగుతుంది.


 ఉదయం శౌర్య స్కూల్‌కి రెడీ అయి దేవుడికి దండం పెట్టుకుంటుంది. తన తల్లి కోరిక మీద కలెక్టర్ అవ్వాలని అనుకుంటుంది. ఇక పోటీలు ఉన్నాయని తనకి పాట నేర్పమని శౌర్య అడిగితే దీప పాట పాడుతుంది. ఆ పాట విని కార్తీక్ చూస్తాడు. దీప పాటలు కూడా పాడుతుందా అని అనుకొంటాడు. 


కార్తీక్: దీపకు వంటలే అనుకున్నా ఈ టాలెంట్ కూడా ఉందా. సందర్భం వచ్చినప్పుడు పొగడాలి. ఇంట్లో అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక జ్యోత్స్న తన అత్త కాంచనను పట్టుకొని ఉంటే శివనారాయణ చిన్నప్పుడు జ్యోత్స్న బాగా అల్లరి చేసేది అని దానికి నువ్వే భరించేదానివి అని కాంచనతో అంటాడు. ఇక కార్తీక్ అక్కడికి వస్తాడు. కాంచన పచ్చళ్లు చేయమని అడిగితే సుమిత్ర దీపని పిలవమని అంటుంది. ఇక జ్యోత్స్న మనసులో దీపని చూడటం తనకు ఇష్టం లేదని తన తల్లి మాత్రం అన్నింటికి దీపనే పిలుస్తుందని తిట్టుకుంటుంది. ఇక సుమిత్ర దీపతో పచ్చళ్లు పెట్టమని అడుగుతుంది. దీప సరే అంటుంది. ఇక కార్తీక్ కాంచనను వెళ్లిపోదామని అంటాడు. ఇక దశరథ్ నిన్న శ్రీధర్ కంగారుగా వెళ్లిపోయాడని ఎందుకని అనుకుంటారు. దీప ఆగి ఆలోచిస్తూ ఉంటుంది. దీపని కార్తీక్ గమనిస్తాడు. ఇక కార్తీక్ తన మామయ్యతో ఇక్కడే ఉంటే తన రహస్యం బయటపడిపోతుందని వెళ్లిపోయాడు అని అంటే దీప షాకింగ్‌గా చూస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: 'నాగ పంచమి' సీరియల్: పంచమి పిల్లల మీద కరాళి సంజీవని ప్రయోగం.. కీడు జరుగుతుందన్న పంచమి!