Satyabhama Today Episode: క్రిష్, సత్యలను ఒకటి చేయడానికి చక్రవర్తి పార్టీ ఏర్పాటు చేస్తాడు. పార్టీలో పోటీ ఉందని గెలిచిన వారికి రాధాకృష్ణుల బొమ్మ గిఫ్ట్‌గా ఇస్తాను అని చెప్తాడు. ఆ బొమ్మలో క్రిష్ తనని సత్యని ఊహించుకుంటాడు. ఇక చక్రవర్తి ఒక గాజు బౌల్‌లో కొన్న చిట్టీలు వేస్తాడు. వాటిలో వచ్చినట్లు నటించాలని చెప్తాడు. అన్ని జంటలు సరే అంటారు.
ముందు ఓ జంటని పిలుస్తాడు చక్రవర్తి. భార్య ఇష్టాలు రాయమని అంటాడు. ఆ జంట మొత్తం వేరు వేరుగా రాస్తారు. అందరూ నవ్వుకుంటారు. ఇక క్రిష్ జ్యూస్‌లో మందు కలుపుకొని తెచ్చుకుంటాడు. ఆ జ్యూస్‌ని సత్య తీసుకొని తాగేస్తుంది. క్రిష్ సత్య మజ్జిగ తాగినట్లు అలా తాగేసింది ఏంటా అనుకుంటాడు. సత్య కూల్ డ్రింక్ చాలా బాగుంది అని ఇంతకు ముందు ఎప్పుడూ తాగలేదు అని మళ్లీ తీసుకొచ్చి ఇవ్వమని క్రిష్‌కి చెప్తుంది. క్రిష్ వెళ్లి సత్య కోసం మామూలు జ్యూస్ తెచ్చి తనకోసం మళ్లీ మందు కలుపుకుంటాడు. మళ్లీ సత్య మందు కలిపిన జ్యూస్ తాగేస్తుంది. మళ్లీ తనకు కావాలని అడుగుతుంది. క్రిష్ ముందు దగ్గరకు వెళ్లి మళ్లీ మందు తాగేస్తుంది. తర్వాత క్రిష్, సత్య పెర్మామ్ చేయమని అంటాడు.
క్రిష్: బాబాయ్ తేడా జరిగింది గేమ్ మొత్తం ఆపేసేయ్.
సత్య: ఏయ్ గేమ్ ఎందుకు ఆపాలి. గేమ్ మేం గెలవాలి అంతే. ఏయ్ సంబంధం చీటీ తీసుకురా అంతే. అంకుల్ ఇదిగో చదవండి..
క్రిష్: కూల్ డ్రింక్‌లో కలిపిన మందు తాగింది.
చక్రవర్తి: భర్త భార్యలా భార్య భర్తలా నటించాలి.
సత్య: వావ్ అంటే నేను క్రిష్‌గారిని ఇది సంపంగి అంతేకదా. ఏయ్ నడు.. దులిపేద్దాం. చంపేద్దాం. కిరాక్ యాక్టింగ్ చేద్దాం రా సంపంగి.. రావే..
క్రిష్: సత్యా...
సత్య: సంపంగి నా దిల్‌కా దడకన్. అంత దూరంగా నిల్లొంటావ్ ఏంటి దగ్గరకు రా.
క్రిష్: వదులు.. దగ్గరకు ఎందుకు రమ్మంటున్నావో నాకు బాగా తెలుసు. అవకాశం దొరికింది కాదా అని నా మీద చేయి వేద్దాం అనే కదా. నీ మనసులో ఎప్పుడూ దుర్దుద్దేశం ఉంటూ ఉంటుంది.
సత్య: అవును నా మనసు అంతా అదే ఉద్దేశం అయితే ఏంటి నువ్వు నా పెళ్లానివి. నిన్ను ఏం చేసే అధికారం అయినా నాకు ఉంది.
క్రిష్: ఆడదానికి మనసు ఉంటుందని తెలుసుకో. రౌడీలా ప్రర్తించకు.
సత్య: నేను అంతేలే. బరాబర్ రౌడీలా ప్రవర్తిస్తా. అంతెందుకు నిన్ను రౌడీయిజం చేసే కదా ఈ పెళ్లి చేసుకున్నాను.
క్రిష్: మరి నా ఇష్టంతో పని లేదా.
సత్య: నీ ఇష్టం ఏంటి ఆడదానివి. మొగుడికి నచ్చినట్లు ఉండాలి. ఆకలి అని చెప్తే అన్నం పెట్టాలి. మూడ్ వస్తే ముద్దులు పెట్టాలి అంతే నీ పని. అర్థమైందా. నీ కోసం పెళ్లికి ముందే పతంగి ఇచ్చాను. పట్టుచీర ఇచ్చా. ఇంకొకరితో పెళ్లి అంటే లొల్లి చేశా లొల్లి. నీ ఫ్యామిలీ మొత్తాన్ని రోడ్డు మీదకు ఈడ్చాను. నీ అన్న ఒప్పుకోకపోతే వాడిని కూడా బెదిరించి నిన్ను పెళ్లి చేసుకున్నా. ఇవన్నీ నీ మీద ప్రేమతోనే జేసినా. నా లాంటి ప్రేమికుడు దొరుకుతాడా. కానీ ఎప్పుడు చూడు నువ్వు నాకు నచ్చలే నచ్చలే అని ఒకటే లొల్లి పెడతావ్. నాకేం తక్కువ సంపంగి నువ్వే చెప్పు. నీ విషయంలో ఎవరైనా తల దూర్చితే మానవత్వం లేని రాక్షసుడిని అయిపోతా. అవసరం అయితే ప్రాణాలు తీసేస్తా. నువ్వు ఆఫ్ట్రాల్ ఆడదానివి. మా కాందాన్‌లో ఆడది అంటే ఆటబొమ్మ. పెళ్లాం మనసుతో మాకు పనిలే. ఒక్క మాటలో చెప్పాలి అంటే నువ్వు నా ప్రేమకు బానిసవి. అర్థమైందా.
సత్య మాటలు విన్న క్రిష్ కన్నీరు పెట్టుకుంటూ సత్యని ఇంత బాధ పెట్టానా అని ఫీలవుతాడు. ఇక సత్య తూగుతూ ఉంటే క్రిష్ మీద పడిపోతుంది. చక్రవర్తి ప్రోగ్రామ్ అయిపోయింది అని అందరికీ భోజనాలకు వెళ్లమని చెప్తాడు. ఇక చక్రవర్తి క్రిష్‌తో సత్య మనసులో ఎంత పెయిన్ ఉందో తెలుసా అని అంటాడు. క్రిష్ తల ఊపుతాడు.
నందిని హర్షతో మాట్లాడుతుంది. తన అన్న పరువు సత్య తాగి వాగి తీసేసిందని అంటుంది. హర్ష తన చెల్లి తాగదని చెప్తాడు. నందిని తనని ఎందుకు పెళ్లి చేసుకున్నావని నిలదీస్తుంది. దీంతో హర్ష రాజీ పడాలని జరిగిన వన్నీ మర్చిపోవాలి అని అంటాడు. నందినితో జీవితం పంచుకోవాలి అని ఉందని, సంతోషంగా ఉండేలా చూసుకుంటానని తనతో కలిసి నడుస్తావా అని అడుగుతాడు. అది ఎప్పటికీ జరగదని నందిని హర్షతో తెగేసి చెప్తుంది. మరోవైపు క్రిష్ సత్యని గదికి తీసుకెళ్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.