Trinayani Today Episode పెద్ద బొట్టమ్మ కంట్లో సుమన కారం కొట్టిని నాటి నుంచి విశాల్ ఇంటికి రాని పెద్దబొట్టమ్మ కళ్లు కనిపించవని నాటకం ఆడుతూ రమణమ్మని వెంట పెట్టుకొని వస్తుంది. ఇక ఇద్దరినీ ఎద్దులయ్య చూసి నాటకం ఆడుతున్నావని గ్రహిస్తాడు. 


ఎద్దులయ్య: గుర్తు పట్టకుండా కాస్త మెరుగులు దిద్దుకొని వచ్చినా రాత బాగోకపోతే ఏమీ చేయలేం కదా.
పెద్దబొట్టమ్మ: ఎద్దులయ్య నాకు కళ్లు కనిపిస్తున్నాయి. కానీ ఈ విషయం నువ్వు ఎవరికి చెప్పొద్దు.
ఎద్దులయ్య: నేను అమ్మవారి లీలను గమనిస్తూ ఉంటూను అంతే. మీ పని మీది నా పని నాది. కానీ జాగ్రత్త. 
విశాల్: అరే పెద్దబొట్టమ్మ వచ్చింది. 
పావనా: ఏమైంది పెద్ద బొట్టమ్మకి..
నయని: మొన్న కళ్లలో కారం పడటం వల్ల సరిగా చూడలేకపోతుందేమో పెద్దబొట్టమ్మ.
రమణమ్మ: పూర్తిగా కళ్లు కనపడటం లేదు అనుకుంటా అమ్మ. రోడ్డు కూడా దాట లేకపోతుంటే తీసుకొని వచ్చాను.
వల్లభ: నువ్వు ఆవిడ చుట్టమా..
సుమన: ఉలూచిని చూడటానికి వచ్చినా ప్రయోజనం లేదు కదా. ప్రయాస పడటం తప్ప చూడలేదు కదా.
పెద్దబొట్టమ్మ: దారి తప్పి ఎటు వెళ్తానా అని ఇటు వచ్చాను సుమన.  
తిలోత్తమ: పర్లేదులే పెద్ద బొట్టమ్మ రావాల్సిన చోటుకే వచ్చావు కదా.
ఎద్దులయ్య: ఎవరైనా ఇక్కడికే రావాలి ఇక్కడి నుంచే పోవాలి.  
నయని: ఎద్దులయ్య అలా అంటే బెదిరిపోతారు కదా.
ఎద్దులయ్య: నీకు తెలీదా మాత. నాకు తెలుసన్న మాట నీకు తెలుసోలేదో కానీ నాగులమ్మకి తెలుసు. ఆమెకు తెలుసన్న వాస్తవం తీసుకొచ్చిన ఈమెకు తెలీదు.
రమణమ్మ: ఏమ్మా నీకు తెలిసిన వారి ఇంటికి నీకు తీసుకొచ్చాను. నాకు సెలవా ఇక.
ఎద్దులయ్య: సెలవే.
తిలోత్తమ: నీ పేరు ఏంటమ్మా..
పెద్దబొట్టమ్మ: రంగమ్మ..
రమణమ్మ: ఇందాక చెప్పాను గుర్తు పెట్టుకుంది. 
తిలోత్తమ: పెద్దబొట్టమ్మను తీసుకొచ్చి ఎండను పడి వెళ్తా అంటావ్ ఏంటి సాయంత్రం వెళ్దువులే.
రమణమ్మ: సరే అమ్మ. 


ఇంతలో గాయత్రీ అమ్మ చీర ఎగురుకుంటూ వచ్చి రమణమ్మ మీద పడుతుంది. దాంతో నయని అమ్మగారి చీర రంగమ్మ మీద పడింది అంటే మిమల్ని అమ్మగారు ఆశీర్వదించినట్లే. ఇక రంగమ్మ గాయత్రీ దేవి ఫొటో చూసి కలగా ఉందని అంటుంది. అయితే రమణమ్మకు గాయత్రీ దేవి కథ మొత్తం తెలిసినప్పటికి ఆమెను రంగమ్మ అనుకొని ఏమీ తెలీదనుకొని మనిషి ఒక కథ చెప్తారు. సుమన అయితే దారిన పోయిన నీకు ఆవిడ గురించి అవసరమా అని అంటుంది. 


విశాల్: సుమన మా అమ్మ గురించి తెలుసుకోవాలి అని అందరికీ ఉంటుంది.
సుమన: మీకు తప్ప. 
నయని: సుమన.. 
సుమన: అన్నిదాంట్లో తప్పేమీ లేదు అక్క తప్పిపోయిన కన్నతల్లి గురించి తెలుసుకోకుండా సైలెంట్‌గా ఉన్నారు అని అలా అన్నాను. 
తిలోత్తమ: చిన్న కోడలా నువ్వు నిజం చెప్పినా సరే ఒక్కో సారి రుచించదు. బయట నుంచి వచ్చిన వారి ఎదుట మన గురించి చెప్పడం ఎందుకు.
ఎద్దులయ్య: అందరికీ అంతా తెలుసు. తెలియనిది ఎవరికి అంటే ఎవరికి వారే తెలియనట్లు ఉండే వారికే. 


వల్లభ: అమ్మా పెద్దబొట్టమ్మకు కళ్లు కనిపించవు అంటే ఓకే కానీ ఆమె వెంట వచ్చిన ఆవిడకు కూడా అతిథి మర్యాదలు చేయమని అంటున్నావ్ ఆశ్చర్యంగా ఉంది.
తిలోత్తమ: పెద్దబొట్టమ్మ వచ్చింది అంటే ఏదో ఉండే ఉంటుంది. తన వెంట వచ్చిన ఆవిడకు ఏదో పని పడే ఉంటుందని నాకు అనుమానంగా ఉంది. పాములకు నువ్వు చుట్టమా అని అడిగినప్పుడు తనలో భయంగానీ కంగారు కానీ లేదు. మనం ఎన్ని మాటలు మాట్లాడిన తను తొనకలేదు బేనక లేదు. 
సుమన: ఇక్కడ వాళ్లు కూడా తిష్ట వేస్తామంటే ఇళ్లు సరిపోదు అత్తయ్య. వాళ్లని నేను ఎలా అయినా పంపేస్తాను. 


ఇంతలో హాసిని తిలోత్తమను తీసుకొని వచ్చి ఇది తిలోత్తమ అత్తయ్య గది అని చెప్తుంది. దీంతో పెద్దబొట్టమ్మ పొరపాటు అయిందని చెప్తుంది. గదిలోకి వచ్చి పొరపాటు అంటావ్ ఏంటి అని అంటుంది తిలోత్తమ. ఇక సుమన గోడలు పట్టుకొని నా గదికి వెళ్దామనుకున్నావని అడుగుతుంది. ఇక హాసిని మనం పెద్దబొట్టమ్మని జాగ్రత్తగా చూసుకోవాలి అని అంటుంది.


విశాల్, నయని, విక్రాంత్, హాసినిలు బిజినెస్ విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక తిలోత్తమ, వల్లభలు గ్లాస్‌లోని జ్యూస్‌లో విషం కలుపుతుంది. ఇక రమణమ్మ, నాగులమ్మ కూడా కాఫీలో విషం కలుపుతారు. 


పెద్దబొట్టమ్మ: ఎవరైనా ఆపదలో ఉంటే నయనికి తెలిసిపోతుంది రమణమ్మ.
రమణమ్మ: అందుకే రెండు కప్పుల్లో విషం కాలిపాను.  
పెద్దబొట్టమ్మ: ఒకటి తిలోత్తమ తాగడానికి అన్నావు. మరొకటి ఎవరికి.
రమణమ్మ: నాకే. 
తిలోత్తమ: నాకు ఉన్న డౌట్‌కి ఇది చేసి తీరాలి వల్లభ.


ఇక రమణమ్మ అందరికీ కాఫీ ఇస్తుంది. వల్లభ వచ్చి సాయంత్రం వెళ్లిపోయే గెస్ట్‌తో మనం కాఫీ కలిపించడం ఏంటని అంటుంది. ఇక రమణమ్మ తిలోత్తమకు విషం కలిపిన కాఫీ ఇస్తే తిలోత్తమ విషం కలిపిన జ్యూస్‌ రమణమ్మకి ఇస్తుంది. వల్లభ నయని ఇంకా గ్రహించలేదు అంటుంది. ఇంతలో పెద్దబొట్టమ్మ ఏం తాగడం లేదు అని  అందరూ అనడంతో పెద్దబొట్టమ్మ జ్యూస్ రమణమ్మ దగ్గర తీసుకొని తాగేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: బిజీ బిజీగా రణ్‌బీర్.. ఇటు 'రామాయ‌ణ', త్వ‌ర‌లోనే 'ల‌వ్ అండ్ వార్'