Seethe Ramudi Katnam Today Episode : విద్యాదేవి సీత కోసం భరతనాట్యం డ్రెస్ కుడుతుంది. సీత అక్కడికి వచ్చి చూసి తన కోసం తన టీచర్ డ్రెస్ కుడుతున్నారని తెలుసుకొని ఎమోషనల్ అయిపోతుంది. సీత కోసం విద్యాదేవి చేస్తున్నవాటికి సీత తనకు విద్యాదేవి కన్న తల్లిలా తన అత్తమ్మలా కనిపిస్తున్నారని అంటుంది.  


సీత: మా సుమతి అత్తమ్మ బతికే ఉండి ఉంటే మీలాగే సాయం చేసేది. నన్ను గెలిపించేది. నా కనీళ్లు తుడిచేది. నాకు అండగా ఉండేది.


విద్యాదేవి: అయితే నన్నే మీ సుమతి అత్తయ్య అనుకో. అది నాకు కూడా సంతోషమే కదా.


సీత: మీరు నాకు మా అత్తమ్మ పంపించిన దేవత టీచర్. 


విద్యాదేవి: డ్యాన్స్ పోటీ రేపే కదా వెళ్లు ప్రశాంతంగా పడుకో. నేను నిజంగా మీ మేనత్తనే సీత. నువ్వు ప్రేమగా పిలిచే మీ అత్తమ్మనే. ఈ నిజం నీకు చెప్పే రోజు తొందరలోనే ఉంది. 


ఉదయం భరత నాట్యం పోటీలకు ఏర్పాట్లు జరుగుతాయి. మహాలక్ష్మి వాళ్లు నటరాజు ముందు పువ్వులు, పసుపు, కుంకుమ స్థానంలో కారం పొడి పెడతారు. 


మహాలక్ష్మి: అందరూ ఇది కుంకుమ అనుకుంటారు. కారం అని ఎవరికీ అనుమానం రాదు.


అర్చన: అవును మహా. మన పిల్లల చేతిలో సీత ఓడిపోతే సరే సరే. ఒకవేళ సీత గెలిచే అవకాశాలు ఉంటే దాన్ని కళ్లల్లో ఆ కారం కొట్టాలి.


గిరిధర్: సీత ఒకవేళ ఓడిపోయినా మనం ఆ కారం కళ్లలో కొట్టాలి.


జనార్థన్: సీత ఓడిపోతే ఏడుస్తుంది. మళ్లీ మనం కారం కొట్టడం ఎందుకు. 


మహాలక్ష్మి: మనసులో ఓడితే సీత ఒక్కర్తే కాదు తన వాళ్లు మొత్తం ఏడుస్తారు.


శివకృష్ణ: ఈ రోజు మహాలక్ష్మి ఇంటి దగ్గర భరత నాట్యం పోటీలు అవుతాయి. సీత గెలిస్తే మధు మన ఇంటికి వస్తుంది. సీత ఓడిపోతే భర్తని వదిలేసి శాశ్వతంగా మన ఇంటికి వచ్చేస్తుంది. 


శివతల్లి: మధుని బలవంతంగా తీసుకొని వచ్చి ఉంటే ఇదంతా జరిగేది కాదు.


లలిత: మేం వెళ్లే సరికి పరిస్థితి అంతా చేయి జారిపోయింది. 


రామ్‌: తనలో తాను.. కోపంగా.. సీతా...


సీత భరతనాట్యం వేయడానికి రెడీ అయి వస్తుంది. రామ్ కోపంగా చూస్తాడు. సీతతో మాట్లాడదు. సీత మాత్రం కాసేపటిలో పోటీ మొదలవుతుందని రామ్ మాట్లాడకుంటే బాధగా ఉంటుందని ఎమోషనల్‌గా చెప్తుంది. 


సీత: మామ నీతో చెప్పకుండా పందెం కాయడం నా తప్పే. ఆ విషయంతో నీ మనసు కష్టపెట్టి ఉంటే నన్ను క్షమించమని వేడుకుంటున్నాను. నేను ఈ పోటీలో పాల్గొన్నది మా అక్క జీవితం నిలబెట్టాలి అనే తప్ప నిన్ను ఇబ్బంది పెట్టాలి అని కాదు మామా. నీకు దూరం అవుదామని కాదు. దయచేసి మాట్లాడు మామ.


రామ్: ఈ పోటీల్లో నువ్వు గెలుస్తావ్ అనే నమ్మకం ఏంటి. 


సీత: నువ్వు నా వైపు ఉన్నావ్ కదా మామ. నువ్వే నా ధైర్యం. నాకు డ్యాన్స్ నేర్పించడానికి మంచి టీచర్‌ని తెచ్చావ్. నాకోసం గజ్జెలు తెచ్చావు. ఇప్పుడు నాతో కోపంగా ఉన్నా నేను గెలవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటావు. అందుకే నన్ను ఆశీర్వదించు మామ. 


రామ్: సీత కాళ్లకు దండం పెడితే లేచి నిలబడి.. ఈ పోటీలో నువ్వు ఓడిపోతే నిన్ను జీవితంలో క్షమించను సీత. 


సీత: అంటే నేను గెలవాలి అనే కదా మామ. ఒక్కటి గుర్తు పెట్టుకో మామ ఈ సీత ప్రాణం అయినా వదులుతుంది. కానీ తన రాముడిని మాత్రం వదలదు. నీ మీద ఒట్టేసి చెప్తున్నా నేనే గెలుస్తాను. ఈ రాముడికి సీత మాత్రమే సొంతం. రామ్ ఏడుస్తాడు.


ప్రీతి, ఉషలు కూడా అందంగా రెడీ అవుతారు. మహా, అర్చన వాళ్ల దగ్గరికి వచ్చి ఈ పోటీ మన పరువుకి సంబంధించినదని మీరు గెలిస్తే సీత ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయి మీకు ఇష్టమైన మధుమిత వదినగా ఉండిపోతుందని చెప్తారు. ధైర్యంగా డ్యాన్స్ చేయమని అంటారు. మహా వాళ్లు కారం గురించి మాట్లాడుకుంటే మధు వస్తుంది. అందరూ కవర్ చేస్తారు. 


మధు: ఈ మాట నేను మీకు చెప్పొచ్చో లేదో నాకు తెలీదు కానీ చెప్తున్నా. మీ కోడలిగా ముందు నేనే వచ్చిఉంటే బాగుండేది.


మహాలక్ష్మి: నీ నోటి నుంచి ఈ మాట కోసమే మేం ఎదురు చూస్తున్నాం మధు. లేటుగా అయినా చెప్పావ్. జరగబోయేది అదే. పోటీలో సీత అవుట్ అవుతుంది. నువ్వు కోడలివి అవుతావ్. 


సీత విద్యాదేవి దగ్గర రామ్‌కి తన మీద కోపం తగ్గలేదు అని బాధపడుతుంది. చలపతి, రేవతి, విద్యాదేవి సీతకి ధైర్యం చెప్తారు. మధు వెళ్లిపోయి సూర్యతో కలిసి ఉంటుందని నువ్వే గెలుస్తావని చెప్తారు. చక్కగా డ్యాన్స్ చేయమని చెప్తారు. పోటీలకు అంతా సద్ధమవుతారు. పోటీలు మొదలవుతాయి. జడ్జిగా నేను ఉంటాను అని విద్యాదేవి అంటుంది. మహాలక్ష్మి పక్షపాతం ఉంటుందని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: 'నాగ పంచమి' సీరియల్: పంచమి పిల్లల మీద కరాళి సంజీవని ప్రయోగం.. కీడు జరుగుతుందన్న పంచమి!